మహారాష్ట్రలో మంత్రులకు శాఖల కేటాయింపులు: ఏ శాఖ ఎవరికంటే?

మహారాష్ట్రలో కొత్తగా కొలువుదీరిన మహాయుతి ప్రభుత్వం.. మంత్రులకు తాజాగా శనివారం శాఖలు కేటాయించారు. కీలకమైన హోంశాఖను మాత్రం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నీవీస్‌ తన వద్దే ఉంచుకున్నారు. అంతేకాకుండా సాధారణ పరిపాలన, విద్యుత్‌, న్యాయ, ఇన్ఫర్మేషన్‌ అండ్‌ పబ్లిసిటీ శాఖలు కూడా సీఎం ఫడ్నవీస్ అధీనంలోనే ఉండనున్నాయి.

ఇక, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ షిండేకు పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ, ప్రజా పనుల (పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌) శాఖల బాధ్యలను అప్పగించారు. మరో ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌కు ఆర్థికశాఖ, ఎక్సైజ్‌ శాఖలను అప్పగించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి చంద్రశేఖర్‌ భవంకులే రెవెన్యూశాఖను కేటాయించారు. ఈ మేరకు శాఖల కేటాయింపునకు గవర్నర్‌ ఆమోదం తెలిపారు.

List of Maharashtra Cabinet Ministers Who has been allotted which portfolio

మరికొన్ని ముఖ్యమైన పోర్టుఫోలియోలు :

రాధాకృష్ణ - జలవనరులు (గోదావరి -కృష్ణ లోయ అభివృద్ధి కార్పొరేషన్‌)
హసన్‌ మియాలాల్‌ - వైద్య విద్య
చంద్రకాంత్‌ సరస్వతి - ఉన్నత, సాంకేతిక విద్య, శాసనసభ వ్యవహారాలు
గిరీశ్‌ గీతా దత్తాత్రేయ మహాజన్‌ - జలవనరులు ( విదర్భ, తాపి, కొంకణ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌), విపత్తు నిర్వహణ

గణేష్ నాయక్ - అడవులు
గులాబ్రావ్ పాటిల్ - నీటి సరఫరా, పారిశుధ్యం
దాదాజీ రేష్మాబాయి దగదుజీ భూసే - పాఠశాల విద్య
సంజయ్ రాథోడ్- నేల, నీటి సంరక్షణ
ధంజయ్ ముండే- ఆహారం, పౌర సరఫరాలు, వినియోగదారుల రక్షణ మంగళ్‌ప్రభాత్ లోధా- నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, వ్యవస్థాపకత, ఆవిష్కరణ
ఉదయ్ సమంత్- పరిశ్రమలు, మరాఠీ భాష
జయకుమార్ రావల్- మార్కెటింగ్, ప్రోటోకాల్
పంకజా ముండే- పర్యావరణం, వాతావరణ మార్పు, జంతు సంరక్షణ అతుల్ సేవ్- OBC సంక్షేమం, డెయిరీ డెవలప్‌మెంట్, రెన్యూవబుల్ ఎన్‌క్రిజీ
అశోక్ ఉయికే- గిరిజన అభివృద్ధి

శంభురాజ్ దేశాయ్- టూరిజం, మైనింగ్, ఎక్స్-సర్విక్మెన్ వెల్ఫేర్ ఆశిష్ షెలార్- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాంస్కృతిక వ్యవహారాలు దత్తాత్రే భరణే- క్రీడలు & యువజన సంక్షేమం, మైనారిటీల అభివృద్ధి, ఔకాఫ్
అదితి తత్కార్సే- మహిళలు, శిశు అభివృద్ధి
శివేంద్రసింగ్ భోసలే- పబ్లిక్ వర్క్స్ (పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ మినహా) మాణిక్రావు కొకాటే- వ్యవసాయం
జయకుమార్ గోరే- గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్
నరహరి జిర్వాల్- ఫుడ్, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, ప్రత్యేక సహాయం సంజయ్ సావ్కరే- టెక్స్‌టైల్స్
సంజావ్ శిర్సత్- సామాజిక న్యాయం
ప్రతాప్ సర్నాయక్ - రవాణా
భరత్‌శేత్ గోగావాలే- ఉపాధి హామీ, ఉద్యానవన, సాల్ట్ పాన్ ల్యాండ్ డెవలప్‌మెంట్
మకరంద్ జాదవ్ (పాటిల్)- రిలీఫ్, రిహాబిలిటేషన్
నితేష్ రాణే- ఫిషరీస్, ఓడరేవులు
ఆకాష్ ఫండ్కర్- లేబర్
బాబాసాహెబ్ పాటిల్- సహకారం
ప్రకాష్ అబిత్కర్- ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమం

కాగా, ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. 288 అసెంబ్లీ స్థానాలకుగానూ మహాయుతి కూటమి మొత్తంగా 230 సీట్లు సొంతం చేసుకుంది. అందులో బీజేబీ 132 స్థానాల్లో విజయం సాధించగా, శివసేన 57, ఎన్సీపీ 41 సీట్లు గెలుపొందాయి. దీంతో బీజేపీ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అయ్యారు. శివసేన నుంచి ఏక్ నాథ్ షిండే, ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ డిప్యూటీ సీఎంలుగా బాధ్యతలు స్వీకరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+