తహసిల్దార్ ఇంట్లో రూ. 300 కోట్ల విలువైన భూమి పత్రాలు, అనంతపురం జిల్లా సరిహద్దులో !

బెంగళూరు/అనంతపురం: ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటే చాలా సంతోషంగా జీవించడానికి అవకాశం ఉంటుందని చాలా మంది అనుకుంటారు. అయితే ప్రభుత్వ శాఖల్లోని కొన్ని ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు లక్షల్లో డబ్బులు చూస్తుంటారు. పేరుకు మాత్రమే ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటున్న ఆ అధికారులు కోట్ల రూపాయల అక్రమాస్తులు సంపాధిస్తున్నారు.

ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అవినీతి అధికారుల భరతం పట్టిన విషయం తెలిసిందే. ఐటీ హబ్ బెంగళూరులో తహసిల్దార్ గా ఉద్యోగం చేస్తున్న వ్యక్తి వందల కోట్ల రూపాయల విలువైన అక్రమాస్తులు సంపాధించారని వెలుగు చూడటం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. తహసిల్దార్ మాయా జాలం గురించి తెలుసుకున్న లోకాయుక్త అధికారులు షాక్ అవుతున్నారు.

lokayuktasearchesatkrpuramtehsildarshouse

బెంగళూరు నగరంలోని కేఆర్ పురంలో తహసీల్దార్ గా ఉద్యోగం చేస్తున్న అజిత్ రాయ్ అలియాస్ అజిత్ ఇంటిపై కర్ణాటక లోకాయుక్త అధికారులు దాడులు చేసి సోదాలు కొనసాగిస్తున్నారు. అజిత్ రాయ్‌కి సంబంధించిన 11 వేర్వేరు చోట్ల లోకాయుక్త అధికారులు సోదాలు చేశారు. అజిత్ రాయ్ అతని బంధువులు, స్నేహితుల పేర్లతో అక్రమంగా ఆస్తులు రిజిస్టర్ చేశాడని వెలుగులోకి వచ్చింది. ఆయన ఇంట్లో బినామీ ఆస్తుల పత్రాలు కూడా లభ్యమయ్యాయని కన్నడ మీడియా అంటోంది.

ఆదాయానికి మంచి అక్రమంగా తహసిల్దార్ అజిత్ రాయ్ ఆస్తులు సంపాధించారని లోకాయుక్త అధికారుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. తహసిల్దార్ అజిత్ రాయ్ ఆదాయానికి, ఆయన ఇంట్లో దొరికిన ఆస్తులకు చాలా వ్యత్యాసం ఉండటంతో అధికారులు హడలిపోయారు, బెంగళూరులోని సహకార నగర్‌లోని అజిత్ రాయ్ నివాసంలోనే మకాం వేసిన అధికారులు పలు పత్రాలు పరిశీలించారు.

lokayuktasearchesatkrpuramtehsildarshouse

ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా సరిహద్దులోని దొడ్డబళ్లాపూర్ (కర్ణాటక) సమీపంలో 98 ఎకరాల భూమి అజిత్ రాయ్ ఫ్యామిలీలోని కొందరి పేర్లతో ఉన్న దస్తావేజులను లోకాయుక్త అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్-కర్ణాటక సరిహద్దులోని ఆ 98 ఎకరాల భూమి విలువ రూ.300 కోట్లకు పైగా ఉంటుందని లోకాయుక్త అధికారులు చెప్పారు.

ఒకే చోట రూ. 300 కోట్ల విలువైన అక్రమాస్తులు సంపాధించిన తహసిల్దార్ అజిత్ రాయ్ ఇంకా ఎన్ని వందల కోట్ల అక్రమాస్తులు సంపాధించాడు ? అని లోకాయుక్త అధికారులు ఆరా తీస్తున్నారు. మొత్తం మీద బెంగళూరులోని కేఆర్ పురం డివిజన్ లోని అన్ని విభాగాల్లో పని చేసే ప్రభుత్వ అధికారులు వందల కోట్ల అక్రమాస్తులు సంపాధిస్తున్నారని వెలుగు చూడటంతో స్థానిక ప్రజలు షాక్ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా అజిత్ కు అక్రమాస్తులు ఉన్నాయని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+