ఆయుషు తగ్గింది.. రెండేళ్ల సమయం... ఎందుకంటే...
కరోనా వైరస్ వ్యాప్తి చెందడం వల్ల దేశ ప్రజల ఆయుర్ధాయం సగటున రెండేళ్లు తగ్గిందని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ పాపులేషన్ స్టడీస్ అనె సంస్ధ వెల్లడించింది. దేశ ప్రజల జీవితకాలం తగ్గిందని సంస్ధ ఇటీవల నిర్వహించిన సర్వేలో తేలింది. కరోనా మహమ్మారి వల్ల ఆడ, మగవారిలో ఆయుష్షు తగ్గినట్లు తేల్చారు. సంస్ధ నిర్వహించిన సర్వే వివరాలను బీఎంసీ పబ్లిక్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించారు. ఐఐపీఎస్ ప్రొఫెసర్ సూర్యకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో ఆ నివేదికను పొందుపరిచారు. 2019లో పురుషుల్లో జీవితకాలం 69.2 ఏళ్లు కాగా, ఆడవారిలో 72 ఏళ్లుగా ఉంది. ఆయుష్షు రెండేళ్లు తగ్గడం వల్ల.. పురుషుల్లో 67.5 ఏళ్లు, మహిళల్లో 69.8 ఏళ్లకు సగటు ఆయుష్షు చేరినట్లు ఆ నివేదికలో తెలిపారు.

తగ్గిన జీవితకాలం
2020లో కోవిడ్ వల్ల 35 నుంచి 79 ఏళ్ల వయసున్న వారిలో ఎక్కువ శాతం మరణాలు సంభవించిందని తేల్చారు. దీనివల్ల జీవితకాలం తగ్గినట్లు స్పష్టమవుతోందని యాదవ్ అన్నారు. అంటు వ్యాధులు ప్రబలినప్పుడల్లా ప్రజల ఆయుర్ధాయం క్షీణిస్తోందని ఐఐపిఎస్ డైరెక్టర్ డాక్టర్ కేఎస్ జేమ్స్ అన్నారు. ఆఫ్రికన్ దేశాలలో హెచ్ఐవీ ఎయిడ్స్ మహమ్మారి వ్యాపించిన సమయంలో కూడా అక్కడి ప్రజల్లో ఆయుర్దాయం తగ్గిందని చెప్పారు.

కరోనా ఇంపాక్ట్
ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. వైరస్‌ను జయించేందుకు రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు. దీనిపై ప్రకటన రాలేదు.

డేంజరస్ డెల్టా
ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు డిసెంబర్ వరకు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. జనవరి నుంచి ఏప్రిల్ వరకు థర్డ్ వేవ్ ఇంపాక్ట్ ఉంటుందని హెచ్చరిస్తున్నారు. దానిని దాటేస్తే గానీ.. పరిస్థితి ఏంటో చెప్పలేమని ఒకవిధంగా వార్నింగ్ ఇస్తున్నారు.
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications