వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగు ఓటర్ల హవా: ఖార్గేకి మద్దతుగా ప్రియాంక గాంధీ, లేడీ సూపర్ స్టార్ ప్రచారం, మోడీకి పోటీగా!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: లోక్ సభలో ప్రధాన ప్రతిక్ష నాయకుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతను లోక్ సభ ఎన్నికల్లో ఎలాగైనా గెలిపించుకోవాలని ఆ పార్టీ హైకమాండ్ నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు దీటుగా తెలుగు మాట్లాడే ఓటర్లు అధికంగా ఉన్న కలబురగి లోక్ సభ నియోజక వర్గంలో ప్రియాంకా గాంధీ, సౌత్ ఇండియా లేడీ సూపర్ అని పేరు సంపాధించుకున్న విజయశాంతితో ప్రచారం చేయించాలని నిర్ణయించారు.

కలబురిగి లోక్ సభ నియోజక వర్గంలో సిట్టింగ్ ఎంపీ, లోక్ పభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మల్లిఖార్జున్ ఖార్గే పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి డాక్టర్ ఉమేష్ జాదవ్ పోటీ చేస్తున్నారు. మల్లిఖార్జున్ ఖార్గేకి ఎన్నడూ లేని విధంగా కలబరిగిలో డాక్టర్ ఉమేష్ జాదవ్ నుంచి గట్టి పోటీ ఎదురైయ్యింది.

గత లోక్ సభ, శాసన సభ ఎన్నికల సమయంలో కర్ణాటక-తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో సినీ తారలతో ప్రచారం చేయించారు. 2019 లోక్ సభ ఎన్నికల సందర్బంగా రెండు రాష్ట్రాల సరిహద్దులో ఇంత వరకు సినీ తారలు ప్రచారం చెయ్యలేదు.

Lok Sabha Elections 2019: Actress Vijayashanti campaigning for Mallikarjuna Kharge in Karnataka

కలబురిగి నియోజక వర్గంలో మల్లిఖార్జున్ ఖార్గేని గెలిపించుకోవాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయించింది. మల్లిఖార్జున్ ఖార్గే నియోజక వర్గంలో బీజేపీని గెలిపించుకోవాలనే లక్షంతో ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాలతో ప్రచారం చేయిస్తున్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటక పర్యటనకు వచ్చి వెళ్లే మరుసటి రోజు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కలబురిగిలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న విజయశాంతి ఏఫ్రిల్ 19వ తేదీ కలబురిగి లోక్ సభ నియోజక వర్గంలోని సేడం అసెంబ్లీ నియోజక వర్గం నుంచి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కలబురిగి లోక్ సభ నియోజక వర్గం రారాజు ఎవరు ? అనే విషయంపై జోరుగా చర్చ జరుగుతోంది.

English summary
Lok Sabha Elections 2019: Actress Vijayashanti campaigning for Mallikarjuna Kharge in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X