Lockdown: ఆఫ్ట్రాల్ బిర్యానీ తీసివ్వలేవా ? నువ్వు మొగుడేనా ? భార్య ఆత్మహత్య, భర్త బైక్ లోని పెట్రోల్

బెంగళూరు: వివాహం జరిగిన తరువాత దంపతులు చాలా సంతోషంగా ఉన్నారు. కుమారుడు, కుమార్తెతో కలిసి ఆ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. అయితే భార్యకు బిర్యానీ తినే పిచ్చి ఉంది. ఎప్పుడు పడితే అప్పుడు తనకు బిర్యానీ తినాలని ఉందని భర్తకు చెప్పి బయట హోటల్ నుంచి తెప్పించుకుని తినేది. అయితే తనకు వెంటనే బిర్యానీ తినాలని ఉందని భర్తకు భార్య చెప్పింది. ఇప్పడు కాదని తరువాత నీకు బిర్యానీ తెచ్చిస్తానని భర్త బయటకు వెళ్లాడు. అంతే నేను అడిగేతితే ఆఫ్ట్రాల్ బిర్యానీ తెచ్చివ్వలేవా ?, నువ్వు మొగుడేనా ? అంటూ ఆవేశంతో ఊగిపోయిన భార్య నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది.

 హ్యాపీ ఫ్యామిలీ

హ్యాపీ ఫ్యామిలీ

తమిళణాడులోని చెన్నై సమీపంలోని చెంగప్పట్టు జిల్లాలోని మహాబలిపురం సమీపంలోని పూంజేరీలో మనోహరన్, శరణ్య దంపతులు నివాసం ఉంటున్నారు. మనోహరన్, శరణ్య దంపతులకు 11 ఏళ్ల కుమారుడు, 9 ఏళ్ల కుమార్తె ఉన్నారు. 13 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్న మనోహరన్, శరణ్య దంపతులు ఇద్దరు పిల్లలతో కలిసి ఉన్నకాటికి తింటూ చాలా హ్యాపీగా జీవనం సాగిస్తున్నారు.

 భార్యకు బిర్యానీ పిచ్చి

భార్యకు బిర్యానీ పిచ్చి

వివాహం అయిన తరువాత మనోహరన్ భార్య శరణ్యకు బయట హోటల్ నుంచి రుచికరమైన బిర్యానీ తెచ్చివ్వడం మొదలు పెట్టాడు, ఇంట్లో చేసిన బిర్యానీ కంటే బయట హోటల్ నుంచి తీసుకువెళ్లే బిర్యానీని శరణ్య ఎంతో ఇష్టంగా తింటున్నది. ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత కూడా మనోహరన్ భార్య శరణ్యతో పాటు తన ఇద్దరు పిల్లలకు అప్పుడప్పుడు బయటనుంచి బిర్యానీలు ఇంటికి పార్శిల్ తీసుకుని వెళ్లేవాడు.

 లాక్ డౌన్ ఇబ్బందులు

లాక్ డౌన్ ఇబ్బందులు

మనోహరన్ మహాబలిపురంలో శిల్పాలు తయారు చేసే పని చేస్తున్నాడు. కరోనా వైరస్ దెబ్బతో లాక్ డౌన్ విధించడంతో బయట నిర్మాణంలో ఉన్న దేవాలయాలు పనులు పూర్తిగా నిలిచిపోయాయి. శిల్పిగా పని చేస్తున్న మనోహరన్ కు లాక్ డౌన్ దెబ్బతో ఆర్థిక సమస్యలు ఎదురైనాయి. ఇంతకు ముందు చేసిన పనుల్లో వచ్చిన ఆధాయంలో దాచుకున్న సొమ్ముతో మనోహరన్ సంసారం నెట్టుకుని వస్తున్నాడు.

 ఏమండి..... బిర్యానీ కావాలి !

ఏమండి..... బిర్యానీ కావాలి !

లాక్ డౌన్ దెబ్బతో గురువారం సాయంత్రం మనోహరన్ ఇంట్లోనే ఉన్నాడు. ఆ సమయంలో మనోహరన్ భార్య శరణ్య చిన్నగా భర్త దగ్గరకు వెళ్లింది. తనకు బిర్యానీ తినాలని ఉందని, తనతో పాటు ఇద్దరు పిల్లలకు బిర్యానీలు తీసుకుని రావాలని శరణ్య భర్త మనోహరన్ కు చెప్పింది. ఇప్పుడు డబ్బులు చాలా తక్కువగా ఉన్నాయని, మూడు బిర్యానీలు తీసుకురావాలంటే రూ. 600కు పైగా ఖర్చు అవుతోందని, డబ్బులు వచ్చిన తరువాత బిర్యానీలు తీసుకువస్తానని మనోహరన్ భార్య శరణ్యకు చెప్పాడు.

 ఆఫ్ట్రాల్ బిర్యానీ తెచ్చివ్వలేవా ?

ఆఫ్ట్రాల్ బిర్యానీ తెచ్చివ్వలేవా ?

తాను ఏమైనా మనులు, మాణిక్యాలు అడిగానా, ఆఫ్ట్రాల్ బిర్యానీ అడిగితే తెచ్చివ్వలేవా ? అంటూ శరణ్య భర్త మనోహరన్ తో గొడవ పెట్టుకుంది. ఇంట్లో ఉంటే బిర్యానీ రామాయణం ఎక్కువ అవుతోందని, తన భార్య శరణ్య సామాన్యంగా ఈ విషయం వదిలిపెట్టదని గ్రహించిన భర్త మనోహరన్ ఇంటి నుంచి బయటకు నడుచుకుంటూ వెళ్లిపోయాడు.

Recommended Video

    Bigg Boss 4 Telugu : మనసు మార్చుకున్న నాగార్జున.. బిగ్ బాస్ 4 హోస్ట్ గా స్టార్ హీరోయిన్!
     భర్త బైక్ లోని పెట్రోల్ తో ఆత్మహత్య

    భర్త బైక్ లోని పెట్రోల్ తో ఆత్మహత్య

    మనోహరన్ కోపంగా ఇంటి నుంచి వెళ్లి పోవడంతో శరణ్య రగిలిపోయింది. ఇంటి ముందు భర్త మనోహరన్ పార్క్ చేసిన బైక్ లోని పెట్రోల్ ఓ క్యాన్ కు పట్టుకున్న శరణ్య శరీరం మీద పోసుకుని నిప్పంటించుంది. విషయం గుర్తించిన స్థానికులు శరణ్య శరీరం మీద మంటలు ఆర్పి వెంటనే మనోహరన్ కు సమాచారం ఇచ్చారు. మనోహరన్, స్థానికులు కలిసి శరణ్యను మహాబలిపురంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స విఫలమై శరణ్య మరణించిందని పోలీసులు తెలిపారు. బిర్యానీ కోసం భార్య ప్రాణాలు తీసుకోవడంతో మనోహరన్ తో పాటు ఆయన ఇద్దరు పిల్లలు ఆర్తనాదాలు చేస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+