Lockdown:స్టార్ హీరోయిన్ హల్ చల్, కారులో ఈ పాస్, అర్దరాత్రి ఏం పని ? అందుకేనా ? మాయం !

బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) ను అరికట్టడానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉన్నా రోడ్ల మీద తిరిగే వారికి మాత్రం కొదవ లేదు. ఇక కొందరు వీవీఐపీలు, వీఐపీలు, కొందరు సెలబ్రిటీలు తమ పలుకుబడి ఉపయోగించి లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించి రోడ్ల మీద తిరిగేస్తున్నారు. ఇలాగే ప్రముఖ కన్నడ స్టార్ హీరోయిన్ షర్మిల మండ్రే అర్దరాత్రి స్నేహితులతో కలిసి విలాసవంతమైన కారులో జాలీరైడ్ వెళ్లి రోడ్డు ప్రమాదానికి గురైనారు. ప్రమాదానికి గురైన కారులో అత్యవసర పరిస్థితుల్లో సంచరించడానికి పోలీసులు జారీ చేసే ఈ పాస్ చిక్కింది. అర్దరాత్రి హీరోయిన్ అత్యవసర సేవల కోసం బయటకు వచ్చారా ? లేక మరెందుకు వచ్చారు ? అంటూ ఆరా తీస్తున్నారు. నటి షర్మిల మండ్రే లాక్ డాన్ నియమాలు ఉల్లంఘించారని పలువురు విమర్శలు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన తరువాత షర్మిల మండ్రే మాయం కావడంతో బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసి ఆమె కోసం గాలిస్తున్నారు.

అర్దరాత్రి అమ్మడు జాలీరైడ్

అర్దరాత్రి అమ్మడు జాలీరైడ్

ప్రముఖ కన్నడ హీరోయిన్ షర్మిల మండ్రే లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించి శనివారం అర్దరాత్రి స్నేహితులతో కలిసి విలాసవంతమైన జగ్వార్ కారులో జాలీరైడ్ వెళ్లారని తెలిసింది. జాలీరైడ్ వెళ్లిన హీరోయిన్ షర్మిల మండ్రే కారు శనివారం వేకువ జామున 3 గంటల సమయంలో బెంగళూరు నగరంలోని వసంతనగర్ ఫ్లైఓవర్ కిందిభాగంలోని పిల్లర్ ను ఢీకొనింది. ఈ ప్రమాదంలో షర్మిల మండ్రే ప్రయాణించిన కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది.

కారులో ఈ పాస్

కారులో ఈ పాస్

స్టార్ హీరోయిన షర్మిల మండ్రే ప్రయాణించిన కారు ప్రమాదానికి గురైన విషయం తెలుసుకున్న హైగ్రౌండ్స్ పోలీసులు ఆ వాహనం మొత్తం పరిశీలించారు. షర్మిల మండ్రే ప్రయాణించిన కారులో పోలీసులు జారీ చేసిన ఈ పాస్ చిక్కింది. లాక్ డౌన్ నేపథ్యంలో అత్యవసర అవసరాల కోసం సంచరించడానికి బెంగళూరు సిటీ పోలీసులు జారీ చేసిన ఈ పాస్ ఇది కావడం విశేషం.

ఆన్ లైన్ లో ఈ పాస్

ఆన్ లైన్ లో ఈ పాస్

షర్మిల మండ్రే ప్రయాణించిన ఖరీదైన జాగ్వార్ కారులో పోలీసులకు చిక్కిన ఈ పాస్ ఆన్ లైన్ లో జారీ అయ్యిందని పోలీసు అధికారులు అంటున్నారు. అయితే ఈ కారు యజమాని నిజంగా అత్యవసర సేవల కోసం ఈ పాస్ తీసుకున్నారా ? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పోలీసులే అంటున్నారు.

అర్దరాత్రి అంత అత్యవసరమా ?

అర్దరాత్రి అంత అత్యవసరమా ?

నటి షర్మిల మండ్రే అర్ధరాత్రి అంత అత్యవసర సేవలు కోసం స్నేహితులతో కలిసి బయటకు వచ్చారా ? అంటూ పోలీసులు ఆరా తీస్తున్నారు. లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించి అర్దరాత్రి షర్మిల మండ్రే ఫ్రెండ్స్ తో కలిసి ఎందుకు బయటకు వచ్చారు ? అంటూ బెంగళూరు సిటీ పోలీసులు ఆరా తీస్తున్నారు.

స్టార్ హీరోయిన్ మాయం ?

స్టార్ హీరోయిన్ మాయం ?

ప్రమాదం జరిగిన తరువాత నటి షర్మిల మండ్రే, ఆమె స్నేహితుడు లోకేష్, మరో ఇద్దరు ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. ప్రమాదం వసంతనగర్ లో జరిగితే జేపీ నగర్ లో ప్రమాదం జరిగిందని వైద్యులకు తప్పుడు సమాచారం ఇచ్చారు. ఆసుపత్రిలోనే చికిత్స పొందాలని వైద్యులు సూచించినా నటి షర్మిల మండ్రేతో పాటు ఆమె స్నేహితులు అక్కడి నుంచి చాకచక్యంగా తప్పించుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

కారు సీజ్, ఎఫ్ఐఆర్

కారు సీజ్, ఎఫ్ఐఆర్

నటి షర్మిల మండ్రే ప్రయాణించిన జగ్వార్ కారును బెంగళూరులోని హైగ్రౌండ్స్ ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించి నటి షర్మిల మండ్రేతో పాటు ఆమె స్నేహితులు అర్దరాత్రి సంచరించారని, రోడ్డు ప్రమాదానికి కారణం అయ్యారని ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేస్తున్నామని బెంగళూరు నగర అడిషనల్ పోలీసు కమిషనర్ రవికాంత్ గౌడ మీడియాకు చెప్పారు. మొత్తం మీద బ్యూటీ షర్మిల మండ్రే తెలివితేటలు ఉపయోగించి అత్యవసర సేవల కోసం జారీ చేసే ఈ పాస్ సంపాదించారని వెలుగు చూసింది. నటి షర్మిల మండ్రే ప్రయాణించిన కారు ప్రమాదానికి కారణం అయిన సమయంలో సుమారు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+