స్వీట్ హార్ట్ అని పిలుస్తుంది, కేసు పెట్టింది: సోమనాథ్
న్యూఢిల్లీ: తన భార్య లిపిక మిత్ర తనపై పెట్టిన గృహ హింస కేసును ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ్యుడు, ఢిల్లీ మాజీ మంత్రి సోమనాథ్ భారతి కొట్టిపారేశారు. తన వద్ద ఆడియో, డాక్యుమెంటరీ సాక్ష్యాలు ఉన్నాయని, అవి వాస్తవాలను వెల్లడిస్తాయని ఆయన బుధవారంనాడు అన్నారు.
తనపై హత్యాప్రయత్నం కేసు పెట్టిన మహిళ స్వీట్ హార్ట్ అని అంటుందని, ఇంటికి రాగానే నిన్ను జాగ్రత్తగా చూసుకుంటానని ఎస్ఎంఎస్ పెడుతుందని ఆయన అన్నారు. ఆ ఎస్ఎంఎస్‌ను లిపికా మిత్ర ఈ ఏడాది ఫిబ్రవరి 25వ తేదీన పెట్టిందని ఆయన చెప్పారు.
ఆ విధంగా పిలిచే భార్యపై ఎవరైనా హత్యాప్రయత్నం చేస్తారా అని అడిగారు. తన వద్ద ఉన్న ఆడియో, డాక్యుమెంటరీ సాక్ష్యాలు వాస్తవాలను వెల్లడిస్తాయని, తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని తేలుతుందని ఆయన అన్నారు.

తానేమీ దాక్కోవడం లేదని, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పనిచేస్తున్న పోలీసుల నుంచి తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నానని ఆయన అన్నారు. తన లీగల్ క్లయింట్స్‌ను, మద్దతుదారులను విచారిస్తున్న పోలీసులు తాము కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఈ పనిచేస్తున్నామని చెబుతున్నారని ఆయన అన్నారు.
తన కోసం ఉగ్రవాద నిరోధక బలగాలు (ఎటిఎస్) తిరుగుతున్నాయని విన్నానని, తానేమైనా ఉగ్రవాదినా అని ఆయన అన్నారు. సోమనాథ్ భారతిపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్ జారీ అయింది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications