జయ ఆరోగ్యం చాలా విషమం: లండన్ వైద్యుడి ప్రకటన, కాసేపట్లో గవర్నర్..
జయలలిత ఆరోగ్యం పైన లండన్ వైద్యులు రిచర్డ్ బాలే కూడా ప్రకటన చేశారు. జయ ఆరోగ్యం విషమంగా ఉందని తెలిపారు. అత్యవసర చికిత్స కొనసాగుతోందని డాక్టర్లు వెల్లడించారు.
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు అపోలో వైద్య వర్గాలు చెబుతున్నాయి. అపోలో వైద్యులు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సంతకాలు తీసుకుంటున్నారు. జయ ఆరోగ్యం పైన ప్రకటన చేయాలని అందరు కోరుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో అపోలో ఆసుపత్రి వర్గాలు అన్నాడీఎంకే ఎమ్మెల్యే ముందు కొన్ని షరతులు పెట్టారు. ఇందుకు ఎమ్మెల్యేల సంతకాలు కూడా తీసుకున్నారు.
తాము ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని, అమ్మ పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు వెల్లడించారని తెలుస్తోంది.

జయ ఆరోగ్యంపై లండన్ డాక్టర్ రిచర్డ్ బాలే
జయలలిత ఆరోగ్యం పైన లండన్ వైద్యులు రిచర్డ్ బాలే కూడా ప్రకటన చేశారు. జయ ఆరోగ్యం విషమంగా ఉందని తెలిపారు. అత్యవసర చికిత్స కొనసాగుతోందని డాక్టర్లు వెల్లడించారు. పరిస్థితిని ఎప్పటికి అప్పుడు పరీక్షిస్తున్నామన్నారు. అడ్వాన్సుడ్ లైఫ్ సపోర్ట్ పైన జయ ఉన్నారని చెప్పారు.
నిపుణులైన అపోలో, ఎయిమ్స్ వైద్యులు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. మన ప్రార్థనలే ఆమెను కాపాడాలని చెప్పారు. జయలలితను కాపాడేందుకు ప్రపంచంలోని ఆధునాత చికిత్సలు అందించామన్నారు. ఆమెను కాపాడేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
కాసేపట్లో గవర్నర్ విద్యాసాగర్ అపోలో ఆసుపత్రికి వచ్చి, ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది.
కాగా, జయలలిత ఆరోగ్యం విషమంగా ఉందని తెలియడంతో బీజేపీ పార్లమెంటరీ భేటీని ఎల్లుండికి వాయిదా వేసుకుంది. తొలుత రేపు (మంగళవారం) నిర్వహించాలని భావించారు. ఇప్పుడు బుధవారానికి వాయిదా వేశారు.
చెన్నైలో అమెరికా కాన్సులేట్ తన సేవలు నిలిపివేసింది. అప్రమత్తంగా ఉండాలని తన సిటిజన్లను అప్రమత్తం చేసింది. మరోవైపు, తమిళనాడుకు ఏపీ, కర్నాటక నుంచి బస్సులు నిలిచిపోయాయి. తమిళనాడు - కర్నాటక, కేరళ సరిహద్దుల్లో భద్రతను పెంచారు.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications