coromandel express: ఇటీవల కాలంలో జరిగిన అతిపెద్ద రైలు ప్రమాదాలు ఇవే
న్యూఢిల్లీ/భువనేశ్వర్: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్(Coromandel Express) రైలు ఆగివున్న గూడ్స్ రైలును ఢీకొట్టి పట్టాలు తప్పింది. అయితే, ట్రాక్‌పై పడిన కోరమాండల్ రైలు బోగీలను మరో ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. బాలేశ్వర్ జిల్లా బహనాగ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 350 మందికిపైగా ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం.
తొలుత కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో మొత్తం 13 బోగీలు మరో ట్రాక్‌పై పడ్డాయి. ఆ తర్వాత కాసేపటికి పక్క ట్రాక్‌పై వస్తోన్న యశ్వంత్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్ రైలు కోరమాండల్ బోగీలను ఢీకొట్టడంతో ఆ రైలులో నాలుగు బోగీలు సైతం పట్టాలు తప్పాయి. క్షతగాత్రుల్లో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితుల సమాచారం కోసం ఎమర్జెన్సీ కంట్రోల్ రూం నెంబర్ 06782262286కు ఫోన్ చేయాలని అధికారులు తెలిపారు. కాగా, ఇటీవల కాలంలో జరిగిన అతిపెద్ద రైలు ప్రమాదం ఇదే కావడం గమనార్హం.

ఇక ఇటీవల కాలంలో జరిగిన అతిపెద్ద రైలు ప్రమాదాల జాబితాను ఒకసారి గమనించినట్లయితే..
భారతదేశంలో అతిపెద్ద రైలు ప్రమాదాలు:
జూలై 7, 2011న ఉత్తరప్రదేశ్‌లోని ఎటా జిల్లా సమీపంలో ఛప్రా-మథుర ఎక్స్‌ప్రెస్ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో 69 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మానవరహిత క్రాసింగ్ వద్ద తెల్లవారుజామున 1:55 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. రైలు అతివేగంతో నడుస్తుండటంతో బస్సును దాదాపు అర కిలోమీటరు మేర ఈడ్చుకెళ్లింది.
భారతీయ రైల్వే చరిత్రలో 2012 సంవత్సరం అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ సంవత్సరం సుమారు 14 ప్రమాదాలు నమోదయ్యాయి, వీటిలో పట్టాలు తప్పడం, ఢీకొనడం రెండూ ఉన్నాయి.
జూలై 30, 2012న నెల్లూరు సమీపంలో ఢిల్లీ-చెన్నై తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌కు చెందిన కోచ్‌లో మంటలు చెలరేగడంతో 30 మందికి పైగా మరణించారు.
మే 26, 2014న, ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్ ప్రాంతంలో గోరఖ్‌పూర్ వైపు వెళుతున్న గోరఖ్‌ధామ్ ఎక్స్‌ప్రెస్ ఖలీలాబాద్ స్టేషన్‌కు సమీపంలో ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఫలితంగా 25 మంది మరణించారు, 50 మందికి పైగా గాయపడ్డారు.
మార్చి 20, 2015న డెహ్రాడూన్ నుంచి వారణాసికి వెళ్తున్న జనతా ఎక్స్‌ప్రెస్‌లో ఒక పెద్ద ప్రమాదం జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలోని బచ్రావాన్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఇంజన్, పక్కనే ఉన్న రెండు కోచ్‌లు పట్టాలు తప్పడంతో 30 మందికి పైగా మరణించారు, 150 మంది గాయపడ్డారు.

నవంబర్ 20, 2016న ఇండోర్-పాట్నా ఎక్స్‌ప్రెస్ 19321 కాన్పూర్‌లోని పుఖ్రాయాన్ సమీపంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో కనీసం 150 మంది ప్రయాణికులు మరణించారు, 150 మందికి పైగా గాయపడ్డారు.
ఆగస్టు 19, 2017న హరిద్వార్-పూరి మధ్య నడుస్తున్న కళింగ ఉత్కల్ ఎక్స్‌ప్రెస్ ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లోని ఖతౌలీ సమీపంలో ప్రమాదానికి గురైంది. రైలులోని 14 బోగీలు పట్టాలు తప్పడంతో 21 మంది ప్రయాణికులు మృతి చెందగా, 97 మంది గాయపడ్డారు.
ఆగస్టు 23, 2017న ఉత్తరప్రదేశ్‌లోని ఔరైయా సమీపంలో ఢిల్లీకి వెళ్లే కైఫియత్ ఎక్స్‌ప్రెస్‌లోని తొమ్మిది రైలు కోచ్‌లు పట్టాలు తప్పడంతో కనీసం 70 మంది గాయపడ్డారు.
జనవరి 13, 2022న, పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్‌దువార్‌లో బికనీర్-గౌహతి ఎక్స్‌ప్రెస్ కనీసం 12 కోచ్‌లు పట్టాలు తప్పడంతో 9 మంది మరణించారు, 36 మంది గాయపడ్డారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications