Lockdown: పిన్నితో అక్రమ సంబంధం, లాక్ డౌన్ తో బెడ్ రూంలో అత్తకు చిక్కారు, అడ్డంగా నరికేశాడు!

చెన్నై: కామంతో కళ్లు మూసుకుపోయి అక్రమ సంబంధం సాగిస్తున్న కుటుంబ సభ్యులను మందలించిన వివాహిత మహిళ దారుణ హత్యకు గురైయ్యింది. వరుసకు పిన్ని (చిన్నమ్మ) అయ్యే మహిళతో ఏమిటి నీ రాసలీలలు అంటూ హెచ్చరించిన అత్తను ఆమె అల్లుడు చంపేశాడు. అత్తను కొడవలితో నరుకుతున్న సమయంలో అడ్డు వెళ్లిన మామను హత్య చెయ్యడానికి అల్లుడు బరితెగించాడు. వావివరుసల మరిచిపోయి లాక్ డౌన్ సమయంలో ఇంట్లోనే రాసలీలలు సాగించిన వారిని హెచ్చరించిన పాపానికి వివాహిత మహిళ హత్యకు గురి కావడంతో ఆమె పిల్లలు తల్లిలేని బిడ్డలు అయ్యారు.

చెన్నైలో అత్త ఫ్యామిలీ

చెన్నైలో అత్త ఫ్యామిలీ

చెన్నైలోని పుళల్ వినాయకపురంలోని పరిమళనగర్ లో శరవణన్, గుణసుందరి (37) దంపతులు నివాసం ఉంటున్నారు. శరవణన్, గుణసుందరి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. శరవణన్, గుణసుందరి దంపతుల బంధువులు వారు నివాసం ఉంటున్న పరిసర ప్రాంతాల్లో చాలా మంది నివాసం ఉంటున్నారు.

అల్లుడి భార్య విడాకులు

అల్లుడి భార్య విడాకులు

గుణసుందరి తమ్ముడు లోకు ఆరు నెలల క్రితం మరణించాడు. సోదరుడు లోకు మరణించడంతో అతని భార్య గుణసుందరి ఇంటిలో ఉంటున్నది. గుణసుందరి సొంత అన్న కుమారుడు గణేశన్ (26) అదే వీధి చివరిలో నివాసం ఉంటున్నాడు. కొన్ని నెలల క్రితం గణేశన్ భార్య అతనికి విడాకులు ఇచ్చి ఆమె పెట్టింటికి వెళ్లిపోయింది.

పిన్నితో అక్రమ సంబంధం

పిన్నితో అక్రమ సంబంధం

భర్త లోకు చనిపోవడంతో అతని భార్య ఒంటరిగా ఉంటున్నది. గణేశన్ భార్య విడాకులు ఇచ్చి ఆమె పుట్టింటికి వెళ్లిపోవడంతో అతను ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. గణేశన్, లోకు భార్య దగ్గర బంధువులు కావడంతో ప్రతిరోజు మాట్లాడుకునేవారు. వరుసకు లోకు భార్య గణేశన్ కు చిన్నమ్మ (పిన్ని) అవుతుంది. అయితే వావి వరుసలు మరిచిపోయిన గణేశన్, లోకు భార్య అక్రమ సంబంధం పెట్టుకున్నారు.

ఐదు నెలల నుంచి జల్సాలు

ఐదు నెలల నుంచి జల్సాలు

లోకు చనిపోయి ఆరు నెలలు అవుతోంది. భర్త లోకు చనిపోయి నెల రోజులు కాకముందే అతని భార్య వరుసకు కొడుకు అయ్యే గణేశన్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఐదు నెలల నుంచి ఇద్దరు పనిమీద బయటకు వెలుతున్నామని గుణసుందరి, ఆమె భర్త శరవణను నమ్మించి బయటకు వెళ్లి జల్సాలు చేస్తున్నారు. ఎవ్వరికీ ఏ అనుమానం రాకుండా ఐదు నెలల నుంచి ఎంజాయ్ చేశారు. అయితే లాక్ డౌన్ అమలులోకి రావడంతో వీరు బయట ఎక్కువగా తిరగడానికి అవకాశం లేకుండా పోయింది.

