Indian Citizenship : భారతదేశం పౌరసత్వం లేని స్టార్స్ లిస్ట్ ఇదే..!
భారతదేశంలో ఉంటూ.. దేశపు పౌరసత్యం లేని వారు చాలామందే ఉన్నారు. ఈ జాబితాలో బాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు ఉన్నారనే విషయం చాలామందికి తెలియదు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ భారతదేశపు పౌరసత్వం తీసుకున్నారు. భారత దేశంలో ఉంటూ కెనడా పౌరసత్వంతో ఇక్కడ సినిమాలు చేయడంపై గత కొద్దికాలంగా అక్షయ్ కుమార్ విమర్శలను ఎదుర్కొంటున్నారు.
దీంతో ఆయన స్వాత్రంత్య దినోత్సవం రోజున, భారతీయ పౌరసత్వం తీసుకున్నారు. భారతదేశ పౌరసత్వం లభించిందని ఆయన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేశారు. అయితే అక్షయ్ కుమార్ మాదిరిగానే భారతదేశంలో ఉంటూ..భారతీయ పౌరసత్వం లేని బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు చాలామందే ఉన్నారు. ఆ లిస్ట్‌ను ఓసారి పరిశీలిద్దాం.
దీపికా పదుకొనే
బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌లో దీపికా పదుకొనే కూడా ఒకరు. ఆమె భారతీయ పౌరసత్వంపై రకరకాల వాదనలు ఉన్నాయి. దీపికా పదుకొనే ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రకాష్ పదుకొణె కుమార్తె అనే అందరికి సంగతి తెలిసిందే. దీపికా పదుకొనే డెన్మార్క్‌లో జన్మించింది. దీంతో దీపికా పదుకొనేకు డెన్మార్క్ పౌరసత్వం కలిగి ఉంది.

అలియా భట్
మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన అలియా భట్‌కి కూడా మన దేశపు పౌరసత్వం లేదు. అలియా భట్ ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత మహేష్ భట్ కుమార్తె. అలియా భట్ తల్లి సోనీ రజ్దాన్.. ఆమె ఓ బ్రిటన్ మహిళ. అలియా భట్ అక్కడే పుట్టడంతో ఆమెకు బ్రిటిష్ పౌరసత్వం కలిగియుంది. అలియా భట్ తల్లి బ్రిటన్‌లో ఉన్నందున.. అలియాకు భారత పౌరసత్వం పొందేందుకు అర్హత పొందలేదు.

సన్నీ లియోన్
సన్నీ లియోన్ ..ఈ పేరు తెలియని అభిమాని ఉండరు.శృంగారతారగా ఓ వెలుగు వెలిగి.. తరువాత బాలీవుడ్ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది ఈ హాట్ బ్యూటీ. ప్రస్తుతానికి పోర్న్ సినిమాలకు దూరం ఉంటోన్న సన్నీ అమెరికన్ పౌరసత్వం పొంది ఉన్నారు.

కత్రినా కైఫ్
హీరోయిన్ కత్రినా కైఫ్‌ది అసలు మనం దేశం కాదనే విషయం అందరికి తెలిసిన విషయమే. కత్రినా హాంకాంగ్‌లో స్థిరపడిన కాశ్మీరీ తండ్రికి జన్మించిది. తల్లిది హాంకాంగ్ కావడంతో ఆమె బ్రిటిష్ పౌరసత్వాన్ని కలిగి ఉంది. కత్రినా ఇటీవలే బాలీవుడ్ హీరో విక్కీ కౌషల్‌ని ప్రేమించి వివాహమాడింది

జాక్వెలిన్ ఫెర్నాండెజ్
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ...మన పక్క దేశం అయిన శ్రీలంకలో పుట్టి భారతదేశంలో పాపులరైంది ఈ అమ్మడు. సల్మాన్ ఖాన్ నటించిన కిక్కు సినిమాలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకుంది. కానీ ఇప్పటికీ ఆమెకు భారతీయ పౌరసత్వం లేదు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ శ్రీలంక పౌరురాలిగానే కొనసాగుతుంది.

వీరితో పాటు సారా జేన్ డయాస్ ,అమీ జాక్సన్, ఎల్లి అవ్రామ్, ఈవెలిన్ శర్మ, నర్గీస్ ఫక్రి, ఇమ్రాన్ ఖాన్ వంటి వారు భారతదేశంలో స్థిరపడినప్పటికీ భారతీయ పౌరసత్వం లేకుండా లగ్జరరీ లైఫ్‌ను అనుభవిస్తున్నారు.












Click it and Unblock the Notifications