6వ తేదీ నాటి తెలుగు రాష్ట్రాల పొలిటికల్ అప్ డేట్స్

పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండటంతో పార్టీలన్నీ ప్రచారం ఉద్ధృతం చేశారు. లోక్‌సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారానికి కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయపార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. అధికార, ప్రతిపక్షాలు విమర్శలు, ప్రతి విమర్శలతో మాటల తూటాలు పేల్చుతున్నాయి. ఏపీలో టీడీపీ చీఫ్ చంద్రబాబు గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉగాదిని పురస్కరించుకుని ప్రచారానికి విరామమిచ్చిన జగన్ అమరావతిలో పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే అనారోగ్యం కారణంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రచారానికి దూరమయ్యారు. తెలంగాణలో 16 సీట్లలో గెలుపే లక్ష్యంగా కారు దూసుకుపోతోంది. ఇక జాతీయ స్థాయిలో ప్రధాని నరేంద్రమోడీ, కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీలు ప్రచారంలో బిజీ అయ్యారు.

Live Updates : only 4 days left for first Phase campaign

Apr 06, 2019, 5:50 pm IST

ఒడిశా : బాలాసోర్ లో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రోడ్ షో
Apr 06, 2019, 5:50 pm IST

యూపీ : ఫతేపూర్ లో రోడ్ షో నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ ప్రియాంక గాంధీ
Apr 06, 2019, 5:50 pm IST

యూపీ : ఫతేపూర్ లో రోడ్ షో నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ ప్రియాంక గాంధీ
Apr 06, 2019, 5:42 pm IST

కోడికత్తి పార్టీ మోదీ, కేసీఆర్ తో కలిసి కుట్రలు పన్నుతుందని మండిపాటు
Apr 06, 2019, 5:40 pm IST

ప్రకాశం జిల్లా చీమకుర్తిలో చంద్రబాబు ప్రచారం
Apr 06, 2019, 5:27 pm IST

తనకు బీజేపీతో 25 ఏళ్ల అనుబంధం ఉందని, తాను పార్టీ వీడటానికి ఇద్దరు వ్యక్తులు కారణమన్నారు శత్రుఘ్నసిన్హా
Apr 06, 2019, 5:26 pm IST

హరిద్వార్ : ప్రధాని మోదీ గురువును వంచించిన శిష్యుడని అభివర్ణించారు రాహుల్, శనివారం హరిద్వార్ ప్రచారంలో భాగంగా మోదీ వైఖరిని ఎండగట్టారు.
Apr 06, 2019, 5:24 pm IST

న్యూఢిల్లీ : తాను బీజేపీని వీడలేదని, అలాంటి పరిస్థితి పార్టీలో కల్పించారని ఫైరయ్యారు శత్రుఘ్నసిన్హా
Apr 06, 2019, 5:23 pm IST

మండవతోపాటు గాయత్రి రవి కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
Apr 06, 2019, 5:23 pm IST

సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన మండవ, గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేసీఆర్
Apr 06, 2019, 5:22 pm IST

హైదరాబాద్ : టీఆర్ఎస్ లో చేరిన మాజీమంత్రి మండవ వెంకటేశ్వరరావు
Apr 06, 2019, 3:05 pm IST

న్యూఢిల్లీ : కాంగ్రెస్ మరో జాబితా రిలీజ్ చేసిన పార్టీ, పాట్నాాసాహిబ్ నుంచి బరిలోకి శత్రుఘ్న సిన్హా
Apr 06, 2019, 3:04 pm IST

న్యూఢిల్లీ : కాంగ్రెస్ లో చేరిన శత్రుఘ్నసిన్హా, బీహార్ లోని పాట్నా సాహిబ్ నుంచి బరిలోకి దిగుతోన్న ఫైర్ బ్రాండ్, బీజేపీ నుంచి పోటీ చేస్తున్న కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్
Apr 06, 2019, 3:02 pm IST

యూపీ : కన్నౌజ్ నుంచి బరిలోకి దిగుతోన్న డింపుల్ యాదవ్, భర్త అఖిలేశ్‌తో కలిసి నామినేషన్ దాఖలు చేశారు.
Apr 06, 2019, 3:02 pm IST

యూపీ : కన్నౌజ్ నుంచి బరిలోకి దిగుతోన్న డింపుల్ యాదవ్, భర్త అఖిలేశ్‌తో కలిసి నామినేషన్ దాఖలు చేశారు.
Apr 06, 2019, 2:45 pm IST

మోదీ, జగన్ ఏకమైనా ఏమీ చేయలేరు.. అన్ని సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొంటాం.. బాబు
Apr 06, 2019, 2:45 pm IST

ప్రధాని హోదాలో ఉండి కూడా రాజ్యాంగేతర శక్తిగా మోదీ వ్యవహరిస్తున్నారు.. ఇది కరెక్టు కాదు..బాబు
Apr 06, 2019, 2:39 pm IST

గిట్టుబాటు ధర కోసం 5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తాం.. -చంద్రబాబు
Apr 06, 2019, 2:36 pm IST

సాంకేతికతలో విప్లవాత్మక మార్పులు తీసకురాబోతున్నాం.. -బాబు
Apr 06, 2019, 2:32 pm IST

విద్యారంగంలో వంద శాతం అక్షరాస్యత సాధిస్తాం.. -బాబు
Apr 06, 2019, 2:28 pm IST

విద్యార్థులు ఇంటర్ పాస్ ఐతే నిరుద్యోగ భ్రుతి, లాప్ టాప్ అందజేస్తాం.. -బాబు
Apr 06, 2019, 2:22 pm IST

ఏపిలో నదుల అనుసందానం చేసి నీటి సమస్యను అదిగమించాం.. బాబు
Apr 06, 2019, 2:19 pm IST

హైదరాబాద్ లో ఉంటూ అమరావతిలో జగన్ ఎలా పోటీ చేస్తారు..? -బాబు
Apr 06, 2019, 2:10 pm IST

అమరావతి గ్రాఫిక్స్ చూస్తేనే కొంత మందికి కళ్లు తిరిగాయి.. రేపు నిర్మాణాలు పూర్తైతే నిజంగా అవాక్కైపోతారు.. బాబు
Apr 06, 2019, 2:08 pm IST

అభివ్రుద్ది, సంక్షేమ రంగాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం.. బాబు
Apr 06, 2019, 2:07 pm IST

వ్యవసాయ రంగాన్ని రాజశేఖర్ రెడ్డి భ్రష్టు పట్టించారు... బాబు
Apr 06, 2019, 1:56 pm IST

కనీసం మేనిఫెస్టో కూడా రూపొందించుకోవడం చేతలకాలేదని వైసిపి పై మండిపడ్డ చంద్రబాబు..
Apr 06, 2019, 1:54 pm IST

ఎన్నికల మేనిఫెస్టో అంశాలను వివరిస్తున్న చంద్రబాబు..
Apr 06, 2019, 1:39 pm IST

నిజామాబాద్ లో తన కూతురు కవిత ఓడిపోతుందనే భయంతో మండవ వెంకటేశ్వర రావు ఇంటికి వెళ్లిన కేసీఆర్.. -లక్ష్మణ్
Apr 06, 2019, 1:37 pm IST

ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పై తీవ్ర ఆరోపణలు చేసిన బీజేపి రాష్ట్ర అద్యక్షుడు లక్ష్మణ్..
READ MORE

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+