Lockdown: లేడీస్ టైలర్ రెండో పెళ్లి, సినిమా స్టైల్లో మొదటి భార్య ఎంట్రీ, భర్తకు గుండెపోటు!
చెన్నై/వేలూరు: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని అరికట్టడానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చెయ్యడంతో కేంద్ర ప్రభుత్వం నియమాల ప్రకారం 50 మంది బంధువుల మాత్రమే పెళ్లిళ్లకు హాజరౌతున్నారు. లాక్ డౌన్ లో లక్కీచాన్స్ చిక్కింది అంటూ ఓ లేడీస్ టైటర్ రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్దం అయ్యాడు. గుడిలో గుట్టుచప్పుడు కాకుండా భర్త రెండో భార్యకు తాళి కట్టే సమయంలో మొదటి భార్య ఎంట్రీ ఇవ్వడంతో అక్కడ రచ్చరచ్చ అయ్యింది. ఆ సమయంలో పెళ్లి కొడుకుకి గుండెపోటు రావడంతో సీన్ రివర్స్ అయ్యి అసలు కథ మొదలైయ్యింది.

లేడీస్ టైలర్ భార్య, పిల్లలు
ఆంధ్రప్రదేశ్- తమిళనాడు సరిహద్దులోని చిత్తూరు- వేలూరు సరిహద్దులోని మేట్టుఇడయాంబట్టి ప్రాంతంలోని ఎంజీఆర్ నగర్ లో రామచంద్రన్ (45) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. రామచంద్రన్ కు 19 ఏళ్ల క్రితం కమలి అనే మహిళతో వివాహం అయ్యింది. రామచంద్రన్, కమలి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. రామచంద్రన్ తొర్రపాడి ప్రాంతంలో టైలర్ దుకాణం నడుపుతున్నాడు.

తేడా వచ్చిందని !
రామచంద్రన్, కమలి వివాహం అయిన 14 ఏళ్లు లక్షణంగా కాపురం చేశారు. తరువాత దంపతుల మద్య తేడా వచ్చింది. సంవత్సరం పాటు గొడవలు పడిన దంపతులు వేర్వేరు కాపురాలు పెట్టారు. ఇద్దరు కుమారులు మాత్రం తల్లి కమలి దగ్గర నివాసం ఉంటున్నారు. టైలర్ పని చేసుకుంటూ రామచంద్రన్ ఒంటరిగా జీవిస్తున్నాడు.

బంధువుల ఇంట్లో లవ్
తమిళనాడు ప్రాంతంలోని కరూర్ లో నివాసం ఉంటున్న యువతి తొర్రపాడిలోని బంధువుల ఇంటికి వెళ్లింది. తొర్రపాడిలోనే టైలర్ పని చేస్తూ అక్కడే నివాసం ఉంటున్న రామచంద్రన్ కు, కరూర్ యువతికి పరిచయం అయ్యింది. తరువాత ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు.

లాక్ డౌన్ లో లక్కీచాన్స్
లాక్ డౌన్ సందర్బంగా మొదటి భార్య కమలికి విషయం తెలీకుండా గట్టుచప్పుడు కాకుండా రెండో పెళ్లి చేసుకోవాలని రామచంద్రన్ నిర్ణయించాడు. బుధవారం ఉదయం అడుక్కంబరైలోని అమ్మాన్ ఆలయంలో రామచంద్రన్ రెండో పెళ్లికి సర్వం సిద్దం అయ్యాయి. అమ్మాయి కుటుంబ సభ్యులు, రామచంద్రన్ కుటుంబ సభ్యులు, అతని స్నేహితులు గుడిలో జరుగుతున్న పెళ్లికి హాజరైనారు.

సినిమా స్టైల్లో ఆపండి అంటూ భార్య ఎంట్రీ
రామచంద్రన్ రెండో భార్య మెడలో తాళి కట్టేసమయానికి సినిమా స్టైల్లో ఎంట్రీ ఇచ్చిన మొదటి భార్య కమలి ఆపండి అంటూ కేకలు వేసింది. మొదటి భార్య వెంట ఆమె ఇద్దరు కుమారులు అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో పెళ్లి దుస్తుల్లో ఉన్న భర్త రామచంద్రన్ మొదటి భార్య కమలిని చూసి షాక్ కు గురైనాడు. ఆ సమయంలో పెళ్లి కుమార్తె బంధువులు, మొదటి భార్య కమలి, ఆమె బంధువులు వాగ్వివాదానికి దిగడంతో గుడిలో రచ్చరచ్చ అయ్యింది.

షాక్ తో పెళ్లి కొడుక్కి గుండెపోటు
మొదటి భార్య కమలి, రెండో భార్య బంధువులు గొడవ పడుతున్న సమయంలో విషయం తెలుసుకున్న పోలీసులు అమ్మాన్ ఆలయం దగ్గరకు చేరుకుని పెళ్లి నిలిపివేశారు. ఆ సమయంలో పెళ్లి కొడుకు రామచంద్రన్ కు గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. వెంటనే పెళ్లి కొడుకు రామచంద్రన్ ను వేలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Recommended Video

ఏం జరిగిందో చెప్పండి!
పోలీసులు మొదటి భార్య కమలి, ఆమె కుమారులు, రెండో భార్య, ఆమె బంధువులను పోలీస్ స్టేసన్ కు తీసుకెళ్లి విచారణ చేసి వివరాలు సేకరించారు. పెళ్లి కొడుకు మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మొత్తం మీద మొదటి భార్య కమలి దెబ్బకు రెండో పెళ్లి చేసుకుంటున్న లేడీస్ టైలర్ రామచంద్రన్ కు గుండెపోటు వచ్చింది.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications