కౌంటింగ్ డే: మెరుపువేగంతో సమగ్ర సమాచారం.. డైలీ హంట్ సొంతం!
హైదరాబాద్: ఈ నెల 19వ తేదీన తుది విడత ఎన్నికల పోలింగ్ ముగిసిన తరువాత..ఇక అందరి దృష్టీ 23వ తేదీన వెలువడే ఫలితాలపై నిలిచింది. రాజకీయ నాయకుల జాతకాలను ప్రభావితం చేసే జడ్జిమెంట్ డే కోసం యావత్ దేశం ఆసక్తితో ఎదురు చూస్తోంది. 19వ తేదీన సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వెలువడిన అనంతరం ఉత్కంఠత మరింత పెరిగింది. 23వ తేదీ నాటికి పదింతలైంది.
ఎన్నికల ఫలితాలు కేవలం అంకెలతో మాత్రమే ముడిపడి ఉన్నవే కావు. దేశ ప్రజల ఆశలు, ఆశయాలు, వారి దైనందిన జీవితాలకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశం ఈ ఎన్నికల ఫలితాలు. దేశ ప్రజల మనోభావాలను ప్రతిబింబించేలా డైలీ హంట్.. ఎన్నికలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వాడి, వేడిగా సమగ్రంగా, విశ్లేషణాత్మకంగా అందజేయబోతోంది.

డైలీ హంట్ ప్రత్యేకత ఏంటీ?
దేశం నలుమూలల నుంచీ ఎన్నికల ఫలితాలకు సంబంధించిన సమాచారాన్ని మెరుపువేగంతో, ఆకర్షణీయంగా గందరగోళానికి అవకాశం లేకుండా అందజేయడం డైలీ హంట్ ప్రత్యేకత. 2014 నాటి ఎన్నికల ఫలితాలు, అప్పట్లో ఆయా పార్టీలు, అభ్యర్థులు సాధించిన ఆధిక్యతను సరిపోల్చుకుంటూ విశ్లేషణాత్మక కథనాలను ప్రజల ముందు ఉంచబోతున్నది.
నియోజకవర్గాలు, రాష్ట్రాల వారీగా లోతైన విశ్లేషణలతో కూడిన సమాచారాన్ని చేరువ చేయనుంది. లోక్‌సభ ఎన్నికలు సహా మన రాష్ట్రంతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకుని రాబోతున్నది.
దేశం మొత్తానికి చిరపరిచితులైన అభ్యర్థుల గెలుపోటములు, కీలక స్థానాలు, అక్కడ పోటీ చేసిన వారి మెజారిటీ.. వంటి సమాచారాన్ని డైలీ హంట్ ద్వారా తెలుసుకోవచ్చు.
సామాజిక మాధ్యమాలు, ప్రత్యేకించి ట్విట్టర్ ట్రెండ్ల ద్వారా కూడా సమగ్ర సమాచారాన్ని ప్రజల ముందుకు తీసుకుని రాబోతున్నది. ప్రముఖ పబ్లిషర్లకు చెందిన లైవ్ వీడియోలు, వైరల్ మెమె, ట్రెండింగ్ వీడియోలు.. ఇలాంటివన్నీ డైలీ హంట్‌లో చూడవచ్చు.
ఓట్ల లెక్కింపు ఆరంభమైన వెంటనే- అన్ని కోణాల్లో విశ్లేషణాత్మక కథనాలు డైలీ హంట్ నుంచి వెలువడతాయి. అందర్నీ ఆకట్టుకునే ఫలితాల రాజకీయ నిష్ణాతుల తరహాలో విశ్లేషణలు రోజంతా కొనసాగుతాయి.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications