టెక్కీలకు శుభవార్త:ట్రంప్ విధానాలతో సంబరాలు చేసుకోవాలి, అవకాశాలను సృష్టించుకోవాలి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్ -1 B వీసాల్లో తీసుకొంటున్న కఠిన చర్యలతో భారతీయ ఐటి సర్వీసులు భయపడాల్సిన పనిలేదని టిసిఎస్ చైర్మెన్ ఎన్ .చంద్రశేఖరన్ చెప్పారు.
ముంబై:అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్ -1 B వీసాల్లో తీసుకొంటున్న కఠిన చర్యలతో భారతీయ ఐటి సర్వీసులు భయపడాల్సిన పనిలేదని టిసిఎస్ చైర్మెన్ ఎన్ .చంద్రశేఖరన్ చెప్పారు.
అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారతీయ ఐటి సర్వీస్ కంపెనీలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.
ఎన్నికల ప్రచారంలో ట్రంప్ స్థానికులకే అవకాశాలు కల్పిస్తామని హమీ ఇచ్చారు. ఈ హమీ ప్రకారంగానే ట్రంప్ అధికారంలోకి రాగానే వాటిని అమలు చేయడం ప్రారంభించారు.
డొనాల్డ్ ట్రంప్ తీసుకొన్న విధానాల కారణంగా ఐటి కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. ఈ విషయమై ప్రముఖ ఐటి కంపెనీలు ట్రంప్ నిర్ణయాల పట్ల తమ నిరసనను కూడ వ్యక్తం చేశాయి.

ట్రంప్ విధానాలతో ఇబ్బంది పడాల్సిందేమీ లేదు
అమెరికా అధ్యక్షుడు అనుసరిస్తోన్న విధానాల కారణంగా ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని టీసిఎస్ ఛైర్మెన్ ఎన్ చంద్రశేఖరన్ చెప్పారు. అమెరికా ఉపాధి కల్పనను తగ్గించుకొంటే ఇండియా సెలబ్రేట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.ప్రత్యామ్నాయ విధానాలపై కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

కొత్త అవకాశాలను వెతుక్కోవాలి
వివిధ రకాల పరిశ్రమల్లో భౌగోళిక ప్రాంతాల్లో కొత్త అవకాశాలను ఇండస్ట్రీ వెలికి తీయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. నాస్కామ్ ఇండియా లీడర్ షిఫ్ ఫోరమ్ లో ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు.హెచ్ -1 B వీసాలో కఠినతరమైన నిబంధనలు తీసుకురావడం వీసా ధరలు పెంచడం ఇవేమీ దేశీయ ఐటి ఇండస్ట్రీకి సవాళ్ళు కాదన్నారు.ఇవి కొత్త కొత్త అవకాశాలన్నారు చంద్రశేఖరన్.

ఎక్కడైనా పనిచేసేలా కార్యాచరణను రూపొందించుకోవాలి
ఐటి పరిశ్రమలు ఎక్కడైనా ఐటీ సర్వీసులు వర్క్ చేసే విధంగా ప్రత్యామ్నాయ విధానాలను అన్వేషించాలని ఆయన కోరారు.హెచ్ -1 B వీసాలో నిబంధనలు మార్చిన ప్రతిసారి దేశీయ ఐటి ఇండస్ట్రీ చిక్కుల్లో పడుతోందని వార్తలు వస్తుంటాయి కానీ, ఇవి పరిశ్రమకు అత్యంత ఉత్తేజకరమైనవన్నారు.

డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ తో ప్రయోజనం
పరిశ్రమను మరింత విస్తరించేందుకుగాను డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ ఎంతో సహకరిస్తోందన్నారు. మైక్రోసాఫ్ట్ ఉత్పత్తి విండోస్ ఆపరేటింట్ సిస్టమ్ లాంటిందన్నారు. అయితే భారతీయులు ఎందుకు దీన్ని రూపొందించలేకపోయారని అడగటం కాదు, మరో టీసిఎస్ ను నీవే ఎందుకు సృష్టించలేకపోయావని మనమే మైక్రోసాఫ్ట్ ను ప్రశ్నించాలని చంద్రశేఖరన్ సవాల్ విసిరారు.

కెనడాలో ఉద్యోగావకాశాలు
అమెరికా అధ్యక్షుడు అమలుచేస్తోన్న కఠినతరమైన నిబంధనల కారణంగా కెనడా ప్రత్యేకంగా భారత్ ఐటి కంపెనీలను, టెక్కీలకు ఉద్యోగావకాశాలను కల్పించేందుకుగాను ప్రత్యేక చర్యలను తీసుకొంటుంది.అంతేకాదు ప్రత్యేక వీసా నిబంధనలను తీసుకురానుంది. ఈ మేరకు ఐటి కంపెనీల యాజమాన్యాలు ఈ మేరకు ఆ దేశ పాలకులను కోరాయి.












Click it and Unblock the Notifications