Modi Cabinet 2024:మంత్రుల లిస్ట్ ఫైనల్.. తెలుగు రాష్టాల నుంచి వీరికే ఛాన్స్
దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారానికి రంగం సిద్ధమైంది. రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం రాత్రి 7.15 గంటలకు ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీ ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.. జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత ఈ ఘనత సాధించిన వ్యక్తిగా నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారు. మోదీ ప్రమాణస్వీకారంలో పాల్గొనేందుకు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా, సీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ అఫీఫ్ శనివారమే ఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర కేబినెట్ కూర్పు పూర్తైంది. మోదీ తన మంత్రివర్గంలో దాదాపు 30 మందికి అవకాశం కల్పించారని తెలుస్తోంది. ఆదివారం ఉదయం నరేంద్ర మోదీ తన నివాసంలో కొత్త మంత్రులకు తేనీటి విందు ఇచ్చారు
కేబినెట్‌లో బీజేపీ నుంచి రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా, శివరాజ్ సింగ్ చౌహాన్, అనురాగ్ ఠాకూర్, కిరణ్ రిజిజు, అశ్విని వైష్ణవ్, ప్రహ్లాద్ జోషి, మన్సుక్ మండవియ,రావు ఇంద్రజిత్ సింగ్‌లకు చోటు దక్కింది. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి వర్గంలోకి కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కు చోటు దక్కింది. ఒకే వాహనంలో ఈ ఇద్దరూ మోదీ నివాసానికి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ నుంచి నర్సాపూర్ ఎంపీ భూపతి రాజు శ్రీనివాస్ వర్మకు కేబినెట్ బెర్త్ దక్కింది. మోదీ నివాసంలో తేనీటి విందుకు ఈయన కూడా హాజరయ్యారు.

రామ్మోహన్ నాయుడు,పెమ్మసాని చంద్రశేఖర్(టీడీపీ), కుమార స్వామి (జేడీఎస్), లలన్ సింగ్(జేడీయూ), సహాయ మంత్రిగా రామ్ నాత్ ఠాకూర్(జేడీయూ), జితిన్ రామ్ మాంజీ( హిందూస్తాన్ ఆవం మోర్చా), జయంత్ చౌదరి(ఆర్‌ఎల్‌డీ) ప్రతాప్ రావ్ జాదవ్(శివసేన), అజిత్..ప్రఫుల్ పటేల్(ఎన్‌సీపీ), అనుప్రియా పాటిల్(అప్నాదళ్), రామ్దాస్ అత్వాలే(ఆర్పీఐ)లకు చోటు దక్కింది. నిర్మలా సీతరామన్‌కు కేబినెట్ బెర్త్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదివారం సాయంత్రం కల్లా కేంద్ర కేబినెట్‌పై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications