సింహాల రొట్టె కథ...! వేటాడిన దున్నను వదిలి కొట్టుకున్న సింహాలు...!

పిల్లి రొట్టే కథ మీకు గుర్తు ఉండే ఉంటుంది. ఉన్న ఒక్కరొట్టే కోసం రెండు పిల్లులు కొట్టుకుంటుంటే మధ్యలో ఉన్న నక్క చెరి సగం పంచుతాని దాన్ని అమాంతం తినేసి వెళ్లిపోతుంది. దీంతో అసలు విషయం తెలుసుకున్న పిల్లులు నిరాశకు లోనై కలిసి ఉంటే కలదు సుఖం అని ఊసురుమంటాయి. ఇప్పుడు అదే కథ పిల్లుల మధ్య కాకుండా సింహాల మధ్య చోటుచేసుకుంది. అయితే అది కథ అయితే అడవిలో ఉన్న సింహాలు నిజం చేశాయి.

దక్షిణాఫ్రికాలోని క్రూగర్‌ నేషనల్‌ పార్క్‌లో అందివచ్చిన ఆహారాన్ని కలిసి తినకుండా నేనంటే నేనని సింహాలు గుంపు కోట్టుకుంది. దీంతో కలిసి ఉంటే కలదు సుఖం అనే నానుడి మరిచి తమకు దొరికిన ఆహారాన్ని చేజార్చుకున్నాయి. అడవిలో అసలే ఆహారం లభించడం చాల కష్టం ఎంతో మాటు వేస్తే కాని జంతువులకు వేటాడేందుకు అవకాశం ఉండదు. అలాంటీది అడవి దున్న రూపంలో అందివచ్చిన ఆహారాన్ని జారవిడుచుకున్న వీడీయో ఒకటి వైరల్ అవుతోంది.

lions having their meal but decided to fight with each other.

క్రూగర్‌ నేషనల్‌ పార్క్‌లో ఆహారం కోసం వేటాడిన సింహాల గుంపు ఎట్టకేలకు ఓ దున్నను పట్టుకున్నాయి. పూర్తిగా క్రింద పడేసి తినే సమయంలోనే పక్కనే ఉన్న రెండు సింహాలు గ్రూపు వాటికి అవే కొట్టుకున్నాయి. నువ్వా నేనా తినేది అంటూ ఒకటిపై ఒకటి కలబడ్డాయి. దీంతో చావుకు దగ్గరలో ఉన్న దున్న బతుకు జీవుడా అంటూ పరుగులు పెట్టింది. అయితే చావు చివరి అంచుకుపోయిన దున్న పరుగెత్తడాన్ని పర్వీన్ అనే ఓ ఐఎఫ్ఎస్ అధికారి సోషల్ మీడీయాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడీయో వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+