నాసిక్‌లో రహదారిపై లైవ్ బాంబు (ఫొటో)
నాసిక్: మహారాష్ట్రలోని నాసిక్ రహదారిపై పోలీసులు బాంబును గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాంబును నిర్వీర్యం చేశారు. రహదారిపై బాంబు ఉండటంతో పోలీసులు నాసిక్ రహదారిని పోలీసులు మూసివేశారు.
Live bomb recovered from MG Road in Nashik, Maharashtra; Bomb disposal Squad at the spot, more details awaited. pic.twitter.com/wrCEn53uCX
— ANI (@ANI_news) July 27, 2015 ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ప్రతీ వాహనాన్ని విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. పంజాబ్ రాష్ట్రంలో ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో దేశంలోని అన్ని నగరాలు హై అలర్ట్ అయ్యాయి. మహారాష్ట్రలోని ముంబై, నాసిక్, థానేలాంటి నగరాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
కాగా, పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఎస్పీతోపాటు 11మంది పోలీసులు, ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు కూడా హతమయ్యారు.












Click it and Unblock the Notifications