లిప్‌స్టిక్ బాబా రాసలీలలు.. స్త్రీ వేషంలో యువకులతో అశ్లీలంగా...
జైపూర్: రాజస్థాన్ పోలీసులు మరో దొంగబాబాను పట్టుకున్నారు. ఝలావర్ పట్టణంలో పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన ఈయన జగదాంబ బాబా, లిప్‌స్టిక్ బాబా పేర్లతో స్థానికులకు సుపరిచితుడు. ఇతడు దేవీ వేషధారణలో యువకులను వలలో వేసుకుంటాడనే ఆరోపణలు ఉన్నాయి.
అంతేకాదు, ఇతడి కారణంగా స్థానికంగా ఓ యువకుడు ఆత్మహత్య కూడా చేసుకున్నాడని చెబుతారు. ఝలావర్ పోలీసులు ఈ లిప్‌స్టిక్ బాబాను అతడి ఇంట్లోనే అదుపులోకి తీసుకున్నారు. ఇతడు స్త్రీ వేషం ధరించి తాను దేవతనని చెబుతుంటాడని, యువకులతో అశ్లీల సంభాషణలు, కార్యకలాపాలకు పాల్పడుతుంటాడని పోలీసులు పేర్కొన్నారు.

మరో దొంగబాబా వెలుగులోకి...
రాజస్థాన్‌లోని ఝలావర్ పట్టణంలో మరో దొంగబాబా రాసలీలలు బట్టబయలు అయ్యాయి. ఇతడి అసలు పేరు కుల్దీప్ సింగ్. కానీ ఈ పేరు ఎవరికీ పెద్దగా తెలియదు. జగదాంబ బాబా అంటే చిన్నపిల్లలు కూడా గుర్తుపట్టేస్తారు. ఇతడు స్త్రీ వేషం ధరించి లిప్‌స్టిక్ కూడా పూసుకుంటాడు. దీంతో పలువురు ఇతడిని లిప్‌స్టిక్ బాబాగా కూడా పిలుస్తుంటారు.

దేవీ వేషం ధరించి....
జగదాంబ బాబా అలియస్ లిప్‌స్టిక్ బాబా దేవీ వేషం ధరించి ఝలావర్ పట్టణంలోని భక్తులకు దర్శనమిస్తుంటాడు. తన వద్దకు వచ్చే మహిళా భక్తులను ఈయన పెద్దగా పట్టించుకోడు. ఈయన దృష్టి అంతా తన వద్దకు వివిధ సమస్యలపై వచ్చే యువకులపైనే ఉంటుంది. ఎందుకంటే, ఈ లిప్‌స్టిక్ బాబా ‘గే' అట. అర్థం కాలేదా? స్వలింగ సంపర్కుడండీ బాబూ!

యువకులతో అశ్లీల సంభాషణలు...
తన వద్దకు వచ్చే భక్తుల్లో కాస్త అందంగా, ఒడ్డూ పొడవు బాగున్న యువకులపైనే లిప్‌స్టిక్ బాబా దృష్టి ఎక్కువగా కేంద్రీకరిస్తారన్న సంగతి తెలిసిందే. ఇక వారితో ఆయన సాగించే పరాచికాలకు అంతే ఉండదు. అంతేకాదండోయ్, ఈ బాబా సోషల్ మీడియాను కూడా ఉపయోగిస్తుంటాడు. ఫేస్‌బుక్, వాట్సాప్‌ల ద్వారా యువకులతో సంభాషిస్తుంటాడు. కొంతమందితో అశ్లీల సంభాషణలు సాగిస్తుంటాడు.

బాబా వేధింపులకు యువకుడు బలి!?
లిప్‌స్టిక్ బాబా వేధింపులు భరించలేక యువరాజ్ సింగ్ అనే యువకుడు ఏకంగా ఆత్మహత్య చేసుకున్నాడట. తన వద్దకు వచ్చే యువకులతో బాబా ప్రవర్తించే తీరు, అశ్లీల వ్యవహారాలు.. యువరాజ్‌కు నచ్చక నిలదీశాడట. అంతే - బాబా మద్దతుదారులు అతడిని చిత్రహింసలు పెట్టారని, దీంతో అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని స్థానికులు చెవులు కొరుక్కుంటుంటారు.

సెక్స్ మెసేజ్‌లు, అశ్లీల కార్యకలాపాలు...
నిజానికి ఈ లిప్‌స్టిక్ బాబా వ్యవహారం నేటికీ చాపకింద నీరులా సాగిపోతుండేది. కానీ ఆత్మహత్య చేసుకున్న యువరాజ్ సింగ్ మొబైల్‌ఫోన్.. ఈ బాబా నిజస్వరూపాన్ని బట్టబయలు చేసింది. కొడుకుని పోగొట్టుకుని కుమిలిపోతున్న యువరాజ్ తల్లిదండ్రులు ఎందుకో ఒకరోజు అతడి మొబైల్‌ఫోన్ తీసుకుని అతడి ఫొటోలు చూస్తుండగా.. కొన్ని అశ్లీల మెసేజ్‌లు కనిపించాయట. అవన్నీ యువరాజ్ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు వచ్చినవే. తరువాత ఆరా తీయగా అవి లిప్‌స్టిక్ బాబా పంపినవే అని నిర్ధారణ అయింది.

చివరికి కటకటాల వెనక్కి...
యువరాజ్ సింగ్ తల్లిదండ్రులు, ఇంకా మరికొందరి ఫిర్యాదుల మేరకు జిల్లా ఎస్పీ ఆదేశాలపై కొత్వాల్ పోలీసులు ఎట్టకేలకు ఈ దొంగబాబాను అతడి ఇంట్లోనే అదుపులోకి తీసుకున్నారు. అయితే అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళ మాత్రం లిప్‌స్టిక్ బాబా అలాంటి వాడు కాదని, అతడ్ని అరెస్టు చేయరాదంటూ అడ్డుపడింది. అధికారులు కావాలనే తప్పుడు ఆరోపణలపై బాబాను అరెస్టు చేశారని ఆమె పేర్కొంది.












Click it and Unblock the Notifications