మెట్రో రైల్ గుడ్ న్యూస్
Delhi Metro: దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. ఈ నెల 25వ తేదీన ఆరో విడత పోలింగ్ జరుగనుంది. ఇప్పటివరకు అయిదు విడతల్లో పోలింగ్ ముగిసింది. ఏపీ అసెంబ్లీ సహా మొత్తం 10 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటింగ్ ప్రక్రియ ఈ నెల 13వ తేదీన పూర్తయింది.
ఆరో విడత పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ దశలో ఎనిమిది రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో 58 లోక్‌సభ స్థానాలకు 26వ తేదీన పోలింగ్ జరుగనుంది. బిహార్- 8, ఢిల్లీ- 6, హర్యానా-10, బిహార్- 5, జమ్మూ కాశ్మీర్- 1, ఒడిశా- 6, ఉత్తరప్రదేశ్- 14, పశ్చిమ బెంగాల్- 8, జార్ఖండ్-4 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ షెడ్యూల్ అయిందా రోజున.

ఆరో విడత ఎన్నికల్లో పైచేయి సాధించడానికి అన్ని పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలను రూపొందించుకుంటోన్నాయి. ఎత్తులు పైఎత్తులు వేస్తోన్నాయి. ముమ్మరంగా ప్రచారాన్ని సాగిస్తోన్నాయి. ఇంకో రెండు రోజుల్లో ఎన్నికల ప్రచారానికి తెర పడనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, మల్లికార్జున ఖర్గే.. రోడ్ షోలతో హోరెత్తిస్తోన్నారు.
ఢిల్లీ- నేషనల్ కేపిటల్ రీజియన్ పరిధిలోని లోక్‌సభ స్థానాలకు ఈ నెల 25వ తేదీన ఎన్నికలు జరుగనున్నందున ఢిల్లీ మెట్రో రైల్వే కార్పొరేషన్ అధికారులు ఓటర్లకు గుడ్ న్యూస్ ఇచ్చారు. తెల్లవారు జామున 4 గంటలకే అన్ని లైన్లల్లో కూడా మెట్రో రైళ్లు అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు తెలిపారు.
సాధారణంగా ప్రతి రోజూ తెల్లవారు జామున 6 గంటలకు మెట్రో రైల్ సర్వీసులు ఆరంభమౌతాయి. ఓటింగ్‌ను దృష్టిలో ఉంచుకుని రెండు గంటలు ముందుగా అంటే 4 గంటలకే అన్ని మార్గాల్లో కూడా సర్వీసులను నడిపించనున్నట్లు చెప్పారు. ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులు, ఓటర్ల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. తెల్లవారు జామున 6 గంటల వరకు ప్రతి అరగంటకూ ఓ సర్వీస్ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications