ఆశ్రమంలో అత్యాచారం..! ఆశారాం బాపు కుమారుడికి జీవిత ఖైదు
సూరత్ : దైవాంశ సంభూతుడిగా అభివర్ణించుకున్న ఆశారాం బాపు ఆశ్రమంలో అరాచకాలు వెలుగుచూశాయి. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న అభియోగాలతో జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. తండ్రి బాటలోనే ఆయన తనయుడు నారాయణ్ సాయి కూడా ఆరోపణలు ఎదుర్కొన్నాడు. మహిళలను లైంగికంగా వేధించారనే కారణాలతో.. మంగళవారం సూరత్ కోర్టు ఆయనకు కూడా జీవిత ఖైదు విధించింది.

తండ్రి దారిలోనే..!
ఆశారాం బాపు అత్యాచారం కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. తాజాగా ఆయన కుమారుడు నారాయణ్ సాయి కూడా రేప్ కేసులో దోషిగా తేలాడు. దీనికి సంబంధించి సూరత్ కోర్టు ఈ నెల 26 నాడు తీర్పు వెలువరించింది. అదే క్రమంలో మంగళవారం (30.04.2019) నాడు జైలుశిక్ష ఖరారు చేసింది. 2013లో అతడిపై నమోదైన అత్యాచారం కేసులో ఆరేళ్లుగా విచారణ కొనసాగి తుదితీర్పు వచ్చింది.
సూరత్‌కు చెందిన ఓ మహిళ నారాయణ్ సాయిపై రేప్ కేసు ఫైల్ చేశారు. 2002 నుంచి 2005 వరకు మూడు సంవత్సరాలు తాను ఆశ్రమంలో ఉన్నప్పుడు తండ్రీకొడుకులిద్దరు అత్యాచారం చేశారనేది ప్రధాన ఆరోపణ. 2013లో పోలీసులను ఆశ్రయించిన సదరు మహిళలు.. నారాయణ్ సాయి తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఎన్నెన్నో ఆరోపణలు..!
లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చినప్పటి నుంచి నారాయణ్ సాయి పరారీలో ఉన్నాడు. అయితే అప్పట్లో పోలీసులు జరిపిన దర్యాప్తులో మరో వివాదస్పద సంఘటన వెలుగులోకి వచ్చింది. నారాయణ్ సాయికి అమ్మాయిలను సరఫరా చేసిందనే ఆరోపణలతో పోలీసులు అతని సహాయకురాలు గంగను అరెస్ట్ చేశారు. నారాయణ్ సాయి గంగతో శారీరక సంబంధం పెట్టుకోవడంతో వారికి ఓ చిన్నారి జన్మించినట్లు పోలీసులు తేల్చారు. తర్వాత కొంత కాలానికి నారాయణ్ సాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదలావుంటే తాజాగా ఈ కేసులో గంగ, జమున, హనుమాన్ అనే వ్యక్తులను కూడా కోర్టు దోషులుగా పేర్కొంది. మోనికా అనే మహిళను నిర్ధోషిగా తేల్చింది.

ఆధ్యాత్మిక ప్రవచనాలు.. అత్యాచార ఆరోపణలు
అహ్మదాబాద్ లోని సబర్మతీ నది తీరాన యోగా, ఆధ్యాత్మికతకు మారుపేరుగాంచింది ఆశారాం బాపు ఆశ్రమం. అక్కడకు వెళ్లే భక్తులకు పురాణా, ఇతిహాసాల గురించిన ప్రవచనాలు చెప్పడంలో ఆయన దిట్ట. అయితే ఆ ఆశ్రమంలో చదువుకునే ఇద్దరు విద్యార్థులు 2008, జులై 4వ తేదీన కనిపించకుండా పోయి ఆ మరుసటి రోజే శవాలై కనిపించారు. ఆ జంట హత్యల్లో ఆశారాం బాపు హస్తమున్నట్లు కేసు నమోదైంది. తదనంతరం అత్యాచార ఆరోపణలు అతడిని జైలు జీవితానికి పరిమితం చేశాయి.
ఆశ్రమం పేరిట ఆశారాం బాపు అరాచకాలు చేశాడనే వాదనలున్నాయి. మైనర్ బాలికలను కూడా రేప్ చేసినట్లు ఆరోపణలున్నాయి. పైగా అత్యాచారం చేయడం పాపం కాదని చెబుతుండేవాడట. చివరకు ఓ రేప్ కేసులో దోషిగా తేలడంతో ప్రస్తుతం జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. తండ్రి బాటలోనే ఇప్పుడు తనయుడు కూడా అత్యాచారం కేసులో దోషిగా తేలడంతో జీవిత ఖైదు పడింది.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications