ఓట్ల పథకాల కోసం చంద్రబాబు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదు: జగన్

తెలుగురాష్ట్రాల్లో నేటితో ప్రచార పర్వానికి తెరపడనుంది. ఏప్రిల్ 11న పోలింగ్ నేపథ్యంలో నిబంధనల మేరకు ఇవాళ సాయంత్రం 5గంటలకల్లా నేతలు ప్రచారం ముగించనున్నారు. మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో రాజకీయ పార్టీలన్నీ ప్రచారంలో జోరు పెంచాయి. చివరి కొన్ని గంటల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇంతకాలం విమర్శలు, ప్రతివిమర్శలతో మాటల తూటాలు పేల్చుకున్న రాజకీయపార్టీల నాయకులు ప్రచారం గడువు ముగిసేలోగా వీలైనంత ఎక్కువ మంది ఓటర్లతో మమేకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు గుంటూరులో ప్రచారం నిర్వహించనుండగా... వైసీపీ చీఫ్ జగన్ గుంటూరు, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో జరగనున్న ర్యాలీల్లో పాల్గొననున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ పశ్చిమగోదావరి జిల్లా ఓటర్లతో మమేకంకానున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గడువుకు ఒకరోజు ముందే ప్రచారానికి తెర దించారు. మరోవైపు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా చేవెళ్లలో జరగనున్న పార్టీ బహిరంగసభలో పాల్గొననున్నారు.

Live Updates : only Few Hours left for first Phase campaign

Apr 09, 2019, 5:20 pm IST

అద్దె నాయకులతో చంద్రబాబు ప్రచారం చేయించారు: జగన్
Apr 09, 2019, 5:11 pm IST

కేసీఆర్ హోదా కోసం మద్దతు ఇస్తా అంటే స్వాగతించాల్సిందిపోయి ఆయనపై విమర్శలు చేస్తున్నారు చంద్రబాబు: జగన్
Apr 09, 2019, 5:10 pm IST

కార్యకర్త కాలర్ ఎగురేసి ఫలానా వ్యక్తి మానాయకుడు అని చెప్పుకునే పరిస్థితి ఉండాలి: జగన్
Apr 09, 2019, 5:10 pm IST

ఎక్కడ ఎవరికి సమస్య వచ్చిన ప్రజల తరుపున పోరాడాను,ధర్నాలు చేశాను: జగన్
Apr 09, 2019, 5:09 pm IST

ప్రత్యేక హోదాను చంద్రబాబు తాకట్టు కట్టారు: జగన్
Apr 09, 2019, 5:09 pm IST

నేను చెప్పులు విప్పి కాలినడకన శ్రీవారిని దర్శించుకున్నాను..నేను చెప్పులు వేసుకుని శ్రీవారిని దర్శించుకున్నట్లు పవన్ చెబుతున్నాడు: జగన్
Apr 09, 2019, 5:08 pm IST

ఓట్ల పథకాల కోసం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదు: జగన్
Apr 09, 2019, 5:04 pm IST

చంద్రబాబుకు కేసీఆర్‌ అంటే సరిపోదు: జగన్
Apr 09, 2019, 5:04 pm IST

తెలుగు రాష్ట్రాల ఎంపీలు ఒకే తాటిపైకొచ్చి ప్రత్యేక హోదా డిమాండ్ తీసుకొస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి: జగన్
Apr 09, 2019, 5:03 pm IST

ఏపీకి ప్రత్యేక హోదా కోసం టీఆర్ఎస్ ఎంపీలు మద్దతు ఇస్తారని కేసీఆర్ చెప్పారు: జగన్
Apr 09, 2019, 5:02 pm IST

తిరుపతిలో జగన్ ఎన్నికలు ప్రచారం: చంద్రబాబు రకరకాలుగా అబద్ధాలు చెబుతున్నారు: జగన్
Apr 09, 2019, 3:23 pm IST

కర్నాటకలో ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారో తెలియడం లేదు. రాజకీయ లబ్ధి కోసం రెండు బలహీనమైన పార్టీలు ఒక్కటయ్యాయి: మోడీ
Apr 09, 2019, 3:22 pm IST

