Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంద్రయాన్-2 హైలైట్స్: టేకాఫ్ నుంచి విక్రమ్ ల్యాండర్ గతి తప్పడం వరకు...

కోట్లాదిమంది భారతీయుల ఆశలు, కలలను తన వెంట మోసుకెళ్లిన చంద్రయాన్ - 2.. చిట్ట చివరి నిమషంలో గతి తప్పింది. విఫలమైంది. ఊరించి.. ఉసూరుమనిపించింది. చంద్రుడి ఉపరితలానికి సుమారు 400 మీటర్ల దూరంలో ఉన్న సమయంలో దారి తప్పింది. మరి కొన్ని క్షణాల్లో చంద్రుడి ఉపరితలంపై దిగాల్సిన విక్రమ్ ల్యాండర్ నుంచి ఎలాంటి సంకేతాలు అందకుండా పోయాయి. విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు అందాయని ఆశించిన శాస్త్రవేత్తలకు చేదు సమాచారం అందింది. విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధృవం వైపు క్రాష్ ల్యాండింగ్ అయినట్లు గుర్తించారు. కాలం గడుస్తున్నప్పటికీ.. ల్యాండర్ నుంచి ఎలాంటి సంకేతాలు అందలేదు. దీనితో భూమితో సంబంధాలు తెగిపోయినట్లు ధృవీకరించారు.

chandrayaan

ఇదిలా ఉంటే మొత్తం ప్రక్రియను ప్రధాని నరేంద్ర మోడీ వీక్షించారు. రష్యా నుంచి ఢిల్లీ చేరుకున్న ప్రధాని అక్కడి నుంచి బెంగళూరుకు చేరుకున్నారు. ప్రయోగం విఫలమవడంపై నిరుత్సాహపడొద్దని శాస్త్రవేత్తలతో మోడీ అన్నారు. శాస్త్రవేత్తల ప్రయత్నాన్ని మోడీ కొనియాడారు. దేశం మొత్తం గర్వపడుతోందని చెప్పారు.

Sep 07, 2019, 8:02 pm IST

గత 60 ఏళ్లలో 40శాతం మిషన్‌లు విఫలమయ్యాయి: నాసా
Sep 07, 2019, 12:38 pm IST

అమరావతి

చంద్రయాన్-2 కోసం శాస్త్రవేత్తలు రేయింబవళ్లు కష్టపడ్డారు : ఏపీ సీఎం జగన్
Sep 07, 2019, 11:00 am IST

ముంబై

బెంగళూరు నుంచి ముంబై చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ
Sep 07, 2019, 10:07 am IST

బెంగళూరు

ఇస్రో తన లక్ష్యాన్ని త్వరలో ఛేదిస్తోంది : ప్రధాని మోడీ
Sep 07, 2019, 9:31 am IST

చివరి నిమిషంలో సవాలును అధిగమించలేకపోయిందని, కానీ దీని వెనక భారత శాస్త్రవేత్తల కృషి ఎంతో ఉంది. మీరు చూపిన ధైర్యం, సాహసం చరిత్రలో నిలిచిపోతాయి.ప్రధాని మోడీ టీమ్ కచ్చితంగా ఒకరోజు దీన్ని సాధిస్తుందన్న అపార విశ్వాసం నాకుంది: భూటాన్ ప్రధాని లోటే షెరింగ్
Sep 07, 2019, 9:20 am IST

ఇస్రో, ఇస్రోలో పనిచేసే శాస్త్రవేత్తల పట్ల దేశం గర్విస్తోంది. చంద్రుడిపైకి మిషన్ పంపడంలో విజయం కచ్చితంగా సాధిస్తుందన్న విశ్వాసం నాకుంది: రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
Sep 07, 2019, 8:50 am IST

అంతరిక్షరంగ శాస్త్రవేత్తలు ప్రజల జీవితాలను మెరుగుపర్చడమే కాదు వారి జీవన విధానాలను కూడా మార్చివేశారు: ప్రధాని మోడీ
Sep 07, 2019, 8:48 am IST

ప్రతి అడ్డంకి, ప్రతి ఫెయిల్యూర్,ప్రతి కష్టం కొత్త పాఠాలను నేర్పిస్తుంది. కొత్త సాంకేతికతను కనుగొనేందుకు బాటలు వేస్తాయి: ప్రధాని మోడీ
Sep 07, 2019, 8:46 am IST

