వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మద్యం అమ్మనివ్వండి... లేదంటే కుటుంభంతో సహ ఆత్మహత్య చేసుకుంటా...!

|
Google Oneindia TeluguNews

గుజరాత్‌తో మద్యనిషేధం ఉన్నా...తనకు మాత్రం మద్యం అమ్మడంతోపాటు, పేకాట స్థావరానికి అనుమతి ఇవ్వాలని,లేదంటే తన కుటుంభ సభ్యులతో పాటు ఆత్మహత్య చేసుకుంటానని రాజ్‌కోట్‌లోని మెహెన్సా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఏకంగా రాష్ట్ర సీఎంతోపాటు, పోలీస్ బాస్ అయిన డీజీపీకి బెదిరింపు లేఖ రాశాడు..దీంతో పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు.

గుజరాత్‌లోని రాజ్‌కోట్ ప్రాంతానికి చెందిన యూసఫ్ ఖాన్ అనే వ్యక్తి వికలాంగుడు..అయితే తన కుటుంభాన్ని పోషించేందుకు జీవనాధారం కావాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రుపానితోపాటు డీజీపీ శివానంద్ ఝాకు ఓ లేఖను రాశాడు. తాను మద్యం అమ్మేందుకు అనుమతి ఇవ్వడంతోపాటు పేకాటను నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని అందులో పేర్కోన్నాడు. లేదంటే తన కుటుంభ సభ్యులతో కలసి నిప్పంచుకుని ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించాడు.

Let me sell liquor or I’ll commit suicide

దీంతో ఖంగు తిన్న పోలీసులు యూసఫ్ ఖాన్‌ ‌ను అరెస్ట్ చేశారు. అనంతరం ఎలాంటీ దుశ్చర్యకు పాల్పడనని హమి ఇచ్చిన తర్వాత బెయిల్‌పై వదిలి వేశారు.అయితే యూసఫ్ ఖాన్ ఓ ప్రమాదంలో కాలు పోగోట్టుకున్నాడు. దీంతో జీవనాన్ని కొనసాగించలేక పోతున్నానని తన పిల్లలకు కనీసం స్కూల్ ఫీజు కూడ చెల్లించలేని స్థితిలో ఉన్నానని తెలిపాడు. ఈ నేపథ్యంలోనే స్థానిక మెహెన్సా ఆసుపత్రి సర్టిఫికెట్‌తో మద్యం అమ్మేందుకు తనకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కొరినట్టు యూసఫ్ తెలిపాడు.

English summary
A man named Yusuf Khan Sheikh was arrested in Rajkot's Mehsana on Saturday, July 14 for threatening to set himself and his family members on fire. The accused claimed that he would end his life if the government did not permit him to sell alcohol or start a gambling den.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X