ప్రేమించలేదని యువతిని హత్య చేసిన లెస్బియన్
కోల్‌కత్తా: పశ్చిమ బంగాలో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. తనను ప్రేమించడం లేదన్న కారణంతో ఓ లెస్బియన్ యువతి మరో యువతిని దారుణంగా పొడిచి చంపింది. కోల్‌కతాలోని గార్డెన్ రీచ్‌లోని రైల్వేకాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
రైల్వే కాలనీలోని ఇళ్లల్లో పాచిపనులు చేసుకునే ఓ యవతిని మరో యువతి ప్రేమించాలంటూ గత కొంతకాలంగా వెంటపడుతోంది. శుక్రవారం ఇదే విషయమై ఆ యువతిపై ఒత్తిడి తీవ్రతరం చేయడంతో ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. దీంతో ముందుగానే తన వెంట తెచ్చుకున్న కత్తితో లెస్బియన్ యువతి బాధిత యువతిని కత్తితో పొడిచింది.

కత్తిపోట్లకు గురై పడి ఉన్న యువతి దేహాన్ని చూసి యజమాని పోలీసులకు సమాచారమందించారు. కత్తిపోట్లతో అపస్మారకస్థితిలోకి వెళ్లిన బాధితురాలిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందిందని వైద్యులు చెప్పారు. మృతురాలు తన తల్లి, నలుగురు అన్నలు, అక్కాచెల్లెళ్లతో కలిసి కాలనీకి సమీపంలోని ఓ ఇంట్లో నివసిస్తోంది.
యువతి మృతి వెనుక ఓ లెస్బియన్ హస్తముందని పోలీసులు విచారణలో తేలింది. ప్రేమిస్తున్నానంటూ ఓ యువతి వేధింపులకు పాల్పడింది. లవర్‌గా ఒప్పుకోమని ఒత్తిడి చేయగా బాధితురాలు తిరస్కరించింది. దాంతో ఆమెను లెస్బియన్ దారుణంగా కత్తితో పొడిచి హత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది. ప్రస్తుతం లెస్బియన్ పరారీలో ఉంది. పోలీసులు అమె కోసం గాలిస్తున్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications