Lockdown: నకిలీ ఐఏఎస్ అధికారి అరెస్టు, కథ వెనుక నర్సు లవ్ స్టోరీ, పోలీసులకు సూపర్ సినిమా !
చెన్నై/ మదురై: కరోనా వైరస్ (COVID 19) దెబ్బకు తమిళనాడు విలవిలలాడిపోతుంది. ఇప్పటికే లాక్ డౌన్ సడలింపులను కఠినం చేసిన తమిళనాడు సర్కార్ కరోనా కట్టడికి అనేక ఆంక్షలు విధించింది. లాక్ డౌన్ నియమాలను తుంగలోతొక్కి హల్ చల్ చేస్తున్న ఓ యువకుడు పోలీసు అధికారులకు చుక్కలు చూపించాడు. చెక్ పోస్టులో తాను ఐఏఎస్ అధికారి అంటూ కారులో దర్జాగా వెళ్లిపోయాడు. ఐఏఎస్ అధికారి ముసుగులో పోలీసు అధికారులకు సూపర్ సినిమా చూపించిన యువకుడి కథ వెనుక ఓ నర్సు ఉందని తెలుసుకున్న అధికారులు షాక్ కు గురైనారు. నిజమైన ఐఏఎస్ అధికారి ఎంట్రీతో సినిమా స్టోరీ రసవత్తరంగా మారిపోయింది.

సీఎం పళనిస్వామి ఆదేశం
తమిళనాడులో రోజురోజుకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వేల సంఖ్యలో పెరిగిపోవడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి కఠిన ఆంక్షలు అమలు చేశారు. లాక్ డౌన్ సడలింపులు పూర్తిగా బంద్ చేసి మళ్లీ చెన్నైతో పాటు అనేక జిల్లాల్లో సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేశారు. ఎవ్వరూ అనవసరంగా సంచరించకూడదని, అత్యవసరం అయితే అధికారుల దగ్గర ఈ - పాస్ లు తీసుకుని సంచరాలించాలని తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిస్వామి ప్రజలకు మనవి చేశారు.

చెక్ పోస్టులో నకిలీ ఐఏఎస్ అధికారి
తమిళనాడులోని మదురై విలాన్ గుడి చెక్ పోస్టు దగ్గర పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులు ఈ- పాస్ లు లేకుండా ఎవరైనా సంచరిస్తున్నారా ? అంటూ అన్ని వాహనాలు పరిశీలిస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ లోగో ఉన్న కారులో ఓ యువకుడు చెక్ పోస్టు దగ్గరకు వెళ్లాడు. తాను కొడైకెనాల్ సమీపంలోని పుదుపుత్తూరు ప్రాంతానికి చెందిన వేల్ మణి (27) అని అక్కడ ఉన్న పోలీసులు, రెవెన్యూఅధికారులను పరిచయం చేసుకున్నాడు.

నేను ఎవరనుకున్నారు ?
పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులతో ఐఏఎస్ అధికారి అని పరిచయం చేసుకున్న యువకుడి దగ్గర అసలు ఈ- పాస్ లేదు. నేను ఎవరనుకుంటున్నారు ? ఐఏఎస్ అధికారి, తన పేరు వేల్ మణి అని పోలీసు అధికారులకు గట్టిగా చెప్పాడు. ఐఏఎస్ అధికారితో ఎందుకు పెట్టుకోవాలి ? ఐఏఎస్ అధికారులకు ఈ- పాస్ అవసరం లేదు అనుకున్న పోలీసు అధికారులు వేల్ మణి మధురై వెళ్లడానికి అవకాశం కల్పించారు.

సార్ ఎవరైనా ఉన్నారా ?
వేల్ మణి అనే ఐఏఎస్ అధికారి మదురై వచ్చాడని చెక్ పోస్టులో ఉన్న పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులు మదురై జిల్లా కలెక్టర్ వినయ్ కు సమాచారం ఇచ్చారు. మదురై జిల్లా కలెక్టర్ విచారణలో అసలు వేల్ మణి అనే వ్యక్తి పేరుతో ఎవ్వరూ ఐఏఎస్ అధికారి లేరని, అసలు ఆ పేరుతో ఎవ్వరు ఐఏఎస్ శిక్షణ కూడా తీసుకోలేదని వెలుగు చూసింది. వెంటనే నకిలీ ఐఏఎస్ అధికారి వేల్ మణిని అరెస్టు చెయ్యాలని మదురై జిల్లా కలెక్టర్ వినయ్ పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

నకిలీ ఐఏఎస్ వెనుక నర్సు
పోలీసుల విచారణలో నకిలీ ఐఏఎస్ అధికారి గురించి దిమ్మతిరిగే విషయాలు వెలుగు చూశాయి. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన వేల్ మణి ఎంఏ చదివాడని వెలుగు చూసింది. పళనికి చెందిన ఓ నర్సును తాను ఐఏఎస్ అధికారి అని నమ్మించి ప్రేమించిన వేల్ మణి గత నెలలో రిజిస్టర్ ఆఫీసులో వివాహం చేసుకున్నాడని వెలుగు చూసింది. తరువాత తిరుచ్చి కలెక్టర్ కార్యాలయం దగ్గర హంగామా చేసి అక్కడ ఉన్న ప్రజల సమస్యలు పరిష్కరించే అధికారిగా నాటకం ఆడాడని అధికారుల విచారణలో వెలుగు చూసింది.
Recommended Video

గ్రాండ్ రిసెప్షన్ కోసం
నర్సుతో పెళ్లి చేసుకున్న వేల్ మణి వివాహ రిసెప్షన్ కు ఆహ్వాన పత్రికలు పంచిపెట్టడానికి నకిలీ ఐఏఎస్ అధికారి అవతారం ఎత్తాడని, ఇతను ఐఏఎస్ అధికారి అంటూ కారులో సంచరిస్తున్నాడని పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది. ముందు జాగ్రత్తగా ఇతను ఇంకా ఎంతమందిని ఇలా నకిలీ ఐఏఎస్ అధికారి అంటూ ఎంత మందిని మోసం చేశాడు ? అంటూ వేల్ మణిని విచారణ చేసి వివరాలు బయటకు లాగుతున్నామని మదురై పోలీసు అధికారులు తెలిపారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications