Lockdown: ప్రభుత్వ ఆఫీస్ లో బ్లాక్ కలర్ బాబాయ్, పింక్ శ్యారీ అంటీ ఏం చేశారంటే ?, వీడియో వైరల్ !

చెన్నై/దిండుగల్: దేశం మొత్తం ఒకపక్క కరోనా వైరస్ తో, మరోపక్క లాక్ డౌన్ సమస్యలతో సతమతం అవుతున్నారు. లాక్ డౌన్ పుణ్యమా అంటూ ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయడంతో ఇంత కాలం ఉద్యోగులు వారివారి ఇళ్లకే పరిమితం అయ్యారు. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకోవడంతో ఉద్యోగులు ఆఫీసులకు వెలుతున్నారు. అయితే ప్రభుత్వ కార్యాలయంలో పని చేస్తున్న ఓ సీనియర్ అధికారి ఇంత కాలం తనతో రొమాన్స్ చేసిన మహిళా ఉద్యోగి దూరం అయ్యిందని తట్టుకోలేకపోయాడు. కార్యాలయాలు ప్రారంభం కావడం, తన ప్రియురాలికి బర్త్ డే రావడం అంత చకచకా జరిగిపోయాయి. అంతే స్వీట్ ఇవ్వడానికి క్యాబిన్ లోకి వచ్చిన మహిళా ఉద్యోగిని గట్టిగా పట్టుకున్న సీనియర్ అధికారి లిప్ లాక్ చేశాడు. లాక్ డౌన్ కారణంగా చాల రోజుల తరువాత చిక్కిన ప్రియురాలిని వదల్లేకపోయాడు. అయితే కాలం కాలసిరాకపోవడంతో ఓ వ్యక్తి ఆ రాసలీలల ఎపిసోడ్ ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యింది. అంతే దెబ్బకు బ్లాక్ కలర్ బాబాయ్, పింక్ శ్యారీ ఆంటీ కథ దేశం మొత్తం తెలిసిపోయింది.

లాక్ డౌన్ తో ఇళ్లల్లో మకాం

లాక్ డౌన్ తో ఇళ్లల్లో మకాం

కరోనా వైరస్ అరికట్టడంలో భాగంగా దేశం మొత్తం లాక్ డౌన్ విధించడంతో ఎక్కడి కార్యకలాపాలు అక్కడే నిలిచిపోయాయి. లాక్ డౌన్ అమలు కావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అనేక శాఖల కార్యకలాపాలు తాత్కాలికంగా మూతపడ్డాయి. ఇదే సమయంలో ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేస్తున్న చాలా మంది ఉద్యోగులు ఇన్ని రోజులు వారివారి ఇళ్లకే పరిమితం అయ్యారు.

పాపం... బెంగతో బ్లాక్ బాబాయ్ !

పాపం... బెంగతో బ్లాక్ బాబాయ్ !

తమిళనాడులోని దిండుగల్ జిల్లాలోని వేదాసందరూలో ప్రభుత్వ కార్యాలయం ఉంది. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా వేదాసందూరు ప్రభుత్వ కార్యాలయంలో కార్యకలాపాలు మొదలైనాయి. ఈ కార్యాలయంలో గోపీనాథ్ అనే ఆయన సీనియర్ అధికారిగా ఉద్యోగం చేస్తున్నాడు. ఇన్ని రోజులు ఆఫీసు లేకపోవడంతో బాబాయ్ గోపీనాథ్ అదే ఆఫీస్ లో సని చేస్తున్న ప్రియురాలి మీద బెంగతో ఇంట్లోనే కాలం గడిపాడు.

ప్రియురాలి బర్త్ డే, స్వీట్ బాక్స్ రెఢీ

ప్రియురాలి బర్త్ డే, స్వీట్ బాక్స్ రెఢీ

ప్రభుత్వ కార్యాలయంలోని క్యాబిన్ లో గోపీనాథ్ కుర్చుని ఉన్నాడు. ఆ సమయంలో అదే కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్న మహిళ కొత్త పింక్ కలర్ శ్యారీ కట్టుకుని వెళ్లి అక్కడ పని చేస్తున్న సాటి ఉద్యోగులు అందరికీ స్వీట్లు ఇచ్చింది. ఈ రోజు తన బర్త్ డే అని ఆమె అందరికీ చెప్పింది. తరువాత మహిళా ఉద్యోగి చిన్నగా సీనియర్ అధికారి గోపీనాథ్ క్యాబిన్ లోకి వెళ్లింది.

బ్లాక్ కలర్ బాబాయ్, పింక్ శ్యారీ ఆంటీ లిప్ లాక్

బ్లాక్ కలర్ బాబాయ్, పింక్ శ్యారీ ఆంటీ లిప్ లాక్

గోపీనాథ్ క్యాబిన్ లోకి వెళ్లిన మహిళా ఉద్యోగి ఆయనకు స్వీట్లు ఇచ్చింది. తరువాత అదే సమయంలో ఆ కార్యాలయంలో పని చేస్తున్న మరో మహిళా ఉద్యోగి గోపీనాథ్ క్యాబిన్ లోకి వెళ్లారు. ఆమె వెళ్లిన పని పూర్తి చేసుకుని బయటకు వెళ్లిపోయింది. బర్త్ డే చేసుకుంటున్న పింక్ శ్యారీ ఆంటీ మాత్రం అక్కడే ఉంది. తరువాత మరో స్వీట్ తీసుకెళ్లిన ఆమె గోపీనాథ్ నోట్లో పెట్టింది. అంతే ఇన్ని రోజులు దూరం అయిన ప్రియురాలిని అతి దగ్గరగా చూసే సరికి తట్టుకోలేని గోపీనాథ్ అది ప్రభుత్వ కార్యాలయం అని కూడా మరిచిపోయి ఆమె పెదవులు గట్టిగా పట్టుకుని హీరోలాగా లిప్ లాక్ చేశాడు.

కాలం కలిసిరాక వీడియో వైరల్

కాలం కలిసిరాక వీడియో వైరల్

రెండు నిమిషాల పాటు గోపీనాథ్ ప్రభుత్వ కార్యాలయంలో సాటి మహిళా ఉద్యోగితో చిన్నపాటి రొమాన్స్ చేశాడు. తరువాత ఆమె నేరుగా అక్కడి నుంచి వెళ్లి ఆమె సీట్లో కుర్చుంది. ఇంత వరకు కథ సాఫీగానే సాగిపోయింది. తరువాత బ్లాక్ కలర్ బాబాయ్, పింక్ శ్యారీ ఆంటీ రొమాన్స్, లిప్ లాక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రభుత్వ కార్యాలయం పేరు, గోపీనాథ్ పేరుతో సహ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రచ్చరచ్చ అయ్యింది. గోపీనాథ్ క్యాబిన్ లోకి ఆ మహిళా ఉద్యోగి వెళ్లినప్పటి నుంచి ఆమె బయటకు వచ్చే వరకు అక్కడ ఏమేమి జరిగింది ? అనే విషయం ఆ వీడియోలో పూర్తిగా క్లారిటీలో ఉండటంతో వివాదం పెద్దది అయ్యింది.

Recommended Video

    Rajinikanth Warns AIADMK On Reopening Liquor Shops | Oneindia Telugu
    వీడియో తీసింది ఎవరు ?

    వీడియో తీసింది ఎవరు ?

    అసలే తమిళనాడు మంత్రి దిండుగల్ శ్రీనివాస్ కు కొంచెం తిక్కెక్కువ అనే పేరుంది. ఈ విషయం తెలుసుకున్న మంత్రిగారు ప్రభుత్వ కార్యాలయంలో రొమాన్స్ చేస్తున్న గోపీనాథ్ వ్యవహారంపై మండిపడుతున్నారని తెలిసింది. అయితే ప్రభుత్వ కార్యాలయంలో అంత దైర్యంగా ఆ రొమాన్స్ ఎపిసోడ్ వీడియో తీసింది ఎవరు ?, ఎందుకు సోషల్ మీడియాలో పెట్టారు ? అనే విషయం అర్థకాలేదని అక్కడి ఉద్యోగులు అంటున్నారు. మొత్తం మీద గోపీనాథ్ ,మహిళా ఉద్యోగి రాసలీలలు ఇంత కాలం గుట్టుగా సాగినా ఆమె బర్త్ డే పుణ్యమా అంటూ దేశం మొత్తం తెలిసిపోయింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+