అంత్యక్రియలను ప్రత్యక్షప్రసారంలో చూడొచ్చు
అంత్యక్రియలను ఇక ప్రత్యక్షప్రసారంలో కూడ చూడవచ్చు. చెన్నైలోని వెలాంగడు స్మశానవాటికలో వైఫె సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఈ సౌకర్యంతో అంత్యక్రియలకు హజరుకానివారు పోన్ లో అంత్యక్రియలను చూడవచ్చు. అంత్యక్రియల
చెన్నై :అంత్యక్రియలను ఇక ప్రత్యక్షప్రసారంలో కూడ వీక్షించే అవకాశం అందుబాటులోకి వచ్చింది. పెళ్ళిళ్ళను విదేశాల్లో ఉన్నవారు ఈ పద్దతిలో చూస్తున్నారు. కాని, అంత్యక్రియలకు కూడ ఈ అవకాశం అందుబాటులోకి వచ్చింది. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత మనిషి పనులు సలుభమయ్యాయి. సాంకేతికతను ఉపయోగించుకొని తనకు నచ్చినట్టు పనులు చేసుకొంటున్నాడు మనిషి. ఎవరైనా చనిపోతే అంత్యక్రియలకు వెళ్ళలేకపోయామనే బాధను ఇక మర్చిపొండి.చివరిచూపుకు నోచుకోలేపోయామనే బాధపడాల్సిన అవసరం లేదు. అంత్యక్రియలకు హజరుకాలేకపోతే....అంత్యక్రియలకు ప్రత్యక్షప్రసారంలో చూసే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.
చెన్నైలోని వెలాంగడు స్మశానవాటికలో వైఫె సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. దీనివల్ల ఈ స్మశాన వాటిక ఎక్కడ ఉందో తెలుసుకొనే అవకాశం దక్కుతోంది. మరో వైపు ఈ స్మశానవాటికలో జరిగే అంత్యక్రియలను ప్రత్యక్షంగా చూసే అవకాశం దక్కుతోంది.స్మశానవాటికలో సిసి కెమెరాలను కూడ ఏర్పాటు చేశారు.
ఇండియన్ కమ్యూనిటీ వెల్పేర్ ఆర్గనైజేషన్ , చెన్నై నగరపాలకసంస్థలు సంయుక్తంగా ఈ స్మశానవాటికను నిర్వహిస్తున్నాయి. కమ్యూనిటీ వేల్పేర్ ఆర్గనైజేషన్ ఈ స్మశానవాటికలో వైఫై సౌకర్యాన్ని కల్పించింది.స్మశానవాటికకు వస్తే భయంకరమైన అనుభూతిని తీసివేసేందుకుగాను ఈ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దారు.

125 పూలకుండీలను ఏర్పాటు చేశారు.స్మశానవాటిక ప్రహరీగోడపై రంగురంగుల బొమ్మలను ఏర్పాటు చేశారు. స్మశానవాటికలో సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు.అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వచ్చేవారి కోసం చల్లని మంచినీరు ఏర్పాటు చేశారు.వేసవిలో ఇబ్బందులు ఏర్పడకుండా కూలర్ ను ఏర్పాటు చేశారు.స్మశానవాటికలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా 24 గంటలపాటు సెక్యూరిటీని ఏర్పాటు చేశారు.
ప్రతి రోజు ఈ స్మశానవాటికలో సుమారు ఆరుగురికి అంత్యక్రియలు జరుగుతాయి. అంత్యక్రియలకు హజరుకాలేకపోయిన వారి కోసం వైఫే ఏర్పాటు చేసినట్టు ఇండియన్ కమ్యూనిటీ వెల్పేర్ సోసైటీ ఆర్గనైజేషన్ కార్యదర్శి హరిహరన్ తెలిపారు వైఫే ఏర్పాటు చేయడం వల్ల తమకు ఆదరణ పెరుగుతోందన్నారు.స్మశానవాటికిలో ఇద్దరు మహిళలు కూడ పనిచేస్తున్నారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications