క్యూలైన్లో రాని చిరు, షాకిచ్చిన ఓటర్లు: ఓటేసిన మోడీ
హైదరాబాద్/అహ్మదాబాద్: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ చిరంజీవికి బుధవారం ఓటు హక్కు వినియోగించునేందుకు వచ్చిన సమయంలో పలువురు ఓటర్లు షాకిచ్చారు. ఉదయం ఆయన జూబ్లీహిల్స్‌లోని ఇంటర్నేషనల్ క్లబ్ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు తన భార్య, తనయుడు రామ్ చరణ్ తేజ, కోడలితో కలిసి వచ్చారు.
చిరు మొదట క్యూలైన్లో నిలబడలేదు. దీంతో పలువురు స్థానిక ఓటర్లు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. చిరంజీవి కూడా క్యూలైన్లో రావాలని డిమాండ్ చేశారు. వారు అభ్యంతరం చెప్పడంతో చిరంజీవి క్యూలైన్లో వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అహ్మదాబాదులో మోడీ ఓటు
గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ బుధవారం ఉదయం అహ్మదాబాదులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్నికల ప్రచారంలో ఆసిరా గుజరాత్ ప్రజలకు ఎక్కువ సమయం కేటాయించలేకపోయానని చెప్పారు.
<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/LPyL5X8oThw?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>












Click it and Unblock the Notifications