LS polls: నేడే 49 స్థానాలకు పోలింగ్, రాహుల్, స్మృతీ సహా బరిలో కీలక నేతలు

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ఐదో విడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. సోమవారం ఉదయం 7 గంటలకు 6 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభం కానుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఐదో విడతలో ఉత్తర్​‌ప్రదేశ్‌లో 14 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది.

మహారాష్ట్రలో 13, బీహార్‌లో 5, జమ్మూకాశ్మీర్‌, లఢఖ్‌లో చెరొకటి, జార్ఖండ్‌ 3, ఒడిశా 5, పశ్చిమబెంగాల్ 7 లోక్‌సభ స్థానాల్లో ఓటింగ్‌ జరగనుంది. ఈ నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న 695మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. కాగా, ఐదో విడతలో పలువురు కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు పోటీ పడుతున్నారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కేంద్రమంత్రులు, బీజేపీ అగ్రనాయకులు రాజ్‌​నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, రాజీవ్ ప్రతాప్ రూడీ, పీయూష్‌ గోయల్, ఎల్జేపీ అధినేత చిరాగ్ పాశ్వాన్ సహా పలువురు అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రాహుల్‌ గాంధీ ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు కంచుకోటగా భావించే రాయ్‌బరేలీలో పోటీ చేస్తున్నారు.

Lok Sabha election 2024 Phase 5 polling for 49 seats On May 20 top leaders in contest

1999 నుంచి రాయ్‌బరేలీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధిస్తూ వచ్చారు. 2004 నుంచి 2024 వరకూ రాయ్‌బరేలీ నుంచి ప్రాతినిథ్యం వహించిన సోనియాగాంధీ.. ఈసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఫలితంగా ఆ స్థానంలో ఆమె కుమారుడు రాహుల్ పోటీకి దిగారు. వయనాడ్‌ సిట్టింగ్ ఎంపీ అయిన రాహుల్‌ అక్కడ్నుంచి కూడా బరిలో ఉన్నారు.

బీజేపీ సీనియర్‌ నేత, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ లక్నో నుంచి మూడోసారి పోటీ చేస్తున్నారు. ఆయన వరుసగా 2014, 2019 ఎన్నికల్లో విజయభేరి మోగించారు. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన రవిదాస్ మెహ్‌రోత్రా రాజ్‌నాథ్‌తో తలపడుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ మరో కంచుకోట అయిన అమేథీని 2019 ఎన్నికల్లో బద్ధలుకొట్టిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ.. రెండోసారి అక్కడి నుంచి పోటీలో చేస్తున్నారు. అయితే, ఈసారి గాంధీ కుటుంబానికి సన్నిహితునిగా ముద్రపడిన కిషోరీలాల్‌ శర్మ కాంగ్రెస్‌ తరఫున అమేథీలో పోటీ చేస్తున్నారు. ఈ స్థానంలో బీఎస్పీ నుంచి నన్హే సింగ్ చౌహాన్ బరిలో ఉన్నారు.

కాగా, సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ఇప్పటివరకు 379 లోక్‌సభ స్థానాల్లో పూర్తయింది. ఐదో విడతలో 49 నియోజకవర్గాలకు సోమవారం పోలింగ్ జరగనుంది. ఆరో విడత మే 25న, ఏడో విడత పోలింగ్‌ జూన్ 1న జరగనుండగా.. జూన్ 4న ఓట్ల లెక్కింపు, ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+