బిజెపి మహిళా నేత గ్యాంగ్ రేప్, కూతురితో అసభ్యంగా..

ఆమె ఆదివారం తన ఇంటిలో ఉన్నప్పుడు కొందరు యువకులు లోనికి చొచ్చుకు వచ్చారు. అనంతరం ఆమె పైన సామూహిక అత్యాచారం చేశారు.
ఆ దుర్మార్గులు ఆమె భర్తను చితకబాదారు. అంతేకాకుండా.. ఇంట్లోనే ఉన్న ఆమె పదమూడేళ్ల బాలికతో అసభ్యంగా ప్రవర్తించారు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న నగదు, బంగారాన్ని దోచుకెళ్లారని పోలీసులు తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాల్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
అత్యాచారానికి పాల్పడ్డ వారు దాదాపు పది నుండి పన్నెండు మంది దాకా ఉంటారని చెబుతున్నారు. సంఘటన జరిగిన ప్రాంతం చాన్హో పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. బాధితురాలు బిజెపి మైనార్టీ సెల్ నాయకురాలు అని సమాచారం. పరీక్షళ నిమిత్తం ఆమెను సదర్ ఆసుపత్రికి తరలించారు.
బాధిత కుటుంబ సభ్యులు చాన్హో పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో వారు పలువురి అనుమానితుల పేర్లు పేర్కొన్నారు. విషయం తెలియగానే బిజెపి నేత, మాజీ ముఖ్యమంత్రి అర్జున్ ముండా సంఘటన స్థలానికి చేరుకున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications