బాలికను కిడ్నాప్ చేసిన కిలాడీ లేడీలు, కామాంధులను పిలిపించి లైంగిక దాడి, జీవిత ఖైదు శిక్ష !
చెన్నై: మైనర్ బాలికను కిడ్నాప్ చేసి నిర్బంధించి లైంగిక దాడికి పాల్పడిన కేసులో తమిళనాడులోని కరూరు మహిళా కోర్టు ముగ్గురు కిలాడీ లేడీలతో సహ ఐదుగురికి జీవిత ఖైదు విదించింది. ఓ మహిళ ఐదుగురితో కలిసి పక్కింట్లో నివసిస్తున్న 13 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి వెంట తీసుకెళ్లి పరిచయం ఉన్న కామాంధులతో లైంగిక దాడి చేయించిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. బాలికను చిత్రహింసలకు గురి చేసిన ముగ్గురు మహిళలతో పాటు ఐదు మందికి కరూరు మహిళా కోర్టు జీవిత ఖైదు శిక్ష విదించింది.

పక్కింటి అమ్మాయి
కరూరు జిల్లాలోని తిరుప్పూరులోని ఓ ఇంటిలో కుముదవళ్లి (36) అనే మహిళ నివాసం ఉంటుంది. కుమదవళ్లి పక్కింటిలో 13 ఏళ్ల బాలిక నివాసం ఉంటోంది. బాలికతో చనువుగా ఉంటున్న కుముదవళ్ళి తరువాత మాయమాటలు చెప్పి అమ్మాయిను తన వెంట తీసుకెళ్లింది.

కిడ్నాప్, లైంగిక దాడి
తన వెంట వచ్చిన బాలికను కిడ్నాప్ చేసిన కుముదవళ్ళి తిరుప్పూరులోని ఓ ఇంట్లో నిర్బంధించిన తరువాత తనకు తెలిసిన పురుషులను ఇంటికి పిలిపించుకుని లైంగిక దాడి చేయించింది. ఇంటికి పదేపదే వస్తున్న కామాంధులు బాలికకు చిత్రహింసలు పెట్టి లైంగిక దాడికి గురి చేశారు.

తప్పించుకున్న బాలిక
కొంత కాలం లైంగిక దాడికి గురైన బాలిక ఓ సారి ఎవ్వరూ లేని సమయంలో చాకచక్యంగా తప్పించుకుని ఇంటికి చేరుకుంది. తనను వెంట తీసుకెళ్లిన కుముదవళ్ళి ఇంటిలో నిర్బంధించిందని, తరువాత ఆమె స్నేహితులను ఇంటికి పిలిపించి లైంగిక దాడి చేయించిదని బాలిక తల్లిదండ్రులకు చెప్పింది.

ముగ్గురు కిలాడీ లేడీలు
బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు చేసిన పోలీసులు కుమదవళ్ళి (36), సంధ్య (39), కల్పన (32), శరణ్య (29), మణి(36), ప్రతాప్ (27), శివకుమార్ (36) అనే నిందితులను 2017లో అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కేసు విచారణ చేసిన కరూరు మహిళా కోర్టు న్యాయమూర్తి శశికళ ముగ్గురు మహిళలతో పాటు ఐదు మంది నిందితులు బాలికను కిడ్నాప్ చేసి నిర్బంధించి లైంగిక దాడి చేశారని నేరం రుజువు కావడంతో మంగళవారం జీవిత ఖైదు శిక్ష విధింస్తూ తుది తీర్పు వెలువరించారు. న్యాయమూర్తి శశికళ నిందితులు ఒక్కొక్కరికి రూ. 1.35 లక్షల జరిమానా విధిందారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications