అడవిలో మిస్టరీ. వాగులో తేలియాడిన చిరుత మృతదేహం!
దట్టమైన అడవి, అందులో నిశ్శబ్దంగా ప్రవహించే వాగు… కానీ ఆ ప్రశాంతతను ఒక్కసారిగా చీల్చేసింది ఒక భయానక దృశ్యం. మధ్యప్రదేశ్ చింద్వారా జిల్లా ఛిందీ అటవీ ప్రాంతంలో వాగులో చిరుతపులి మృతదేహం తేలియాడుతూ కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. అడవిలో సంచరిస్తున్న వన్యప్రాణికి ఏమైంది? వేటగాళ్ల పనా? లేక ప్రకృతి సృష్టించిన ప్రమాదమా? అనే అనుమానాలు ఒక్కసారిగా తెరపైకి వచ్చాయి.
ఈ ఘటనను మంగళవారం అటవీ శాఖ అధికారులు ధృవీకరించారు. ఛిందీ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని భూద్‌కుమ్ బీట్‌లో వాగులో చిరుత కళేబరం కనిపించినట్లు ఎస్‌డీఓ అనాది బుదౌలియా తెలిపారు. సమాచారం అందిన వెంటనే అటవీ సిబ్బంది, పశువైద్యులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్‌మార్టం నిర్వహించారు.

పోస్ట్‌మార్టం ప్రాథమిక పరిశీలనలో చిరుత శరీరంపై ఎలాంటి గాయాలు లేవు, ఏదైనా జంతువును వేటాడిన చిహ్నాలు లేవని అధికారులు వెల్లడించారు. దీంతో వేటగాళ్ల పాత్ర లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైద్యులు గమనించిన లక్షణాల ఆధారంగా చిరుత గుండెపోటు లేదా తీవ్రమైన అంతర్గత వ్యాధి కారణంగా మృతి చెందినట్లు అనుమానిస్తున్నట్లు అటవీ శాఖ తెలిపింది.
మరణించిన చిరుత సుమారు ఎనిమిది సంవత్సరాల వయస్సు గల మగ చిరుతగా గుర్తించారు. ఇది చాలా కాలంగా అదే అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు అటవీ సిబ్బంది తెలిపారు. ఆకస్మికంగా ఇలా మృతి చెందడం అటవీ శాఖను ఆందోళనకు గురి చేసింది.
వైద్యులేమన్నారంటే..
“మరణానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా నిర్ధారణ కాలేదు. అవయవాల నమూనాలను ల్యాబ్‌కు పంపాం. తుది నివేదిక వచ్చిన తర్వాతే అసలు కారణం వెల్లడవుతుంది” అని ఎస్‌డీఓ అనాది బుదౌలియా తెలిపారు.
వన్యప్రాణి నిపుణుడు డాక్టర్ అంకిత్ మేశ్రమ్ మాట్లాడుతూ, చిరుతపులులకు కూడా గుండెపోటు లేదా కార్డియాక్ అరెస్ట్ సంభవించే అవకాశం ఉందని తెలిపారు. “చిరుతలు తీవ్రమైన ఒత్తిడికి లోనైనప్పుడు, భయాందోళనకు గురైనప్పుడు లేదా వలలో చిక్కుకున్నప్పుడు హఠాత్తుగా గుండె ఆగిపోవచ్చు. గతంలో ఇలాంటి ఘటనలు నమోదయ్యాయి” అని ఆయన వివరించారు.
చిరుతను చంపిన చలి..?
ఇటీవల చింద్వారా జిల్లాలో ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోవడం, తీవ్ర చలిగాలులు వీయడం కూడా చిరుత ఆరోగ్యంపై ప్రభావం చూపి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. వాతావరణ పరిస్థితులు, ఒత్తిడి, అంతర్గత వ్యాధులు కలిసి ఈ దుర్ఘటనకు కారణమై ఉండవచ్చన్న కోణంలో అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
చిరుత మృతికి సంబంధించిన పూర్తి వివరాలు తుది పోస్ట్‌మార్టం నివేదిక వెలువడిన తర్వాతే స్పష్టతకు రానున్నాయి. అప్పటివరకు ఈ ఘటన చింద్వారా అడవుల్లో ఒక మిస్టరీగా మిగిలింది.
గతంలోనూ అనేక ఘటనలు..
చిరుతపులులు, ఇతర పెద్ద పులుల్లో గుండెపోటు (కార్డియాక్ అరెస్ట్) కారణంగా మరణాలు జరిగిన సందర్భాలు గతంలో ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యాయి. ముఖ్యంగా భారత్‌లోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా, ఎలాంటి బాహ్య గాయాలు లేకుండా చిరుతలు అకస్మాత్తుగా మృతి చెందిన ఘటనలపై అటవీ శాఖలు, పశువైద్యులు నివేదికలు ఇచ్చారు. పోస్ట్‌మార్టం పరీక్షల్లో కొన్ని సందర్భాల్లో గుండెపోటు, అంతర్గత అవయవాల వైఫల్యం లేదా తీవ్రమైన వ్యాధులే మరణానికి కారణమని తేలింది.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు












Click it and Unblock the Notifications