మినీ స్కర్ట్స్ ఆధ్యాత్మిక దేవత రాధే మాపై లుకౌట్

ముంబై: తనను తాను ఆధ్యాత్మిక గురువుగా ప్రకటించుకొని ప్రజలను మోసం చేస్తోందంటూ ఫిర్యాదులు రావడంతో రాధే మా పైన ముంబై పోలీసులు శుక్రవారం నాడు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. గత నెల 27వ తేదీన ముంబైలోని కాందీవలీ పోలీసు స్టేషన్‌లో ఆమె పైన కేసు నమోదైంది.

దీంతో, పరారీలో ఉన్న ఆమె పైన పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కాగా, ఇప్పటికే మినీ స్కర్ట్స్ వేసుకొని ఆమె డ్యాన్స్ చేస్తున్న వీడియోలు యూ ట్యూబ్‌లో దర్శనం ఇస్తున్నాయి. భక్తి ముసుగులో ఆమె వ్యాపారం చేస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

చేతిలో త్రిశూలంతో పల్లకి పైన ఊరేగే రాధే మా వేలాదిమంది భక్తులను ఆకర్షించారు. ఆమె ఆశ్రమం ఎప్పుడు భక్తులతో నిండి ఉంటుంది. భక్తులు ఆమెకు పూజిస్తుంటారు. భజనలు చేస్తుంటారు. రాధే మాకు పాదాభివందనం చేసి మొక్కలు తీర్చుకుంటారు. ఆమెను ఎత్తుకొని డ్యాన్స్ చేస్తారు.

సినిమా ఐటమ్ గర్ల్స్ మాదిరి మినీ స్కర్ట్స్ వేసుకొని నాట్యం చేసింది. ఇది ఇంటర్నెట్లో హల్ చల్ చేసింది. దీంతో ఆమెను నాసిక్ కుంభమేళాకు రాకుండా నిషేధించారు. అశ్లీల నృత్యాలు చేసినందుకు రాధే మా పైన చర్యలు తీసుకోవాలని మహిళా నాయక్ ముంబై కోర్టులో కేసు వేసింది.

Look out Notice Issued against Radhe Maa

ఆ తర్వాత ఆమె పైన వరకట్న వేధింపులకు సంబంధించిన కేసు కూడా నమోదయింది. నక్కీ గుప్తా అనే మహిళ కేసు వేసింది. కోటి రూపాయల బంగారాన్ని వరకట్నంగా ఇచ్చినప్పటికీ తన అత్తమామలు, భర్త ఇంకా డబ్బు కోసం వేధిస్తున్నారని ఆరోపించింది.

రాధే మా భక్తులైన తన అత్తామామలు ఆమె ప్రోద్భలంతోనే అదనపు కట్నం అడుగుతున్నారని ఆరోపించింది. అయితే ఆ ఆరోపణలను రాధే మా ఖండించారు. ఎవరో ఉద్దేశ్య పూర్వకంగా తన పైన ఆరోపణలు చేస్తున్నారన్నారు.

రాధే మా పంజాబ్‌లోని ఓ మారుమూల గ్రామంలో జన్మించింది. తల్లిదండ్రులు ఆమెకు సుఖ్వీందర్ కౌర్. అని పేరు పెట్టారు. ఆమెలో అతీంద్రీయ శక్తులు ఉన్నాయని, శివుడి ఆరాధనలో ఉండిపోయింది. ఆ తర్వాత ఆమెకు మోహన్ సింగ్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. మళ్లీ కొద్ది రోజులకు ఆధ్యాత్మికంలోకి వెళ్లింది. కుటుంబ కష్టాలతో ఆమె దొంగ సన్యాసిగా మారింది.

ఆ తర్వాత ముంబై చేరి రాధే మాగా అవతరించింది. ఆమె వయస్సు 50 సంవత్సరాలకు పైగా ఉంటుంది. ముగ్గురు పిల్లల తల్లి కూడా. కాగా, వరకట్న గొడవలతో కుటుంబంలో గొడవలు రావడంతో ఆమె బయటకు వచ్చిందని, ఆ తర్వాత ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్లిందంటారు. ఇదిలా ఉండగా, పరారీలో ఉన్న రాధే మా ఔరంగబాదులోని హోటల్లో ఉండవచ్చునని వార్తలు వస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+