వెల్‌లోకి చిరు, నినాదాలు: బడ్జెట్ ప్రసంగం ఆపేసిన ఖర్గే
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి మల్లికార్జున ఖర్గే బుధవారం లోకసభలో మధ్యంతర రైల్వే బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. సీమాంధ్ర పార్లమెంటు సభ్యుల నిరసనల మధ్యనే ఖర్గే బడ్జెట్ ప్రవేశ పెట్టారు. బడ్టెట్ ప్రవేశ పెడుతున్న సమయంలో పలువురు ఎంపీలు వెల్‌లోకి వచ్చి నిరసన తెలిపారు. కేంద్రమంత్రులు కొందరు తమ స్థానాల్లో, ఇంకొందరు వెల్‌లోకి వచ్చి నిరసన తెలిపారు. మల్లికార్జున ఖర్గే తొలిసారి రైల్వే బడ్టెట్‌ను ప్రవేశ పెట్టారు. ఈ బడ్టెట్ నాలుగు నెలల కోసం.
మల్లికార్జున ఖర్గే రైల్వే బడ్జెట్ ప్రసంగం కొనసాగుతుండగా సీమాంధ్ర కేంద్రమంత్రులు చిరంజీవి, దగ్గుబాటి పురంధేశ్వరి, కావూరి సాంబశివ రావు, పళ్లం రాజులు వెల్‌లోకి దూసుకొచ్చి సమైక్య నినాదాలు చేశారు. మరో ఇద్దరు సీమాంధ్ర కేంద్రమంత్రులు కిశోర్ చంద్రదేవ్, కిల్లి కృపారాణిలు తమ తమ స్థానాల్లో ఉండి నిరసన తెలిపారు.

నిరసనలు హోరెత్తడంతో ఖర్గే తన ప్రసంగాన్ని అర్ధాంతరంగా ముగించారు. సభలో సభ్యుల ఆందోళన కారణంగా రైల్వే బడ్జెట్‌ను సభకు సమర్పిస్తున్నట్లు ఖర్గే చెప్పారు. సీమాంధ్ర ఎంపీలు, కేంద్రమంత్రుల నినాదాల మధ్య ఖర్గే పది నిమిషాలు మాత్రమే ప్రసంగాన్ని చదివారు. అనంతరం లోకసభను రేపటికి వాయిదా వేశారు.
రైల్వే బడ్జెట్ ముఖ్యాంశాలు
ఖద్రా - వైష్ణోదేవి మధ్య ప్రారంభానికి సిద్ధమైన రైలు మార్గం
తూర్పు దక్షిణ రైల్వేలో రెండు ప్రత్యేక సరకు రవాణా మార్గాలు
విస్తరణ, కొత్త పెట్టుబడులు రావడం అత్యవసరం
చప్రా, రాయ్‌బరేలీల్లో కోచ్ ఫ్యాక్టరీలు త్వరలో ప్రారంభం
కాజీపేట, విజయవాడ మీదుగా సికింద్రాబాద్ - విశాఖ ఎక్స్‌ప్రెస్, కాచిగూడ - తిరుపతి డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్, గుంటూరు - కాచిగూడ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్ - గుల్బర్గా ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ట
ఆంధ్ర ప్రదేశ్‌కు పది కొత్త రైళ్లు












Click it and Unblock the Notifications