Lockdown: పీకలదాకా తాగి పామును ముక్కలుగా కొరికేశాడు, భలా బాలరాజు భలా, వీడికి చైనా గాలి సోకింది !

బెంగళూరు/ కోలారు: కరోనా వైరస్ (COVID 19) కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో ప్రజలకు పిచ్చిపట్టినట్లు అయ్యింది. ఇక లాక్ డౌన్ సడలించిన ప్రభుత్వాలు మద్యం విక్రయించడంతో 40 రోజుల తరువాత క్వాటర్ తాగిన మందుబాబులకు ఒక ఫుల్ బాటిల్ తాగినంత కిక్కు ఎక్కిపోయింది. పీకలదాక మద్యం సేవించిన వ్యక్తి బైక్ వెలుతుంటే పాము అడ్డంగా వచ్చిందని అతను రెచ్చిపోయాడు. నాకే అడ్డం వస్తావా ? నీకు ఎంత ధైర్యం అంటూ ఆ పామును రెండు చేతులతో పట్టుకుని నోటితో కొరికి మూడు ముక్కలు చేశాడు. మందులోకి చికెన్ ముక్కలేక పామును తినేశాడని స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తాగుబోతు పామును ముక్కలు చేస్తున్న సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భలా బాలరాజు భలా అంటున్నారు.

ఆంధ్రా- కర్ణాటక బార్డర్

ఆంధ్రా- కర్ణాటక బార్డర్

లాక్ డౌన్ సందర్బంగా 40 రోజులకు పైగా బ్రాందీ షాప్ లు బంద్ చెయ్యడంతో మందుబాబులు ఇన్ని రోజులు నానా తంటాలు పడ్డారు. సోమవారం ఒక్కసారిగా బ్రాందీ షాప్ లు తియ్యడంతో వైన్ షాపుల ముందు మందుబాబులతో జాతర వాతావరణం నెలకొనింది. ఇక ఆంధ్రప్రదేశ్- కర్ణాటక సరిహద్దుల్లో మందుబాబుల సందడి ఇంతాఅంతా కాదు.

పీకలదాకా తాగేశాడు

పీకలదాకా తాగేశాడు

ఆంధ్రప్రదేశ్ -కర్ణాటక సరిహద్దులోని కోలారు జిల్లా ముళబాగిలు తాలుకా ముస్టూరుకు చెందిన బాలరాజు అనే యువకుడు బ్రాందీ షాప్ దగ్గరకు వెళ్లి కావలసినంత మద్యం కొనుగోలు చేసి ఫ్రెండ్స్ తో కలిసి సమీపంలోని పోలం పక్కన ఉన్న చెట్టుకింద కుర్చుని కడుపు నిండిపోయే విధంగా పీకలదాక లిక్కర్ తాగేశాడు.

అసలే లిక్కర్ కిక్కు, పాపం పాముకు ఏం తెలుసు !

అసలే లిక్కర్ కిక్కు, పాపం పాముకు ఏం తెలుసు !

పీకలదాకా మద్యం సేవించిన బాలరాజు బైక్ లో ఇంటికి బయలుదేరాడు. అయితే మార్గం మద్యలో కిక్కులో ఊగుతూ తూలుతూ బైక్ నడుపుతున్న బాలరాజు ఒక్కసారిగా బండి బ్రేక్ వేశాడు. అతని బైక్ ముందు పాము నిలబడి అతని వైపు చూసింది. అసలే 40 రోజుల తరువాత పీకలదాక మద్యం తాగిన బాలురాజుకు పామును చూసిన వెంటనే అతని ఒళ్లు మండిపోయింది.

నీకు ఎంత ధైర్యముంటే ?

నీకు ఎంత ధైర్యముంటే ?

ఇంటికి వెలుతుంటే నాకు ఎదురు వస్తావా అంటూ ఆ పామును రెండు చేతులతో పట్టుకున్న బాలరాజు నోట్లో పెట్టుకుని మూడు ముక్కలుగా కొరికేశాడు. సుమారు నిమిషం పాటు తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసిన పాము చివరికి బాలరాజు నోటితో బలంగా కొరకడంతో అది అక్కడే చచ్చిపోయింది.

వీడికి చైనా గాలి సోకింది

వీడికి చైనా గాలి సోకింది

బాలరాజు పామును మూడు ముక్కలుగా కొరికి చంపేస్తున్న సమయంలో స్థానికులు మొబైల్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యింది. పాపం మందులోకి చికెన్ ముక్క చిక్కలేదేమో ? పాపం పామును కొరికి తినేశాడు, వీడికి చైనా గాలి సోకినట్లు ఉందని బాలరాజుకు స్థానికులు శాపనార్తాలు పెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+