బెడ్ రూంలో రెడ్ హ్యాడెండ్ గా !

బెడ్ రూంలో రెడ్ హ్యాడెండ్ గా !

ఇటీవల గుణసుందరి, ఆమె భర్త శరవణన్, పిల్లలు పక్క వీధిలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లారు. ఇంట్లో ఎవ్వరు లేరని, మనం ఏం చేసినా అడ్డు ఉండదని భావించిన గణేశన్, లోకు భార్య బెడ్ రూంలో రాసలీలలు మొదలుపెట్టారు. భర్త శరవణన్, పిల్లలు బంధువుల ఇంట్లో ఉన్న సమయంలోనే ఏదో వస్తువు తీసుకెళ్లడానికి గుణసుందరి ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో బెడ్ రూంలో గణేశన్, లోకు భార్య నగ్నంగా ఎంజాయ్ చేస్తున్న విషయం గుర్తించి షాక్ కు గురైయ్యింది. ఇంట్లోకి ఎవరు వస్తున్నారో అనే విషయం కూడా తెలీకుండా మైమరిచిపోయి ఎంజాయ్ చేస్తున్న గణేశన్, లోకు భార్యను చూసిన గుణసుందరి మండిపడింది.

అల్లుడికి వార్నింగ్ ఇచ్చిన అత్త

అల్లుడికి వార్నింగ్ ఇచ్చిన అత్త

గణేశన్ సొంత అన్న కొడుకు కావడం, సొంత తమ్ముడు లోకు భార్య అక్రమ సంబంధం సాగిస్తున్న విషయం తెలుసుకున్న గుణసుందరి అవేశంతో రగిలిపోయింది. వావివరుసలు మరిచిపోయి మీరు చేస్తున్న పని ఏమిటి, మర్యాదగా ఇంతటితో మీ అక్రమ సంబంధం వదిలేయాలని, లేదంటే అందరికి చెప్పవలసి వస్తుందని గుణసుందరి అన్న కొడుకు గణేశన్, తమ్ముడు లోకు భార్యను హెచ్చరించింది. అయితే వారు మాత్రం గుణసుందరి మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా రహస్యంగా కలుసుకోవడం మొదలుపెట్టారు.

Recommended Video

    Coronavirus Tension In Hyderabad SBI Bank, 11 Employees Sent To Quarantine
     అత్తను అడ్డంగా నరికేశాడు

    అత్తను అడ్డంగా నరికేశాడు

    శుక్రవారం మరోసారి అన్న కొడుకు గణేశన్ ఇంటిలోని బెడ్ రూంలో తమ్ముడు లోకు భార్య రెడ్ హ్యాడెండ్ గా గుణసుందరికి చిక్కిపోయారు. ఆ సమయంలో అందరికి విషయం చెబుతానని, మీరు మామూలుగా చెబితే మాట వినరని గుణసుందరి గట్టిగా కేకలు వేసింది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న కొడవలి తీసుకున్న గణేశన్ అత్త గుణసుందరి మీద ఇష్టం వచ్చినట్లు దాడి చేశాడు. భార్య కోసం వెళ్లిన శరవణన్ మీద అల్లుడు గణేశన్ కొడవలితో దాడి చెయ్యడానికి ప్రయత్నించడంతో అతను తప్పించుకుని పారిపోయాడు. అల్లుడు గణేశన్ దాడిలో తీవ్రగాయాలైన గుణసుందరి ఆసుపత్రిలో చికిత్స విఫలమై మరణించింది. అత్తను హత్య చేసి వేలూరు జిల్లాలోని పెరనంపట్టు సమీపంలోని కొండమల్లిలో గ్రామం (ఆంధ్రా సరిహద్దు) తలదాచుకున్న గణేశన్ ను సోమవారం పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+