LGM trailer: తమిళుల రుణం తీర్చుకుంటోన్న ధోనీ

చెన్నై: టీమిండియా మాజీ కేప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ రథ సారథి మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న మాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. ఓ స్టార్ హీరోకు ఏ మాత్రం తగ్గని రేంజ్‌లో అభిమానులను సంపాదించుకున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి ఒకరిద్దరు మినహా ఆ స్థాయిలో ఫ్యాన్ బేస్ మరో క్రికెటర్‌కు లేదు. ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాల్లో ఆయనకు ఉన్న క్రేజ్, ఇమేజ్ వేరు.

అలాంటి ఎంఎస్ ధోనీ- ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఇదివరకే ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించిన ఆయన తాజాగా తన కొత్త ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించారు. ఎంఎస్ ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ కింద తమిళంలో తొలి సినిమాను నిర్మిస్తోన్నారు. ఈ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్‌కు ధోనీ భార్య సాక్షి సింగ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తోన్నారు.

రమేష్ తమిళ్‌మణి దర్శకత్వంలో తెరకెక్కుతోంది మూవీ. ఆయన రాసిన అథర్వ - ది ఆరిజిన్ అనే న్యూ ఏజ్ గ్రాఫిక్ నవల ఆధారంగా ఎంఎస్ ధోనీ- తన ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ కింద మొట్టమొదటి సినిమాను తెరకెక్కిస్తోన్నారు. ఈ మూవీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. హరీష్ కల్యాణ్, ఇవానా, నదియా, యోగి బాబు.. లీడ్ క్యారెక్టర్లల్లో నటించారు.

MS Dhoni

ఎల్జీఎం- లెట్స్ గెట్ మ్యారీడ్ అనేది ఈ మూవీ టైటిల్. దీని ట్రైలర్ ఇవ్వాళ విడుదలయింది. ఈ సాయంత్రం చెన్నైలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంఎస్ ధోనీ.. ఈ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. త్వరలో సినిమాను విడుదల చేయాలని యూనిట్ భావిస్తోంది. సాక్షి సింగ్ ధోని, వికాస్ హసిజా నిర్మాతలు. షర్మిల జే రాజా, ఎంవీఎం వేల్‌మోహన్ అసోసియేట్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు.

ఈ సందర్భంగా ధోనీ మాట్లాడారు. చెన్నైతో తన క్రికెట్ జీవితానికి అవినాభావ సంబంధం ఉందని పేర్కొన్నారు. తన కేరీర్‌లో తొలి టెస్ట్ మ్యాచ్‌ను చెన్నైలో ఆడానని, అత్యధిక టెస్ట్ స్కోర్‌ను చెన్నైలోనే కొట్టానని అన్నారు. చెన్నై సూపర్ కింగ్స్‌‌ జట్టుకు సారథిగా వ్యవహరిస్తూ.. అయిదుసార్లు జట్టును ఛాంపియన్‌గా నిలిపానని అన్నారు. నిర్మాతగా తొలి సినిమాను తమిళంలోనే తీశానని చెప్పుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+