దక్షిణాదిపై కన్నేసిన బీజేపీ: 2024 ఎన్నికల్లో నరేంద్ర మోడీ పోటీ చేసేది ఈ స్థానం నుంచే!

న్యూఢిల్లీ: దక్షిణ భారతదేశంపై భారతీయ జనతా పార్టీ ప్రత్యేక దృష్టి సారిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణాది రాష్ట్రాల నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీ కంచుకోట వారణాసి స్థానం నుంచి తప్పుకుని తమిళనాడు రాష్ట్రం నుంచి పోటీ చేయాలని ప్రధాని భావిస్తున్నట్లు సమాచారం.

తమిళనాడులో పార్టీ బలంగా ఉన్న కన్యాకుమారి లేదా కోయంబత్తూరు లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. వీటితోపాటు రామనాథపురం లోక్‌ సభ స్థానాన్ని కూడా మోడీ అభ్యర్థిత్వం కోసం పరిశీలించగా.. అక్కడ పార్టీ బలంగా లేకపోవడంతో వెనుకడుగు వేసినట్లు సమాచారం. ప్రస్తుతం కన్యాకుమారి నుంచి పొన్ రాధాకృష్ణన్, కోయంబత్తూరు నుంచి సీపీ రాధాకృష్ణన్ ఎంపీలుగా ఉన్నారు.

Lok Sabha polls 2024: BJP mulling fielding Modi from Kanyakumari or Coimbatore

2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ రెండు స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఈ రెండు సీట్లలో పార్టీ బూత్ స్థాయి నుంచి చాలా పటిష్టంగా ఉంది. దీంతో ఈ రెండు స్థానాల్లో ఏదో ఒక సీటు నుంచి మోడీని బరిలోకి దించితే విజయం ఖాయమని బీజేపీ భావిస్తోంది. ఈ రెండు స్థానాల్లో కూడా దాదాపు 80 శాతం బూత్ స్థాయి ప్రతినిధులతో బీజేపీ బలంగా ఉండటం గమనార్హం.

కాగా, జులై 9న హైదరాబాద్‌లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల సంస్థాగత కార్యదర్శులు, రాష్ట్రాల అధ్యక్షులు, సీనియర్ నాయకుల సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. ఈ క్రమంలో కొందరు నేతలు ముస్లిం వర్గం ప్రజలు అధికంగా ఉన్న రామనాథపురం స్థానం నుంచి 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని సూచించారు.

కానీ, చేపట్టిన సర్వేలో ఆ స్థానంలో బీజేపీ ఆశించిన స్థాయిలో బలంగా లేదని తేలింది. సరైన బూత్ స్థాయి, నియోజకవర్గ స్థాయి వ్యవస్థ లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురుకావచ్చని తెలిపింది. దీంతో ఈ ఆలోచనను విరమించుకున్టన్లు సమాచారం. ప్రస్తుతం రామనాథపురం నుంచి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) పార్టీకి చెందిన నవస్కాని ఎంపీగా ఉన్నారు.

Lok Sabha polls 2024: BJP mulling fielding Modi from Kanyakumari or Coimbatore

ప్రధాని మోడీ తమిళనాడులోని ఆ రెండు స్థానాల్లో ఏదో ఒక స్థానంలో పోటీ చేయాలనే ఆలోచనకు ఆర్‌ఎస్‌ఎస్ కూడా సుముఖంగా ఉందని బీజేపీ వర్గాలు తెలిపాయి. తమిళనాడులో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ నేతలు పలు కార్యక్రమాలతో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక,ప్రధాని మోడీ తమిళ భాష, తమిళ సంస్కృతిపై కూడా చురుగ్గా మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు దగ్గరవుతున్నారు. ఇటీవల కొత్త పార్లమెంటులో తమిళనాడు నుంచి సెంగోల్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

మోడీకి ఉన్న పాపులారిటీని ఉపయోగించుకుని తమిళనాడులో బీజేపీ పెద్ద ఎత్తునే ప్లాన్ చేస్తోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, అంతకుముందు కాంగ్రెస్ నేతలు ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు వరుసగా చిక్‌మంగళూరు, బళ్లారి, వాయనాడ్ నియోజకవర్గాల్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీని కన్యాకుమారి లేదా కోయంబత్తూరు స్థానాల్లో పోటీకి దింపాలనే ఆలోచనలో బీజేపీకి ఇది కూడా ఒక కారణంగా భావిస్తున్నారు. తమిళనాడులో అధికారమే లక్ష్యంగా బీజేపీ శ్రేణులు ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+