షాక్: సంక్రాంతి డబుల్ ఢమాకా: రెండు తలలు, నాలుగు కళ్లతో !

బెంగళూరు: సంక్రాంతి పండగ సందర్బంగా కర్ణాటకలోని మంగళూరు సమీపంలో ఓ ఆవు రెండు తలల దూడకు జన్మనిశ్చింది. రెండు తలలు, నాలుగు కళ్లు, మూడు చెవులు ఉన్న ఆ లేగదూడను చూడటానికి ఇప్పుడు స్థానికులతో పాటు పొరుగు జిల్లాల ప్రజలు క్యూకడుతున్నారు.

మంగళూరు బజ్పే అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని కత్తల్ సార్ గురుంపె గ్రామంలో హేమనాథ్ శెట్టి అనే అన్నదాత నివాసం ఉంటున్నారు. ఈయన 8 ఏళ్ల క్రితం ఓ సంతలో ఆవును కొనుగోలు చేశారు.

Locals were intrigued to witness a cow at Bajpe delivering a two-headed calf with four eyes.

ఇప్పటికే ఆ ఆవు రెండు దూడలకు జన్మనిశ్చింది. సంక్రాంతి పండగ సందర్బంగా మరొ దూడకు జన్మనిశ్చింది. అయితే పండగ సందర్బంగా జన్మించిన దూడకు రెండు తలలు ,నాలుగు కళ్లు, మూడు చెవులు ఉన్నాయి.

దేహం మాత్రం ఒక్కటే ఉంది. ఆ దూడ తల్లి దగ్గర పాలు తాగడానికి ఇబ్బందిపడుతున్నది. హేమనాథ్ శెట్టి కుటుంబ సభ్యులు పాల బుడ్డీలతో దూడకు పాలు తాగిస్తున్నారు. విషయం తెలుసుకున్న స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామ ప్రజలు, మంగళూరు నగర ప్రజలు హేమనాథ్ శెట్టి ఇంటి దగ్గర క్యూ కడుతున్నారు. వింతగా జన్మించిన దూడను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+