ప్రపంచమంతా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతూ భారత్‌కు మద్దతుగా నిలుస్తుంటే ఇక్కడ మాత్రం మహాగట్భందన్ పార్టీలు పాకిస్తాన్‌కు మద్దతు తెలుపుతున్నాయి: మోడీ
Apr 09, 2019, 3:20 pm IST

ఎన్నికల తర్వాత ఇతర పార్టీలతో పొత్తుకు సిద్ధంగా ఉన్నాం: మోడీ
Apr 09, 2019, 3:19 pm IST

సహారన్‌పూర్‌లో ప్రియాంకా గాంధీ రోడ్ షో
Apr 09, 2019, 2:46 pm IST

రాహుల్ బాబా , కేసీఆర్ లాంటోళ్లు ఏవో ఫ్రంట్‌లు కట్టాలని చూస్తున్నారు. వాటి వల్ల వారి కుటుంబాలకే ప్రయోజనం ప్రజలకు కాదు : అమిత్‌షా.
Apr 09, 2019, 2:39 pm IST

దేశ ప్రజలంతా మరో సారి మోడీనే ప్రధాని కావాలని కోరుకుంటున్నారు : అమిత్‌షా
Apr 09, 2019, 2:34 pm IST

కాశ్మీరుకు ప్రత్యేక ప్రధాని కావాలని నేషనల్ కాన్ఫరెన్స్ చేస్తున్న డిమాండ్‌ను రాహుల్ గాంధీ సమర్థిస్తారా అని అమీత్‌సా ప్రశ్నించార.
Apr 09, 2019, 2:32 pm IST

దేశం గర్విస్తున్న సర్జికల్ దాడులను కాంగ్రెస్ చులకన చేసి మాట్లాడుతోంది
Apr 09, 2019, 2:29 pm IST

దేశభద్రత విషయంలో కాంగ్రెస్ పార్టీ విధానాలను ప్రశ్నించాలి. పాకిస్థాన్‌ను సమర్థించేలా మాట్లాడుతారా ?
Apr 09, 2019, 2:27 pm IST

16 ఎంపీ స్థానాలు గెలిచి కేసీఆర పీఎం అవుతారా ? రాష్ట్రంలో భారీ మెజార్టీతో గెలిచి కూడా రెండు నెలల పాటు కేబినెట్ ఏర్పాటు చేసుకోలేకపోయారు.
Apr 09, 2019, 2:26 pm IST

కేసీఆర్ ఎంఐఎం అధినేత ఓవైసీకి భయపడుతున్నారు. లేకపోతే తెలంగాణ విమోచన దినం నిర్వహించే ధైర్యం కేసీఆర్‌కు ఉందా ?
Apr 09, 2019, 2:22 pm IST

తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం. కాంగ్రెస్ పార్టీ ఏమి చేసిందో చెప్పాలి.
Apr 09, 2019, 2:20 pm IST

చేవెళ్ల బీజేపీ అభ్యర్థి జనార్దన్‌రెడ్డికి మద్దతుగా అమిత్‌షా ప్రచారం.
Apr 09, 2019, 2:19 pm IST

తెలంగాణలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చివరి ప్రచార సభ. శంషాబాద్‌లో కార్యకర్తలను ఉత్తేజపరచిన షా.
Apr 09, 2019, 1:25 pm IST

ఎంత అణిచివేస్తే అంతగా రెచ్చిపోవాలి:ప్రజలకు చంద్రబాబు పిలుపు
Apr 09, 2019, 1:24 pm IST

ప్రధాని నరేంద్ర మోడీ మన రాష్ట్రానికి అన్యాయం చేశారు: మోడీ
Apr 09, 2019, 1:23 pm IST

కోడికత్తి పార్టీకి ఓటు వేస్తే మనకు నీళ్లు రావు: చంద్రబాబు
Apr 09, 2019, 1:17 pm IST

వీవీ ప్యాట్‌లు నేనే తెప్పించా: చంద్రబాబు
Apr 09, 2019, 1:17 pm IST

మోడీ షా ఇద్దరూ దొంగలు..జగన్ కేసీఆర్ ఇద్దరూ పెంపుడు కుక్కలు: చంద్రబాబు
READ MORE

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+