రాం విలాస్ పాశ్వాన్ సోదరుడి మృతి.. గుండెపోటుతో లోహియా ఆస్పత్రిలో కన్నుమూత
న్యూఢిల్లీ : లోక్‌జనశక్తి పార్టీ అధినేత రాం విలాస్ పాశ్వాన్ సోదరుడు రాం చంద్ర పాశ్వాన్ కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను ఢిల్లీలోని ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఇవాళ ఉదయం గుండె పోటు రావడంతో కన్ను మూశారని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. చంద్ర పాశ్వాన్‌కు భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.
గుండెపోటు..
రాం విలాస్ పాశ్వాన్ చిన్న తమ్ముడే రాం చంద్ర పాశ్వాన్. ఈయన బీహర్‌లోని సమస్తిపూర్ నియోజకవర్గం నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరసగా నాలుగోసారి ఎంపీగా గెలిచారు. ఇతనికి భార్య సునైన కుమారి, ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉన్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు చంద్ర పాశ్వాన్. దీంతో వారం క్రితం ఢిల్లీలోని రాం మనోహర్ లోహియా ఆస్పత్రిలో చేర్పించారు.

అయితే ఇవాళ ఉదయం 10.30 గంటలకు గుండెపోటు వచ్చి మృతిచెందాడని వైద్యులు పేర్కొన్నారు. ఇవాళ ఢిల్లీలో చంద్ర పాశ్వాన్ అంత్యక్రియలు జరిగాయి. అంతకుముందు చంద్ర పాశ్వాన్ పార్థీవదేహం ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంజలి ఘటించారు. సోదరుడి మృతితో రాం విలాస్ పాశ్వాన్ శోక సంద్రంలో మునిగిపోయారు. ఆయనను నేతలు ఓదార్చారు.












Click it and Unblock the Notifications