ఎల్ఐసీ రిక్రూట్‌మెంట్: 300 పోస్టుల కోసం వెంటనే అప్లై చేయండి
న్యూఢిల్లీ: దేశంలో ప్రముఖ ఇన్స్యూరెన్స్ సంస్థ లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 300 ఎల్ఐసీ ఇన్స్యూరెన్స్ అడ్వైజర్ పోస్టుల భర్తీకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కొనసాగుతోంది. ఈ పోస్టులకు ఎంపికైనవారు ఎల్ఐసీలో పార్ట్ టైమ్ ఇన్స్యూరెన్స్ అడ్వైజర్‌గా సేవలు అందించాల్సి ఉంటుంది.
కాగా, అడ్మినిస్ట్రేషన్ అండ్ డిఫెన్స్, ఫైనాన్స్ అండ్ ఇన్స్యూరెన్స్ విభాగాల్లో ఈ పోస్టులున్నాయి. ఇన్స్యూరెన్స్ ప్రొడక్ట్స్ సేల్స్, మార్కెటింగ్, కస్టమర్ సపోర్ట్ సర్వీస్, మార్కెట్ సర్వే, ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ లాంటి సేవల్ని అందించాల్సి ఉంటుంది. ఎంపికైనవారికి న్యూ ఢిల్లీలో పోస్టింగ్ ఉంటుంది. ఇవి పార్ట్ టైమ్ పోస్టులు మాత్రమే. మార్చి 31 దరఖాస్తులకు చివరి తేది.
మొత్తం ఖాళీలు: 300
విద్యార్హతలు:
10వ తరగతి పాసై ఉండాలి.
అనుభవం:
ఒక ఏడాది లేదా అంతకన్నా ఎక్కువ అనుభవం ఉండాలి.
అర్హత, నైపుణ్యాలు:
మార్కెటింగ్, సేల్స్ విభాగాల్లో ప్రావీణ్యం ఉండాలి.

విధులు:
ఇన్స్యూరెన్స్ ప్రొడక్ట్స్ సేల్స్, మార్కెటింగ్, కస్టమర్ సపోర్ట్ సర్వీస్, మార్కెట్ సర్వే, ఆఫ్టర్ సేల్స్ సర్వీస్
వేతనం:
నెలకు రూ.7,000 నుంచి రూ.25,000
దరఖాస్తులు ప్రారంభం: ఫిబ్రవరి 2, 2022
దరఖాస్తులకు చివరి తేది: మార్చి 31, 2022
దరఖాస్తు చేసుకునే విధానం
అభ్యర్థులు మొదట నేషనల్ కెరీర్ సర్వీస్ వెబ్‌సైట్ https://www.ncs.gov.in/job-seeker ఓపెన్ చేయాలి.
హోమ్ పేజీలో Latest Jobsపైన క్లిక్ చేసిన తర్వాత LIC of India అని సెర్చ్ చేయాలి.
ఎల్ఐసీ ఉద్యోగాలకు సంబంధించిన లింక్స్‌పై క్లిక్ చేయాలి.
పూర్తి వివరాలు చదివిన తర్వాత Apply పైన క్లిక్ చేయాలి.
కొత్త యూజర్ అయితే New Userపైన క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేయాలి.
Register As పైన క్లిక్ చేసి Jobseeker ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
రిజిస్ట్రేషన్ ఫామ్‌లో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ కార్డ్ లాంటి వివరాలు ఎంటర్ చేయాలి.
అనంతరం నిబంధనలు అంగీకరించి సబ్మిట్ చేయాలి.
రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేస్తే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.
నోటిఫికేషన్ కోసం ఇక్కడి క్లిక్ చేయండి.
మరో నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మూడో నోటిఫికేషన్ ఇక్కడ క్లిక్ చేయండి












Click it and Unblock the Notifications