బెంగుళూరులో టెక్కీకి షాక్: సెక్స్‌లో పాల్గొనాలంటూ క్యాబ్ డ్రైవర్ ఒత్తిడి

హైదరాబాద్: కొత్త చట్టాలు, భద్రతా పరంగా ఎన్ని చర్యలు తీసుకుంటున్నా మహిళా ఉద్యోగులకు భద్రత లేదనే విషయం మరోసారి రుజువైంది. తాజాగా బెంగుళూరులో 24 ఏళ్ల టెక్కీపై క్యాబ్ డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

పోలీసుల కథనం ప్రకారం... బాధితురాలు బెంగుళూరులోని అమెజాన్ డెవలప్ సెంటర్‌లో విధులను నిర్వహిస్తోంది. తన ఇంటి నుంచి ఆఫీసు వచ్చేందుకు రెండు గంటల సమయం పడుతుంది. ఆఫీసు క్యాబ్‌లో ప్రతిరోజూ ఆ మహిళా టెక్కీ ఆఫీసుకు వచ్చేది. ఇలా ఆఫీసుకు వచ్చే మార్గంలో క్యాబ్ డ్రైవర్ మాటలతో ఆమెపై లైంగికంగా హింసించాడు.

బాధితురాలు గత బుధవారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో తన ఇంటి వద్ద క్యాబ్ ఎక్కింది. సంతోష్ సోమేగౌడ అనే వ్యక్తి తొలిసారిగా తానెక్కిన క్యాబ్‌కు డ్రైవర్‌గా వచ్చాడు. క్యాబ్‌లో ఎక్కిన తర్వాత డ్రైవర్ సోమేగౌడ తనతో మాట్లాడటం ప్రారంభించాడు. మొదట్లో క్యాబ్ డ్రైవర్ యువతిని సాధారణ ప్రశ్శలు అడగటం జరిగింది.

‘Lets have sex,’ office cabbie scandalises Bengaluru techie

ఆ తర్వాత తన కుటుంబం గురించి కొన్ని ప్రశ్నలు అడిగాడు. అనంతరం ఆమెను మీరు ఎవరైనా ప్రేమించారా?, మీకు ఎవరైనా బాయ్ ప్రెండ్ ఉన్నారా? అంటూ ప్రశ్నించాడు. అయితే డ్రైవర్ ప్రశ్నలకు సమాధానం చెప్పడం ఇష్టలేని యువతి సెల్‌ఫోన్‌లో ఏదో చాటింగ్ చేస్తూ కూర్చుండి పోయింది.

దీంతో తనతో మాట్లాడటం ఇష్టం లేదని గ్రహించిన క్యాబ్ డ్రైవర్ తన మాటల వేడిని మరితంగా పెంచాడు. 'మేడమ్ ఆల్కహాల్ సేవించిన వ్యక్తి మిమ్మల్ని సెక్స్‌లో పాల్గొనాలంటూ ఒత్తిడి చేస్తే మీరేం చేస్తారంటూ?' అని అడగడంతో ఆ యువతి ఒక్కసారిగా కంగుతింది. ఈ సమయంలో ఆమె ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా సమయస్ఫూర్తితో వ్యవహారించింది.

ఇలాంటి సంఘటనలు ఎదురవుతాయనే ఉద్దేశంతోనే తన వద్ద ఎప్పుడూ పెప్పర్ స్పే ఉంచుకుంటానని ఆమె చెప్పింది. ఆ తర్వాత క్యాబ్ డ్రైవర్ ఆ యువతిని తనతో సెక్స్ చేయాల్సిందిగా కోరాడు. అంతేకాదు తాను సెక్స్‌లో పాల్గొనేటప్పుడు ప్రొటెక్షన్‌ను కూడా ఉపయోగిస్తానని ఆమెతో చెప్పాడు.

తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని, కేవలం సుఖం కోసమే ఇలా అడుగుతున్నానని యువతితో చెప్పాడు. మొదట మనిద్దరం స్నేహితులం అవుదామని, నువ్వొక్కతే ఇంట్లో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేస్తే ఇంటికొస్తానని అన్నాడు. దీంతో క్యాబ్ డ్రైవర్ వ్యాఖ్యలకు ఆ యువతి షాక్‌కు గురైంది.

క్యాబ్ డ్రైవర్ తనతో ఈ విధంగా మాట్లాడేటప్పుడు ఆమె ఒక్కతే క్యాబ్‌లో ఉందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఇలా క్యాబ్ డ్రైవర్ తనతో అసభ్యంగా మాట్లాడుతున్నా, ఆఫీసుకు వచ్చే వరకు మౌనంగా ఉండిపోయానని తెలిపింది. ఆఫీసు సమీపానికి రాగానే డ్రైవర్ తనకు 'ఐ లవ్ యూ' చెప్పాలని తనపై ఒత్తిడి కూడా చేశాడని పేర్కొంది.

ఆఫీసు బిల్డింగ్ వద్దరు రాగానే వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి క్యాబ్ డ్రైవర్‌పై ఆఫీసులో ట్రాన్స్‌ఫోర్ట్ సిబ్బందికి ఫిర్యాదు చేసింది. దీంతో వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి పోలీసులు క్యాబ్ డ్రైవర్ సంతోష్ సోమేగౌడ అరెస్ట్ చేశారు.

క్యాబ్ డ్రైవర్ తనపై ఫిజికల్‌గా ఎలాంటి దాడి చేయలేదని, కేవలం మాటలతోనే లైంగికంగా వేధించాడని, తనతో సెక్స్‌లో పాల్గొనాల్సిందిగా కోరాడని బాధితురాలి ఫిర్యాదు చేసింది. ఈ నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడిపై లైంగిక వేధింపుల కింది కేసు నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+