Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lockdown Love: ఇన్ స్ట్రాగామ్ అకౌంట్ బ్లాక్, ఆత్మహత్య, ప్రేమలేఖ సినిమా రిపిట్, ప్రేమించింది ?

చెన్నై/తిరుచ్చి: లాక్ డౌన్ సమయంలో ఎక్కువ సేపు సోషల్ మీడియాలో కాలం గడుపుతున్న యువకుడు ఆమె ముఖం చూడకుండానే ప్రేమలేఖ సినిమాలో లాగా ఓ యువతిని ప్రేమించాడు. నెల రోజుల నుంచి ఇన్ స్ట్రాగామ్ లో యువతి, యువకుడు టచ్ లో ఉన్నారు. మనం ప్రేమించుకుని పెళ్లి చేసుకుందామని యువతి, యువకుడు సోషల్ మీడియాలోనే డిసైడ్ అయ్యారు. అయితే ఒక్కసారిగా ఆ యువతి ఇన్ స్ట్రాగామ్ అకౌంట్ బ్లాక్ చెయ్యడంతో తల్లడిల్లిపోయిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. యువకుడిని ప్రేమించింది నిజంగా యువతేనా ? లేక మరెవరైనా ఉన్నారా ? అనే కోణంగా పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఏటీఎంలో నగదు డిపాజిట్

ఏటీఎంలో నగదు డిపాజిట్

తమిళనాడులోని సేలం జిల్లా హస్తంపట్టికి ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆనంద్ కుమార్ (23) అనే యువకుడు ఏటీఎం కేంద్రాల్లో నగదు డిపాజిట్ చేస్తున్న సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. దేశంలో కరోనా వైరస్ వ్యాధి వ్యాపిస్తున్న సమయంలోనే ఆనంద్ కుమార్ తిరుచ్చిలోని కాటూరు కైలాసనగర్ లోని గాంధీనగర్ వీధిలో నివాసం ఉంటున్న అతని మేనమామ సెంథిల్ కుమార్ ఇంటికి వెళ్లాడు.

లాక్ డౌన్ లవ్

లాక్ డౌన్ లవ్

మామ సెంథిల్ కుమార్ ఇంట్లో ఆనంద్ కుమార్ ఉన్న సమయంలోనే దేశం మొత్తం లాక్ డౌన్ అమలులోకి వచ్చింది. లాక్ డౌన్ అమలుకావడంతో ఊరికి వెళ్లలేకపోయిన ఆనంద్ కుమార్ మామ సెంథిల్ కుమార్ ఇంట్లోనే ఉంటున్నాడు. ఇదే సమయంలో ఇన్ స్ట్రాగామ్ లో పరిచయం అయిన ఓ యువతితో ఆనంద్ కుమార్ ప్రేమలో పడ్డాడు.

యువతి గ్రీన్ సిగ్నల్

యువతి గ్రీన్ సిగ్నల్

ఇన్ స్ట్రాగామ్ లో పరిచయం అయిన యువతితో నిత్యం ఆనంద్ కుమార్ సోషల్ మీడియాలో టచ్ లో ఉన్నాడు. నెల క్రితం తాను నిన్ను ప్రేమిస్తున్నానని ఆనంద్ కుమార్ యువతికి సమాచారం ఇచ్చాడు. తాను నిన్ను ప్రేమిస్తున్నానని, ఇద్దరూ పెళ్లి చేసుకుందామని ఆ యువతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ప్రేమలేఖ సినిమా స్టోరీ

ప్రేమలేఖ సినిమా స్టోరీ

అజిత్, దేవయాని జంటగా నటించిన సూపర్ హిట్ సినిమా ప్రేమలేఖలో హీరో, హీరోయిన్ ఒకరిని ఒకరు చూసుకోకుండా ప్రేమించుకుంటారు. క్రైమాక్స్ లో అజిత్, దేవయాని ఒకరిని ఒకరు చూసుకోవడం, ఇద్దరు కలవడంతో సినిమా పూర్తి అవుతోంది. ప్రేమలేఖ సినిమాలో లాగే ఆనంద్ కుమార్, ఆ యువతి ఇంత వరకు ఒకరిని ఒకరు చూసుకోకుండా ప్రేమించుకుంటున్నారు.

అకౌంట్ క్లోజ్, ఆత్మహత్య

అకౌంట్ క్లోజ్, ఆత్మహత్య

ఆదివారం సాయంత్రం వరకు ఆనంద్ కుమార్, యువతి సోషల్ మీడియాలో టచ్ లో ఉన్నారు. అదే రోజు రాత్రి తాను నిన్ను ప్రేమించడం లేదని, పెళ్లి చేసుకోవడం వీలుకాదని మెసేజ్ పంపించిన ఆ యువతి ఇన్ స్ట్రాగామ్ అకౌంట్ ను బ్లాక్ చేసింది. ప్రేమించిన యువతి ఇన్ స్ట్రాగామ్ అకౌంట్ ను బ్లాక్ చేసిందని కొన్ని రోజులు ఆవేదన చెందిన ఆనంద్ కుమార్ మామ సెంథిల్ కుమార్ ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ప్రేమించింది ఎవరు ?

ప్రేమించింది ఎవరు ?

ఇన్ స్ట్రాగామ్ లో, సోషల్ మీడియాలో ఆనంద్ కుమార్ తో టచ్ లో ఉండి అతన్ని ప్రేమించింది నిజంగా యువతేనా ? అనే అనుమానం మొదలైయ్యిందని పోలీసులు అంటున్నారు. ఆనంద్ కుమార్ మొబైల్ లోని సమాచారం మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని తిరుచ్చి పోలీసులు తెలిపారు. ఆనంద్ కుమార్ ను ప్రేమించింది యువతేనా ? లేక అమ్మాయి పేరుతో ఎవరైనా యువకుడు ప్రేమించినట్లు నటించాడా ? అనే కోణంగా పోలీసులు విచారణ చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+