Scam: స్టార్ హోటల్ లో రూ. 360 కోట్ల డీల్, నాడార్ స్కెచ్, లేడీ కాదు మగాడి మెడలోనే, ఢమాల్!
బెంగళూరు/ చెన్న/కొచ్చి: తక్కువ వడ్డీకి వందల కోట్ల రూపాయలు రుణం (loan) ఇప్పిస్తామని అమాయకులకు కుచ్చుటోపీ పెడుతున్న గోల్డ్ కింగ్, అతని చెమ్చా సినిమా పక్కీలో పోలీసులకు చిక్కిపోయారు. లేడీ మెడలో కాదు, మగాడి శరీరం మీద ఉన్న రూ. 2 కోట్ల విలువైన బంగారు నగలు ఇప్పుడు పోలీసుల లాకర్ లోకి వెళ్లిపోయాయి. ఏకంగా రూ. 360 కోట్లకు నకిలీ డీడీ చూపించి రూ. 7 కోట్లు కొట్టేసిన కేటుగాడు, అతని శిష్యుడి క్రిమినల్ మైండ్ చల్లబడటానికి నవరత్నా తైలంతో పోలీసులు మస్త్ మసాజ్ చేస్తున్నారు.

హరినాడార్ అంటేనే బంగారంకు బ్రాండ్..... క్రేజ్
తమిళనాడులోని తిరునల్వేలికి చెందిన హరి నాడార్ అలియాస్ హరి గోపాలక్రిష్ణ నాడార్ అంటే బంగారు నగలకు బ్రాండ్ అంబాసిడర్ ? అనేలా ఆయన గెటప్పు ఉంటుంది. మేడలో బంగారు గోలుసు, చేతులకు ఎన్ని వేళ్లు ఉంటాయో అంతకంటే ఎక్కువ సంఖ్యలో బంగారు, వజ్రాల ఉంగరాలు. చేతికి కడియాలు, కంకణాలు ఇలా కోట్ల రూపాయల విలువైన బంగారు నగలు ఆయన శరీరం మీద దర్శనం ఇస్తుంటాయి.

రూ. 369 కోట్లు డీల్
బెంగళూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామివేత్త వెంకటరమణ శాస్త్రీకి అతి తక్కువ వడ్డీకి బంగారంకు లోన్ ఇప్పిస్తామని తమిళనాడుకు చెందిన హరి నాడార్ గోపాలక్రిష్ణ, కేరళకు చెందిన రంజిత్ పణిక్కర్ మాయమాటలు చెప్పారు. మీకు రూ. 360 కోట్లు వస్తే మీరు ఇంకా మంచిమంచి వ్యాపారాలు చేసి కోట్ల రూపాయలు సంపాధించడనికి అవకాశం ఉంటుందని మాయమాటలు చెప్పారు.

కేరళ స్టార్ హోటల్ లో డీలింగ్
కేరళలోని ప్రముఖ స్టార్ హోటల్ లోకి బెంగళూరు వెంకటరమణ శాస్త్రిని పిలిపించారు. అక్కడ హరి నాడార్ గోపాలక్రిష్ణ, రంజిత్ పణిక్కర్ తదితరులు రూ. 360 కోట్ల నకిలీ డీడీని వెంకటరమణ శాస్త్రీకి చూపించారు. ప్రాసెసింగ్ ఫీజు అంటూ వెంకటరమణ శాస్త్రీ నుంచి రూ. 7.20 కోట్లు తీసుకున్నారు.

నెత్తిన కుచ్చుటోపీ
తరువాత వెంకటరమణ శాస్త్రీకి చిక్కకుండా ఆయనకు నిలువునా నెత్తిన కుచ్చుటోపీ పెట్టి జెండా ఎత్తేశారు. మోసం జరిగిందని ఆలస్యంగా గుర్తించిన వెంకటరమణ శాస్త్రి బెంగళూరులోని విధాన సౌధ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగి తమిళనాడు, కేరళలో తలదాచుకున్న హరి నాడార్ గోపాలక్రిష్ణ, రంజిత్ పణిక్కర్ ను అరెస్టు చేశారు.

అబ్బా బంగారు నగలేనా ?
హరి నాడార్ గోపాలక్రిష్ణను అరెస్టు చేసిన పోలీసులు అతని నుంచి రూ. 2 కోట్ల విలువైన 3 కేజీల 893 గ్రాముల బంగారు నగలు, 8, 76, 916 రూపాయల నగదు, ఇన్నోవా క్రిష్టా కారు స్వాధీనం చేసుకున్నారు. రంజిత్ ను అరెస్టు చేసి 10 లక్షల విలువైన 140 గ్రాముల వజ్రాలు, బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. వెంకటరమణ శాస్త్రీ కంపెనీ అకౌంట్ నుంచి డబ్బులు బదిలి కావడంతో నిందితులు బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు సులభంగా చిక్కిపోయారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications