Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎన్నికలపై లేటెస్ట్ సర్వే: బీజేపీతో పొత్తు ఉన్నా గ్రౌండ్ రియాలిటీ వేరు: కూటమికి అక్కడ బిగ్ షాక్ తప్పదు

Lok Poll pre poll survey 2024: దేశంలో సార్వత్రిక ఎన్నికల వాతావరణం నెలకొంది. అన్ని రాష్ట్రాల్లోనూ ప్రచార వేడి పతాక స్థాయికి చేరుకుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ- ఎన్డీఏ, ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. గెలిచి తీరాలనే పట్టుదలను ప్రదర్శిస్తోన్నాయి. దీనికోసం అవసరమైన వ్యూహాలను రూపొందించుకున్నాయి.

మొత్తం ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నెల 19వ తేదీన తొలి విడత పోలింగ్ షెడ్యూల్ అయింది. దీనికి అవసరమైన నామినేషన్ల ప్రక్రియ సైతం పూర్తయింది. 13 రాష్ట్రాల్లో 89 లోక్‌సభ నియోజకవర్గాల్లో తొలి విడత పోలింగ్ జరుగుతుంది. జూన్ 1వ తేదీ నాటితో ఏడు దశలో పోలింగ్ ముగుస్తుంది. అదే నెల 4వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది.

Lok Poll survey on Lok Sabha 2024 Congress will get leade in Karnataka and UDF storm in Kerala

తొలి మూడు దశల్లో దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళల్లో గల లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ పూర్తవుతుంది. ఈ నెల 19వ తేదీన తొలి విడతలోనే తమిళనాడులో ఓటింగ్ ఉంటుంది. రెండో విడత పోలింగ్ ఈ నెల 26వ తేదీన షెడ్యూల్ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.

కేరళలోని 20 లోక్‌సభ స్థానాలకు ఈ నెల 26వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ఇక్కడ కాంగ్రెస్ సారథ్యంలోని ప్రతిపక్ష యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ అత్యధిక స్థానాలను గెలుచుకుంటుందని లోక్ పోల్ సంస్థ అంచనా వేసింది. యూడీఎఫ్‌కు 18 నుంచి 20 స్థానాలు దక్కుతాయని తెలిపింది. వామపక్షాలు నాయకత్వాన్ని వహిస్తోన్న ఎల్డీఎఫ్‌ రెండు స్థానాలకే పరిమితం కావొచ్చు. లేదా అసలు ఖాతానే తెరవకపోవచ్చు కూడా.

కర్ణాటకలో 28 లోక్‌సభ నియోజకవర్గాలకు రెండు విడతల్లో పోలింగ్ ఉంటుంది. 14 స్థానాలకు చొప్పున ఈ నెల 26, మే 6వ తేదీల్లో పోలింగ్ నిర్వహిస్తారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ అత్యధిక స్థానాలను గెలుచుకునే అవకాశాలు ఉన్నట్లు లోక్‌ పోల్ తెలిపింది. లోక్ పోల్ సర్వే ప్రకారం.. కాంగ్రెస్ 15 నుంచి 17 స్థానాలను గెలచుకుంటుంది. 11 నుంచి 13 సీట్లల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి.

నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ప్రధాని అభ్యర్థి, సంక్షేమ పథకాల అమలు తీరు, కన్నడ స్వాభిమానం.. అనే అయిదు అంశాలను ప్రాతిపదికగా తీసుకుని ఈ సర్వే చేపట్టింది లోక్‌ పోల్ సంస్థ. అత్యంత బలమైన వొక్కలిక సామాజిక వర్గం ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపు మళ్లిందని అంచనా వేసింది. సిట్టింగ్ ఎంపీలు మైసూరులో ప్రతాప సింహ, బెంగళూరు నార్త్‌లో సదానంద గౌడకు టికెట్ ఇవ్వకపోవడం మైనస్ పాయింట్.

బీజేపీ- జనతాదళ్ (సెక్యులర్) మధ్య పొత్తు ఉన్నప్పటికీ- క్షేత్ర స్థాయిలో అది ఏ మాత్రం ప్రభావం చూపట్లేదు. చిక్‌బళ్లాపుర, కోలార్, మైసూరు, చిత్రదుర్గ, చామరాజనగర, రాయచూర్ నియోజకవర్గాల పరిధిలో ఈ రెండు పార్టీల మధ్య ఏ మాత్రం సమన్వయం ఉండట్లేదు. అదే సమయంలో అక్కడ కాంగ్రెస్ బలంగా ఉండటం కూటమికి దెబ్బ కొడుతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+