తెరపై సత్యకుమార్, పొంగులేటి: ఢిల్లీ స్థాయిలో బీజేపీ కొత్త గేమ్

Lok Sabha 2024: దేశంలో ఎన్నికల సందడి నెలకొంది. రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉంది. మార్చిలో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి. మే చివరి వారం నాటికి కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మంగా తీసుకుంటోన్నాయి అన్ని పార్టీలు. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ సారథ్యంలో ఎన్డీఏ.. ఈ సారి గద్దెనెక్కడానికి ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. దీనికి అనుగుణంగా వ్యూహ, ప్రతివ్యూహాలను రూపొందించుకుంటోన్నాయి.

Lok Sabha elections 2024: BJP appoints election in-charges for these States and UTs

ఈ ఎన్నికలను ఎదుర్కొనడానికి బీజేపీ రంగం సిద్ధం చేసింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఎన్నికల ఇన్‌ఛార్జీలు, సహ ఇన్‌ఛార్జీలను నియమించింది. గెలిచిన తీరాల్సిన రాష్ట్రాల బాధ్యతలను కీలక నాయకుల చేతుల్లో పెట్టింది. దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధిక స్థానాలను గెలుచుకోవడంపై దృష్టి పెట్టినట్టు కనిపించింది బీజేపీ.

ఏపీ, తెలంగాణకు చెందిన ఇద్దరు నాయకులకు ఈ జాబితాలో చోటు దక్కింది. ఏపీ బీజేపీ నేత వై సత్యకుమార్ అండమాన్ నికోబార్ ఇన్‌ఛార్జీగా నియమితులయ్యారు. తమిళనాడు, కర్ణాటక సహ ఇన్‌ఛార్జీగా పొంగులేటి సుధాకర్ రెడ్డి అపాయింట్ అయ్యారు.

అరుణాచల్ ప్రదేశ్- అశోక్ సింఘాల్, బిహార్- వినోద్ తావ్డే, దీపక్ ప్రకాష్, చండీగఢ్- విజయ్ భాయ్ రుపాణి, డయ్యూ డమన్- పూర్ణేష్ మోదీ, దుష్యంత్ పటేల్, గోవా- ఆశీష్ సూద్, హర్యానా- బిప్లవ్ కుమార్ దేవ్, హిమాచల్ ప్రదేశ్- శ్రీకాంత్ శర్మ, సంజయ్ టండన్, జమ్మూ కాశ్మీర్- తరుణ్ ఛుగ్, ఆశీష్ సూద్, జార్ఖండ్- లక్ష్మీకాంత్ బాజ్‌పేయి నియమితులయ్యారు.

Lok Sabha elections 2024: BJP appoints election in-charges for these States and UTs

కర్ణాటక- రాధా మోహన్ దాస్ అగ్రవాల్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, కేరళ- ప్రకాష్ జవదేకర్, లఢక్- తరుణ్ ఛుగ్, లక్షద్వీప్- అరవింద్ మీనన్, మధ్యప్రదేశ్- మహేంద్రసింగ్, సతీష్ ఉపాధ్యాయ్, ఒడిశా- విజయ్‌పాల్ సింగ్ తోమర్, లతా ఉసెండీ, పుదుచ్చేరి- నిర్మల్ కుమార్ సురానాను ఇన్‌ఛార్జీలు, కో ఇన్‌ఛార్జీలుగా నియమించింది.

పంజాబ్- విజయ్ భాయ్ రుపాణీ, నరిందర్ సింగ్, సిక్కిం- దిలీప్ జైస్వాల్, తమిళనాడు- అరవింద్ మీనన్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఉత్తరప్రదేశ్-బైజయంత్ పాండా, ఉత్తరాఖండ్- దుష్యంత్ కుమార్ గౌతమ్, పశ్చిమ బెంగాల్- మంగళ్ పాండే, అమిత్ మాలవీయ, ఆశా లకడ్ అపాయింట్ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+