Lockdown: ఎస్ఐ కూతురి పెళ్లి, ఒక్క వీడియోతో పెళ్లి ఢమాల్, స్నానానికి బాత్ రూం, అత్తారింటికి దారేది..
అహమ్మదాబాద్: పెళ్లి కొడుకు ఇంట్లో సరైన సౌకర్యాలు లేవని, కనీసం స్నానం చెయ్యడానికి బాత్ రూం లేదని, అలాంటి ఇంట్లో తనకు వివాహం చేసి తన జీవితంతో చెలగాటం ఆడటానికి ప్రయత్నిస్తున్నారని ఓ ఎస్ఐ కూతురు ఎదురుతిరిగింది. పెళ్లి కుమార్తె తనకు పెళ్లి ఇష్టం లేదని, ఎవరైనా తనను కాపాడి ఈ ఒక్కసారికి సహాయం చెయ్యండి అంటూ ఓ వీడియో విడుదల చెయ్యడంతో ఆమె కుటుంబ సభ్యులు హడలిపోయారు. పెళ్లి కుమార్తె వీడియో దెబ్బకు 10 రోజుల్లో జరగవలసిన పెళ్లి పెటాకులై ఢమాల్ అయ్యింది. అత్తారింటికి దారేది అంటే ఇదే అంటున్నది పెళ్లి కూతురు.

సైన్స్ లో పీజీ
రాజస్థాన్ లోని జైపూర్ కు చెందిన రీనా సింగ్ (22) అనే యువతి సైన్స్ విభాగంలో పీజీ పూర్తి చేసింది. ఉన్నత చదువులు చదువుకున్న రీనా సింగ్ మంచి ఉద్యోగం చేసుకుని జీవితంలో స్థిరపడాలని నిర్ణయించింది. అయితే కొన్ని నెలల నుంచి రీనా సింగ్ కు ఆమె కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. బంధువులు, తెలిసిన వారితో రీనా సింగ్ పెళ్లి చర్చలు జరుగాయి.

ఎస్ఐ ఆవేశం
రీనా సింగ్ తండ్రి సబ్ ఇన్స్ పెక్టర్ గా (ఎస్ఐ)గా ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల రీనా సింగ్ తల్లిదండ్రులు ఓ అబ్బాయితో ఆమె వివాహం నిశ్చయం చేశారు. జూలై 1వ తేదీని రీనా సింగ్ వివాహం నిశ్చయం చేసిన ఆమె తల్లిదండ్రులు లాక్ డౌన్ లోనే అందరికీ పెళ్లి పత్రికలు పంచుతున్నారు. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని రీనా సింగ్ ఇప్పటి వరకు చాలాసార్లు ఆమె తల్లిదండ్రులకు చెప్పింది. అయితే రీనా సింగ్ మాటలను ఆమె కుటుంబ సభ్యులు పెడచెవిన పెట్టారు.

సమయం లేదు, కాపాడండి
తాను పెళ్లి చేసుకుంటున్న అత్తారింటిలో స్నానం చెయ్యడానికి బాత్ రూం లేదని, ఇంట్లో కనీస సౌకర్యాలు లేవని, ఏదో ప్రాణం పోయినట్లు తన కుటుంబ సభ్యులు బలవంతంగా అదే ఇంట్లో తనకు పెళ్లి చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని, జులై 1వ తేదీన పెళ్లి జరుగుతోందని, తనకు ఎవరైనా సహాయం చేసి వెంటనే పెళ్లి అపేయాలని రీనా సింగ్ విషాదంగా మాట్లాడుతూ ఓ వీడియో విడుదల చేసింది.

అయ్యో.... ఎంత కష్టం వచ్చింది, ఢమాల్ !
తనకు పెళ్లి ఇష్టం లేదని రీనా సింగ్ చెబుతూ విడుదల చేసిన వీడియో వైరల్ అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. పెళ్లి కుమార్తె రీనా సింగ్ తండ్రి ఎస్ఐ అని తెలుసుకున్న పోలీసులు షాక్ కు గురైనారు. రీనా సింగ్ మేజర్ అని, ఆమెకు ఇష్టం లేని పెళ్లి చెయ్యడం చట్టప్రకారం నేరం అవుతోందని పోలీసు అధికారులు ఆమె కుటుంబ సభ్యులకు వార్నింగ్ ఇచ్చారు.

పెళ్లి కథ కంచికి !
జులై 1వ తేదీ జరగవలసిన రీనా సింగ్ వివాహం రద్దు అయ్యింది. ఇదే సమయంలో పెళ్లి కుమారుడి ఇంట్లో బాత్ రూం కట్టేపనిలో అతని కుటుంబ సభ్యులు నిమగ్నం అయ్యారు. అయితే తనకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదని, మంచి ఉద్యోగం వచ్చిన తరువాత పెళ్లి చేసుకుంటానని, ఈ పెళ్లి ఆగిపోవడానికి సహకరించిన ప్రతి ఒక్కరిని రుణపడి ఉంటానని పెళ్లి కుమార్తె రీనా సింగ్ చెప్పింది.
మొత్తం మీద పెళ్లి కుమార్తె రీనా సింగ్ దెబ్బకు పెళ్లి కొడుకు ఇంట్లో కొత్తగా బాత్ రూం రెఢీ అవుతోందని పలువురు నెటిజన్లు జోకులు వేస్తున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications