లోక్ సభ ఎన్నికల ఫలితాలు: సవాల్, జ్యోతిష్యులకు రూ. 10 బంపర్ ఆఫర్, 20 ప్రశ్నలు !

బెంగళూరు: లోక్ సభా ఎన్నికల ఫోలింగ్ లో ఎవరు విజయం సాధిస్తారు, అధికారంలోకి ఎవరు వస్తారు అంటూ దేశవ్యాప్తంగా చర్చ మొదలైయ్యింది. కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారు అంటూ దేశ ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ సందర్బంలో జ్యోతిష్యులు రాజకీయ నాయకుల భవిష్యత్తు గురించి చెబుతున్నారు. ఇదే సమయంలో జ్యోతిష్యులకు బంఫర్ ఆఫర్ ఇచ్చారు.

ఎన్నికల ఫలితాలు గురించి జ్యోస్యం చెబుతున్న జ్యోతిష్యులకు భారీ డిమాండ్ పెరిగిపోయింది. కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారు అంటూ కచ్చితమైన వివరాలు చెప్పిన జ్యోతిష్యులకు కర్ణాటకలోని మంగళూరుకు చెందిన ప్రముఖ ప్రోఫెసర్ నరేంద్ర నాయక్ బంపర్ ఆఫర్ ఇచ్చారు.

 Lok Sabha elections 2017: Prof Narendra Nayak open challenged to Astrologers for predict the result

కేంద్రంలో ఎవరు అధికారంలో వస్తారో అంటూ కచ్చితమైన వివరాలు చెప్పిన జ్యోతిష్యులకు రూ. 10 లక్షలు బహుమానం ఇస్తానని ప్రోఫెసర్ నరేంద్ర నాయక్ సవాల్ విసిరారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలకంటే ముందుగా జ్యోతిష్యులు రాజకీయ నాయకుల భవిష్యత్తు చెప్పాలని సూచించారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ? ఏ పార్టీకి ఎన్నిసీట్లు వస్తాయి ? అంటూ జ్యోతిష్యులకు పలు ప్రశ్నలు వేశారు.

ఫ్రోఫెసర్ నరేంద్ర నాయక్ గత 30 ఏళ్ల నుంచి జ్యోతిష్యులకు ఇలా సవాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఇంత వరకు ఒక్క జ్యోతిష్యుడు కూడా ఈ సవాల్ స్వీకరించలేదు. ప్రోఫెసర్ నరేంద్ర నాయక్ జ్యోతిష్యులకు 20 ప్రశ్నలు వేశారు. అందులో 18 ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పిన జ్యోతిష్యులకు రూ. 10 లక్షలు బహుమానం ఇస్తానని ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+