త్వరలోనే ఓ కొత్త అధ్యాయం లిఖిద్దాం: ప్రధాని మోడీ
Sep 07, 2019, 8:46 am IST

మీ కృషి ఎంతో గొప్పది, అదే సమయంలో ఈ ప్రయాణం చాలా గొప్పది. ఎంతో సాధించారు. మీరు ఎన్నో విషయాలను నేర్పారు
Sep 07, 2019, 8:44 am IST

ఈ రోజు కొన్ని సవాళ్లను అధిగమించలేక పోయి ఉండొచ్చు.. అంతమాత్రానా మన అంకితభావం దెబ్బతిన్నట్లు కాదు: ప్రధాని మోడీ
Sep 07, 2019, 8:42 am IST

ఇస్రో నుంచి ఇంకా అత్యుత్తమమైనది వస్తుంది..దేశం మొత్తం ఇస్రో వెంట ఉంది. ప్రయోగాలు చేసిన ప్రతీసారీ ఎంతో గొప్పగా పనిచేశారు: మోడీ
Sep 07, 2019, 8:41 am IST

భారత్‌ అంతరిక్షరంగంలో శాస్త్రవేత్తలు చేసిన కృషి ఎంతో గొప్పది: ప్రధాని మోడీ
Sep 07, 2019, 8:40 am IST

ఇస్రో ఛైర్మెన్ శివన్‌కు సొంత సోదరిడిలా ఓదార్చిన ప్రధాని మోడీ
Sep 07, 2019, 8:39 am IST

భావోద్వేగానికి గురైన ఇస్రో ఛైర్మెన్ డాక్టర్ శివన్‌ భుజం తట్టి ధైర్యం చెప్పిన ప్రధాని మోడీ
Sep 07, 2019, 8:38 am IST

గత రాత్రి శాస్త్రవేత్తలు ఎలాంటి మీరు ఎలాంటి అనుభూతికి గురయ్యారో మీ కళ్లు చెబుతున్నాయి: ప్రధాని మోడీ
Sep 07, 2019, 8:38 am IST

భారత్ మాతా కీ జై నినాదంతో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ
Sep 07, 2019, 8:36 am IST

దేశం మొత్తం మీ వెంట ఉంది..ఈ సమయంలో నిరుత్సాహపడకండి: ప్రధాని మోడీ
Sep 07, 2019, 8:34 am IST

శాస్త్రవేత్తలకు భరోసా ఇచ్చిన ప్రధాని మోడీ
Sep 07, 2019, 3:38 am IST

ఇస్రో ప్రెస్ మీట్ నిర్వహించాల్సి ఉండగా దాన్ని వాయిదా వేయడం జరిగింది.ల్యాండర్ విక్రమ్ ల్యాండింగ్ విఫలమవడంతో డేటాను పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు
Sep 07, 2019, 3:36 am IST

స్కూలు విద్యార్థులతో ముచ్చటించిన ప్రధాని మోడీ. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు జవాబు ఇచ్చిన ప్రధాని
Sep 07, 2019, 2:20 am IST

ధైర్యంగా ఉండాలని శాస్త్రవేత్తలకు ప్రధాని మోడీ పిలుపు
Sep 07, 2019, 2:18 am IST

2.1 కిలోమీటర్లు ఎత్తువరకు విక్రమ్ ల్యాండర్ సాధారణంగా పనిచేసింది. ఆ తర్వాత ల్యాండర్ నుంచి సంకేతాలు వెలువడలేదు. డేటాను పరిశీలిస్తున్నాం: ఇస్రో ఛైర్మెన్ డాక్టర్ శివన్
Sep 07, 2019, 2:16 am IST

ల్యాండర్‌తో ఇస్రోకు తెగిపోయిన సంబంధాలు
Sep 07, 2019, 2:15 am IST

షెడ్యూల్ సమయం కంటే 20 నిమిషాలు ఆలస్యంగా ఇస్రోకు అందిన డేటా
Sep 07, 2019, 2:11 am IST

ల్యాండింగ్‌ ప్రక్రియ ఆలస్యంగా జరుగుతోంది
Sep 07, 2019, 2:05 am IST

ఇస్రో సెంటర్ నుంచి వెనుదిరిగిన ప్రధాని మోడీ
Sep 07, 2019, 2:00 am IST

ఇస్రో సెంటర్‌లో తలెత్తిన టెన్షన్ వాతావరణం..ఆందోళనతో కనిపిస్తున్న శాస్త్రవేత్తలు
Sep 07, 2019, 1:59 am IST

ప్రధాని మోడీకి పరిస్థితిని వివరించిన ఇస్రో ఛైర్మెన్ శివన్
Sep 07, 2019, 1:58 am IST

ల్యాండర్ నుంచి సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్న ఇస్రో
READ MORE

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+