అబ్బాయిలు అబ్బాయిల్లా..అమ్మాయిలు అమ్మాయిల్లానే ఉండాలి: టోనీ అబ్బాట్

సిడ్నీ: క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని లింగ నిర్దిష్ట బొమ్మల గురించి మంగళవారం జరిగిన చర్చలో ఆస్ట్రేలియాలో ప్రధాని టోనీ అబ్బాట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మాయిలు అమ్మాయిల్లా.. అబ్బాయిలు అబ్బాయిల్లా ఉండాలని చెప్పారు. సాంప్రదాయాలను కొనసాగించాలని అన్నారు.

కాగా, గ్రీన్స్ సెనేటర్ లారిస్సా వాటర్స్ ‘నో జెండర్ డిసెంబర్' ప్రచారానికి మద్దతు పలికారు. సాధారణంగా అమ్మాయిలకు బొమ్మలు, అబ్బాయిలకు ట్రక్కులు కొనుగోలు చేసే మూస దోరణిని అడ్డుకట్ట వేయాలని ఆమె అన్నారు.

ఇది ఇలా ఉండగా.. ముగ్గురు ఆడ పిల్లలకు తండ్రి అయిన టోనీ అబ్బాట్.. తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి అనిపించేదే చేస్తారని చెప్పారు. తనకు రాజకీయ సవ్యతపై నమ్మకం లేదని చెప్పారు. ‘నా ఫిలాసఫీ ప్రకారం అమ్మాయిలు అమ్మాయిల్లా.. అబ్బాయిలు అబ్బాయిల్లా ఉండాలి' అని టోనీ అబ్బాట్ తెలిపారు.

 `Let boys be boys, let girls be girls,` says Australian PM

ఏది ఎలా వున్నా.. తల్లిదండ్రుల ఆలోచనలు తమ పిల్లలకు మేలు చేసేవిగా ఉంటాయని చెప్పారు. కాగా, ‘నా క్రిస్మస్ చెట్టు కింద సాధారణంగా ఎలాంటి లింగ భేదం ఉండదు' అనే నినాదంతో ఆన్‌లైన్‍లో ‘నో జెండర్ డిసెంబర్' పేరిట ప్రచారం కొనసాగుతోంది.

ప్రత్యేకమైన పింక్, బ్లూ క్యాటలాగ్ బొమ్మలు అమ్మాయిలు, అబ్బాయిల కోసమని, ఈ బొమ్మలతో అమ్మాయిలు, అబ్బాయిలు ఆడుకోవచ్చని వాటర్స్ చెప్పారు. ఇది పురుషులు, మహిళల మధ్య ఉన్న అసమానత్వాన్ని కులదోస్తుందని తెలిపారు. ప్రత్యేకమైన బొమ్మలను అమ్మాయిలకు, అబ్బాయిలకు వేర్వేరుగా కేటాయించడం వల్ల ఇది జరగదని అన్నారు.

ఇలా వేర్వేరుగా చూపడం వల్ల చిన్నారులపై దీర్ఘకాలిక ప్రభావాలు చూపుతాయని, వారి జీవిత లక్ష్యాలు కూడా భిన్నంగా తయారవుతాయని ఆమె చెప్పారు. మూస దోరణిలో అమ్మాయిలను, అబ్బాయిలను చిన్నతనం నుంచి సమానంగా చూడకపోవడం వల్ల చాలా సమస్యలు వస్తాయని, గృహ హింసకు దారితీస్తుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

ఇది ఇలా ఉండగా కన్జర్వేటివ్ సెనేటర్ కోరి బెర్నార్డీ అబ్బాట్ వ్యాఖ్యలకు మద్దతు పలికారు. వాటర్స్ వ్యాఖ్యలు చాలా వింతగా ఉన్నాయని అన్నారు. కిస్మస్ వేడుకలు సెనేటర్ వాటర్స్‌కు సాధారాణ జ్ఞానాన్ని కలిగిస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+