ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన పట్టణం.. ఇప్పుడు భారత్ లో.. ఎక్కడంటే..?

దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్ని తాకాయి. అయితే దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. బాణసంచా కాల్చడంపై సుప్రీంకోర్టు ఆంక్షలు విధించినా వాటి వినియోగం మాత్రం ఆగలేదు. దాంతో దేశ రాజధానిలో గాలి నాణ్యత మరింతగా దిగజారింది. ఈ ఏడాది దీపావళి రోజున గత ఐదేళ్లలో ఎన్నడూ లేనంత స్థాయిలో వాయు కాలుష్యం నమోదైనట్లు పలు కథనాలు వెల్లడిస్తున్నాయి. ఇక నగరమంతా దట్టమైన పొగమంచు, కలుషిత గాలి కలిసి కమ్ముకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే దిల్లీ నుంచి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న 'లోని' అనే పట్టణం.. ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన పట్టణంగా నిలిచింది. లోని పట్టణంలోని పీఎం 2.5 స్థాయిలు సరాసరిగా 112.5 గా ఉన్నాయి. వరల్డ్ బ్యాంక్ రికమండ్ చేసిన లిమిట్ ను దాదాపు 22 సార్లు అధిగమించినట్లు స్పష్టమైంది.

ఇక పరిశ్రమల నుంచి విష వాయువులు, గుంతలు పడిన రోడ్ల కారణంగా వచ్చే దుమ్ము, ధూళి అలాగే ప్రస్తుతం లోని పట్టణంలో నిర్మాణంలో ఉన్న భవంతులు కారణంగా అక్కడ గాలి నాణ్యత క్షీణించినట్లు గణాంకాలు వివరిస్తున్నాయి. ఐక్యూ ఎయిర్ అనే స్విస్ మానిటరింగ్ సంస్థ చేపట్టిన అధ్యయనంలో ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన 20 నగరాల లిస్టులో ఈ పట్టణం చేరింది. లోని లో ఇలాంటి విషపూరితమైన గాలి కారణంగా స్థానిక ప్రజలు కేన్సర్, గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. లోని పట్టణం ఇలా గ్యాస్ ఛాంబర్ లా మారడానికి అనేక కారణాలు ఉన్నాయి.

'లోని' పట్టణం చుట్టూ అనేక పరిశ్రమలు ఉన్నాయి. వీటి నుంచి వెలువడుతున్న విష వాయువులు అక్కడి ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అలాగే ఈ ప్రాంతంలో చిన్న తరహా పరిశ్రమలు కూడా ఉన్నాయి. వీటినుంచి నుంచి వెలువడే వ్యర్థాలు కూడా గాలి నాణ్యతను దెబ్బతీస్తున్నాయి. అలాగే కాలుష్యానికి మరో కారణంగా రోడ్లు సరిగా లేకపోవడం.

Loni During Diwali in UP becomes the most polluted town in the world up town delhi loni area news

దిల్లీలోని అనేక ప్రాంతాల్లో గుంతల రోడ్లు కారణంగా వాయి కాలుష్యం పెరుగుతోంది. మరోవైపు దిల్లీ, గాజియాబాద్ ప్రాంతాలకు దగ్గరగా లోని పట్టణం ఉన్న కారణంగా ఇక్కడ ఇళ్లను నిర్మించుకోవాలని చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో నిర్మాణాలు సంవత్సరం పొడవునా సాగుతున్నాయి. దాంతో నిర్మాణ రంగం నుంచి వచ్చే వ్యర్థాల కారణంగా కాలుష్యం పెరుగుతున్నట్లు స్పష్టం అవుతోంది. వీటితోపాటు అధిక జనాభా, భాగ్ పట్ లోని ఇటుక బట్టీలు కూడా కారణం అని సమాచారం అందుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+